నడుము నొప్పి తో పాటు 100రోగాలను నయం చేసే శక్తి దీనికి ఉందని మీకు తెలుసా

మన చుట్టూ ఉండే అనేక మొక్కలు మనకు నయంకాని మొండి రోగాలను నయం చేస్తాయని చాలామందికి తెలియదు, ఎవరైనా చెప్పినదానిని తమాషాగా తీసుకుంటారు, ఈ ప్రకృతిలోని మొక్కలను ఉపయోగించే అనేక వ్యాధులకు ఔషధాలను తయారు చేస్తున్నారు. అలాంటి మొక్కల ని మనం రోజూ చూస్తూనే ఉంటాం కానీ, వాటిని పనికిరాని మొక్కలు గా భావించి పీకి పారేస్తు ఉంటాం. మహాభారతంలో దుర్యోధనుని యొక్క వజ్ర దేహానికి కారణమయ్యింది ఒక ఆకుపసరు. అలాంటి అద్భుత మొక్కలు మన భూమి మీద ఉన్నాయి. అలాంటి మొక్కలు వందల సంఖ్యలో కనిపించే అతిబల మొక్క ఒకటి. ఈ మొక్కను దువ్వెన బెండ లేదా, ముద్ర బెండ లేదా, అతిబల లేదా, తుత్తురు బెండ లేదా, దువ్వెన కాయలు అనే ప్రాంతాన్ని బట్టి వివిధ విధాలుగా పిలుస్తారు.

ఈ మొక్కను దాదాపుగా అందరూ చూసే ఉంటారు, ఈ మొక్క అందరికీ తెలిసిన ఇందులోని ఔషద గుణాలు ఎవరికీ తెలియదు. ఇవి మన మధ్యలో పెరుగుతూ ఉంటాయి. పొలాల కంచర్ల వెంట రోడ్లకు ఇరువైపులా వందల సంఖ్యలో కనిపిస్తాయి కానీ, ఇది మనకు ఉపయోగపడే ఔషధమొక్కల అని అందరికీ తెలియదు. మన ఆంధ్ర, తెలంగాణ రాష్ట్రాలలో ఈ మొక్కలు ఎక్కడైనా కనిపిస్తాయి. చిన్న పిల్లల దగ్గర నుండి పెద్ద వారి వరకు అందరికీ పరిచయం ఉన్న మొక్క, ఈ అతిబల మొక్క, చిన్న పిల్లలు వీటి కాయలతో రక రకాల ఆటలు ఆడుతూ ఉంటారు, వీటి కాయలతో చిన్న పిల్లలు తల దువ్వుకుని సరదాగా ఆడుకునేవారు, అందుకే వీటికి దువ్వెన కాయలు అనే పేరు వచ్చింది.

Abutilon indicum (L.) Sweet | Jerantut, Pahang, Malaysia. (I… | Flickr

ఈ మొక్క అమితమైన బలాన్ని ఇస్తుంది కాబట్టి, దీనిని అతిబల అంటారు. దువ్వెన బెండ మొక్క యాంటీబ్యాక్టీరియల్ ధర్మాలను కలిగి ఉంటుంది. ఈ మొక్క లోని ప్రతి భాగం పూర్వం నుండి భారతీయ సంప్రదాయ వైద్యంలో, తమిళుల సిద్ధ వైద్యంలో మరియు భారతీయ ఆయుర్వేదంలో విరివిగా వాడుతున్నారు. ఈ మొక్కను అనేక రకాల వ్యాధులను చికిత్స గా వాడుతున్నారు. జ్వరం దగ్గు ఊపిరితిత్తుల వ్యాధి కి మూత్రనాళాల వ్యాధులు, కిడ్నీ లో రాళ్ళు కరిగించడనికి వాడతారు. పిచ్చి కుక్క కరిచిన చోట, దీని ఆకుల రసాన్ని రెండు స్పూన్లు తాగించి, ఈ ఆకుల రసాన్ని గాయంపై పిండి పిండిన ఆకు అంటే గాయంపై ఉంచి కట్టు కట్టాలి. ఇలా చేయడం వల్ల విష ప్రభావం తగ్గుతుంది. కీళ్ల నొప్పి లేదా కీళ్లవాతం ఉంటే వీటి ఆకుల పేస్టు కి, ఆవాల నూనె కలిపి పైన అప్లై చేస్తే తగ్గిపోతాయి.