మీ మెడ చుట్టూ ఉన్న నలుపు 10 నిమిషాల్లో మాయం

కొంతమందికి మెడ మీద చర్మం నల్లగా ఉంటుంది, అది ఎన్ని ప్రయత్నాలు చేసినా సరే అసలు పోదు, పైగా అది చాలా వికారంగా కనిపిస్తుంది, దీనికి గల కారణాలు ఏమిటో, దీనికి ఎలాంటి రెమిడీస్ నీ పాటించాలో తెలుసుకుందాం! మొదటగా దీనికి గల కారణాలను తెలుసుకుందాం, అందరూ మామూలుగా మెడలో గొలుసులు వేసుకుంటూ ఉంటారు అవి కొంత మందికి ఎలర్జీ ని కలిగిస్తాయి. మరొకటి కొద్దిగా లావు ఉండడం, అదేవిధంగా కొంతమందిలో శుభ్రత తక్కువగా ఉండడం, తర్వాత ఆర్టిఫిషియల్ జువెలరీ వాడుకునేవారు, చెమట ఎక్కువగా వచ్చేవారు, తలకు పెట్టుకునే హెయిర్ కలరు హెన్నా వాటివల్ల కూడా మెడ అనేది నల్లగా తయారవుతుంది.కొంతమందికి ప్రెగ్నెన్సీ లో కొన్ని హెల్త్ ఇష్యూ వల్ల కూడా మెడ దగ్గర నల్లగా తయారవుతుంది, జనరల్ గా అయితే మన వెనకాల చర్మం నల్లబడితే నిమ్మకాయ రసం తీసిన తర్వాత ఆ ముక్కతో రుద్ధమని చెప్పేవారు.

కాని దీన్ని పూర్తి సరైన పద్ధతిగా భావించకూడదు ఇది కొంతమందికి సెట్ అవుతుంది కొంతమందికి సెట్ అవ్వదు. ఫిల్టర్ చేసిన కాఫీ పొడి లో కొద్దిగా చక్కెర ని యాడ్ చేసి కొద్దిగా తేనె ను ఆడ్ చేసుకుని నిమ్మకాయ డొప్ప తో క్లీన్ చేయండి ఇలా రెగ్యులర్ గా చేస్తూ ఉండాలి,ఇలా చేస్తే ఆయిల్ స్కిన్ ఉన్నవారికి చాలా బాగా పనిచేస్తుంది. మనం ఫేస్ కి ఎంత అయితే కేర్ తీసుకుంటామొ అదేవిధంగా మెడకు కూడా అంతే కేర్ తీసుకోవాలి. అలాగే మెడలో వేసుకున్న నగలను పడుకునే ముందు వెనకకు వేసుకుని పడుకోవడం, చెమట పట్టే కాలం లో ఎండాకాలం వంటి రోజుల్లో నగలను తగ్గించుకోవాలి, ఆర్టిఫిషియల్ నగలు పెట్టుకున్నప్పుడు, మెడ దగ్గర స్కిన్ ఎప్పుడు మాయిశ్చరైజ్ గా ఉండేలా చూసుకోవాలి. ఫేస్ పౌడర్, సన్ స్క్రీన్ లోషన్ ఇలాంటివి అప్లై చేసుకోవాలి. ఇలా చేయడం వల్ల డార్క్ నెస్ అనేది రాదు, అలాగే బయటనుండి రాగానే ఆ నగలను తీసి ముఖంతో పాటు మెడను కూడా శుభ్రంగా కడగాలి,

రోజ్ వాటర్ వంటి వాటిని అప్లై చేసుకోవాలి, రోజ్ వాటర్ అనేది స్ప్రేరూపంలో కూడా లభిస్తుంది, దీనిని జుట్టుని పైకి లేపి పట్టుకుని మెడ దగ్గర స్ప్రే చేసుకోండి ఇది కూడా మెడ దగ్గర డార్క్నెస్ తగ్గించుకోవడానికి ఒక మంచి పద్ధతి. అలాగే మెదడుకు సంబంధించిన ఎక్ససైజ్ చేయండి, శెనగపిండి పసుపు వంటి వాటితో నలుగు పెట్టుకోండి బాగా స్క్రబ్ చేయండి, కాఫీ పౌడర్ పంచదార, లేదంటే సోంపు పంచదార, సోప్ లిక్విడ్ లో కొద్దిగా ఆయిల్ వేసి బాగా మసాజ్ చేయాలి,ఇవన్నీ చేసినా కూడా అలాగే ఉంటే అది హెల్త్ ఇష్యూ కూడా కావచ్చు. మెడ దగ్గర లావుగా ఉండటం వల్ల మడత పడి కూడా మెడ దగ్గర నల్లగా ఉంటుంది, అందువల్ల మెడ ఎంత సన్నగా ఉంటాయి అంత డర్క్నెస్స్ తగ్గుతుంది, ఫేషియల్ వంటివి చేసుకునేటప్పుడు కూడా ఫేస్ తో పాటు నెక్ పై కూడా చేయించుకోండి ఇలా చిన్న చిన్న జాగ్రత్తలతో మెడ పై ఉండే నలుపు ను తగ్గించుకోవచ్చు.