చాలామందికి తెలియదు ఈ శనగలు తింటే వచ్చే శక్తి శరీరానికి ఎన్ని రెట్లు బలం ఇస్తుందో……..

ఆరోగ్యానికి మేలు చేసే శనగలు :

పొట్టుతీసిన శనగపప్పును మనం అనేక వంటకాలలో వాడుతుంటాం . ప్రధానంగా ఈ శనగలని నానబెట్టి లేదా ఉడకపెట్టి , మొలకల రూపంలో నిత్యం తీసుకోవడం వలన ఎన్నో లాభాలు కలుగుతాయి మరియు పలు అనారోగ్య సమస్యలు కూడా తగ్గి పోతాయి

శనగల వల్ల మనకు ఎలాంటి ఉపయోగాలు ఉన్నాయో తెలుసుకుందాం:

రోజు మనం తినే ఆహార పదార్ధాలలో ఎన్నో పోషక విలువలు దాగి వున్నాయి పాలలో వుండే కాలిష్యం దాదాపు శెనగలలో కూడా లభిస్థాయి . శనగలు తరుచు తింటే రక్తంలో ఎర్రరక్తకణాలు సంఖ్య పెరుగుతుంది ,దీంతో రక్తం బాగా పడుతుంది ఇది రక్తహీనతో వున్నవారికి ఎంతగానో మేలు చేస్తుంది.

ఆరోగ్య ప్రయోజనాలు :- శనగలో రోగనిరోధక శక్తిని పెంచే గుణం వుంది ఇందులో వుండే మాంగనీస్ , మెగ్నీషియం శరీరానికి కావాల్సిన తక్షణ శక్తిని అందిస్తుంది . నానపెట్టిన శెనగలో పీచుపధారం ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఏవయసు వారయినా శెనగలు తింటే అరుగుతుంది మరియు అలాగే జీర్ణవ్యవస్థ పనితీరు మెరుగుపడుతుంది .

శనగలో అమైనో యాసిడ్లు , ట్రిప్టోపాన్ పోషకాలు సమృద్ధిగా ఉంటాయి ఇవి చక్కగా నిద్ర పట్టేలా చేస్తాయి దీంతో నిద్రలేమి సమస్య ఉండదు మరియు ఆందోళన వత్తిడి తగ్గిపోతాయి . ఇవి కొలెస్ట్రాలను తగ్గించడంతోపాటు గుండె ఆరోగ్యాన్ని మెరుగు పరుస్తుంది