చేతులు కాళ్లల్లో తిమ్మిరి ఎందుకు వస్తుంది,ఎలా తగ్గించుకోవాలి.

ఈరోజు మనము చేతులు మరియు కాళ్ళు లో అసలు తిమ్మిర్లు ఎందుకు వస్తాయో, దానికి మేజర్ కారణాలు ఏమిటి? దానికి మనం ఎలాంటి ప్రికాషన్స్ తీసుకోవాలి? మరియు ట్రీట్మెంట్ ఏ విధంగా చేయగలుగుతాము? అనేదాని గురించి తెలుసుకుందాం. ఎక్కువగా తిమ్మిర్లు చేతులు మరియు కాళ్లలో రావడాన్ని ఇంగ్లీషులో ‘పెరిఫెరల్ న్యూరోపతి’ అంటాము. అంటే మనం పడుకున్నప్పుడు, నచ్చినప్పుడు కాళ్లల్లో బాగా మంటలు రావడం, తిమ్మిర్లు లాగా అనిపించడం, వీటి వల్ల చాలా మందికి రాత్రి పూట నిద్ర కూడా పట్టక పోవడం వల్ల ఇవన్నీ జరగడం చాలా కామన్ గా ఉంటుంది.

మరింత సమాచారం కోసం ఈ వీడియో చూడండి.

ఇలాంటి లక్షణాలు ముఖ్యంగా నలభై, యాభై సంవత్సరాలు దాటినా వారిలో ఎక్కువగా కనిపిస్తుంది. ఎందుకంటే ఈ తిమ్మిర్లు రావడానికి ముఖ్య కారణం డయాబెటిస్. ఎవరికైతే డయాబెటిస్ కంట్రోల్ లో వుండదో వారికి ఈ నరాలు అనేటివి రోజు రోజుకీ బలహీన పడుతూ వస్తుంటాయి. ఎప్పుడైతే ఈ డయాబెటిస్ 5 నుంచి 10 సంవత్సరాల వరకు కంట్రోల్లో పెట్టుకోరో వాళ్లలో ఈ మంటలు రావడం, మరియు వేడి నీళ్ళు, చలి నీళ్లు మన పాదాలకు తగిలినపుడు మనకు స్పర్శ తెలియకపోవడం, చెప్పులు వేసుకునేటప్పుడు జారిపోవడం, ఇవన్నీ కామన్ గా జరుగుతూ ఉంటాయి. ఇలాంటి తిమ్మిర్లు ఎప్పుడైనా సరే మొదటగా కాళ్లల్లో ఏర్పడుతాయి, కాళ్లలో పాదాల తో మొదలయ్యే క్రమంగా పైకి పాకటం మొదలవుతాయి. కొన్ని రోజుల తర్వాత ఈ తిమ్మిర్లు చేతుల్లో వెళ్ళతో మొదలై మళ్లీ పైకి పడటం జరుగుతుంది ఇది కామన్ గా జరిగే ప్రోగ్రెషన్.

Numbeness in Pregnancy: Reasons & Tips to Cure

ఇంకా వేరే వాళ్లు అంటే రోజు ఆల్కహాల్ తీసుకుని ఆహారం సరిగా తీసుకోరో వాళ్లలో కూడా తిమ్మిర్లు వస్తుంటాయి. అలాగే డైట్స చేసే వారు సరైన డైట్ పాటించని వారికీ ఇలా జరుగుతువుంటుంది.ఇలాంటివి అన్ని రాకుండా ఉండాలంటే మొదటగా బాలెన్సుడ్ డైట్ అన్ని రకాల విటమిన్స్,మినరల్స్ వచ్చేలా చూసుకుంటే మనకి ఇలాంటి తిమ్మిర్లు రాకుండా చేసుకోవచ్చు.