జిల్లేడు గురించి తెలిస్తే ఆగరు…

జిల్లెడు చెట్టు వల్ల చాలా ఉపయోగాలు ఉన్నాయి అని అంటూ ఉంటారు. మరి జిల్లెడు చెట్టుని ఎలా వాడాలి ఎలాంటి అనారోగ్య సమస్యలకు వాడాలో తెలుసుకుందాం! జిల్లేడు ఆకుని శివరాత్రి వంటి సందర్భాలలో పూజకు ఎక్కువగా ఉపయోగిస్తుంటారు. జిల్లేడుఆకులను మాలకట్టి కూడా శివునికి వేస్తూ ఉంటారు. మరి ఈ జిల్లెడు చెట్టు ఆకు మానవునికి ఏ విధంగా ఉపయోగపడుతుంది అంటే !సహజంగా మన అందరికీ తెలిసే ఉంటుంది జిల్లేడు పాలను కంటిలో పిండితే కండ్లు పోతాయి అంటారు ఇది 100% వాస్తవమే. ఈ జిల్లేడు పాలలో ఆమ్లానికి ఎసిడిటీకి చెందిన పదార్థాలు ఉంటాయి కాబట్టి ఎక్కువ ప్రేగులను కొరికే లక్షణం ఉంటుంది. అందువల్ల పూర్వం రోజుల్లో రాజులు ఎవరైనా తప్పు చేస్తే వాళ్ళ కళ్ళల్లో జిల్లేడు పాలను పిండమని ఆదేశించే వారు, ఇలా చేయడం వల్ల కళ్ళు పోతాయి. ఇలా జిల్లేడు పాలు మానవులకు నష్టాన్ని చేకూరుస్తాయి.

వీటివల్ల మనకు ఏమైనా లాభం ఉందా అని ఆలోచిస్తే జిల్లేడు ఆకు తీసుకొని దాన్ని శుభ్రపరిచి కాస్త వేడి చేసి, మన శరీర భాగాలలో ఎక్కడైనా వాపుతో కూడిన నొప్పి ఉన్నట్లయితే ఆకులను అక్కడ పెట్టి కాపీనట్లయితే నొప్పి తగ్గుతుంది. నడుము దగ్గరగాని మడిమల దగ్గరగాని మోకాలు కానీ ఇలా ఎక్కడైనా సరే వాపుతో కూడిన నొప్పి ఉన్న ప్రదేశంలో మనం కాస్త కొబ్బరి నూనె కానీ నువ్వుల నూనె గాని లేపనంగా రాయాలి ఆ తర్వాత జిల్లేడు ఆకులు ఒక మోస్తరుగా వేడి చేసి ఆకు పైన పెట్టి ఒక బట్ట కట్టాలి. జిల్లేడు ఆకు ను వేడి ఎందుకు చేస్తారు అంటే లోపల ఉన్న పాలు యొక్క విష ప్రభావం వెళ్లిపోవడానికి ఇలా వేడి చేస్తారు. తర్వాత పత్రహరితం ఆకు పైకి రావాలి ఇలా వస్తే మన టిష్యూస్ కి బాగా పనిచేస్తుంది కాబట్టి ఆకును అలా పెట్టి కట్టినట్లయితే వాపుతో కూడిన నొప్పి తగ్గిపోతుంది. శరీరంలో ఏ భాగంలో వాపు తో కూడిన నొప్పి వచ్చిన ఇలా చేస్తే తగ్గిపోతుంది.జిల్లేడు పాలు అనేవి మోకాళ్ళ నొప్పులకు కూడా ఉపయోగపడుతూ ఉంటాయి అంటారు అవి ఎంతవరకు నిజం?

జిల్లేడు పాలు మోకాళ్ళ నొప్పులకు ఉపయోగపడడం అనేవి కేవలం అపోహ మాత్రమే. వాస్తవానికి జిల్లేడు పాలు చాలా ప్రమాదకరం కాబట్టి అలాంటి మోకాళ్ళపై పెడితే నొప్పి ఎలా తగ్గుతుంది, కావున ఇది కేవలం అపోహ మాత్రమే దీనివల్ల నొప్పి అనేది తగ్గే అవకాశమే లేదు. ఇంకా జిల్లేడు ఆకు వల్ల చాలా ముఖ్యమైన ఉపయోగం ఏమిటంటే జిల్లేడు ఆకులను శుభ్రపరిచి చిన్న చిన్న ముక్కలుగా కత్తిరించి ఒక కుండలో వేయాలి, ఆకులు ఎంత బరువు ఉన్నాయో చూసి దానిలో సగపాలు సైంధవ లవణం వేయాలి. తర్వాత కుండకు బట్టకట్టి వేడి చేస్తూ ఉండాలి, ఇలా వేడి చేస్తూ ఉండగా లోపల నుసి తయారవుతుంది అలాగే పై నుండి పొగలు కూడా వస్తాయి. అప్పటికి అది పూర్తిగా తయారయింది అర్థం, కాసేపటి తర్వాత చల్లారి నాక మనం ఆ మిశ్రమాన్ని బయటకు తీసుకొని మెత్తగా నూరుకొని సీసాలో భద్రపరుచుకుని వాడు కున్నట్లయితే సిర్రోసిస్ ఆఫ్ లివర్ అని చెప్పే చాలా పెద్ద జబ్బు వచ్చినప్పుడు దాదాపుగా చనిపోతూ ఉంటారు, బ్రతికే అవకాశాలు చాలా తక్కువగా ఉంటాయి. దీనికి వరల్డ్ వైడ్ గా సరైన వైద్యం లేదు ఈ సందర్భంలో మనం ఎప్పుడూ తయారు చేస్తున్న మందులు వాడినట్లయితే తప్పనిసరిగా బతికి బయట పడతారు. దీన్ని ఉదయం సాయంత్రం మజ్జిగలో కలుపుకుని భోజనానికి ముందు రెండు పూటలా రెండు గ్రాములు తీసుకున్నట్లయితే ఈ వ్యాధి నుండి బయట పడే అవకాశం ఉంది.