నిమిషాల్లో అన్ని నొప్పులను తగ్గిస్తుంది రాస్తే చాలు ఆచార్య పోతారు…

నొప్పులు, ప్రపంచంలో చాలామంది ఇబ్బంది పడే సమస్య ఇది. కానీ ఈ నొప్పులు రావడానికి చాలా రకాల కారణాలు ఉంటాయి. డిజనరేటివ్ గా మన శరీరంలోనే లోపం ఏర్పడి రావడం ఒకటైతే చాలామందికి జీవితంలో ఎప్పుడో ఒకసారి ఎక్కడో ఒకచోట పడడం దెబ్బ తగలడం, ఆ నొప్పి తగ్గకపోవడం దాంతో ఈ నొప్పిని ఎలా తగ్గించుకోవాలి అని, పెయిన్ కిల్లర్స్ ని వాడుతూ ఉంటారు. అలాగని రోజు పెయిన్ కిల్లర్స్ వేసుకుని బతకాలంటే చాలా కష్టం కదా, ఎందుకంటే పెయిన్ కిల్లర్ మూడు గంటలు నాలుగు గంటలు మాక్సిమం 10 గంటల వరకు దాని ఎఫెక్ట్ అనేది ఉంటుంది. దాని తర్వాత దాని ఎఫెక్ట్ అనేది తగ్గిపోతుంది. అలాగే రోజు పెయిన్ కిల్లర్స్ వేస్తూ ఉండాలి అంటే, కొన్ని రోజులకు దాంతో చాలా రకాల సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయి.

https://youtu.be/d8Uy1lcNaJg

మరొక విషయం ఏమిటంటే చాలా మందికి పెయిన్ కిల్లర్ ఏదైనా ఉంటే, అది వేసుకోగానే వెంటనే గ్యాస్ సమస్య వచ్చేస్తుంది, మళ్లీ గ్యాస్ కోసం మరొక టాబ్లెట్ ని వాడాలి. గ్రామీణ ప్రాంతాల్లో మిగతా ఏ ప్రాంతంలోచూసినట్లయితే, నొప్పుల కోసం డాక్టర్ దగ్గరికి వెళ్తే ఒక పెయిన్ కిల్లర్ ఇచ్చి దాంతోపాటు గ్యాస్ కి సంబంధించిన టాబ్లెట్స్ కూడా ఇస్తారు. దీని యొక్క సైడ్ ఎఫెక్ట్స్ ని తగ్గించడానికి మరో రకం మందులు వాడాలి. కానీ వీటన్నిటికీ మందుల మీదనే మనం ఆధారపడాలా? అలా ఆధారపడకుండా వెంటనే నొప్పిని తగ్గించుకోవడానికి, మనకు అందుబాటులో చాలా రకాల పదార్థాలు ఉన్నాయి. వాటన్నిటిని మనం రకరకాలుగా ఉపయోగించవచ్చు కానీ, కొంతమందికి ఏ పదార్థం దొరకకపోయినా ఇంట్లో కొన్ని రకాల పదార్థాలు అందుబాటులో ఉంటాయి.

అదేమిటంటే సున్నము డబ్బా, దీన్ని తాంబూలంలో వేసుకోవడానికి వాడుతారు. ఎవరికైనా చిన్నపాటి మోకాళ్ళ నొప్పులు లేదా నడుము నొప్పులు ఇలాంటివి ఉంటే, ఇది కాల్షియం డెఫిషియన్సీ వల్ల వచ్చిందని, క్యాల్షియం టాబ్లెట్స్ వాడుతారు. దానికంటే మీరు ఈ యొక్క సున్నాన్ని తమలాపాకులు పెట్టి నమిలి తింటుంటే, పోక చెక్కలు కానీ మొక్కలు కానీ వాడకుండా ఏ లవంగము, లేదా దాల్చిన చెక్క యాలక్కాయ వేసుకొని నమిలితే మీకు కాస్త నొప్పులు తగ్గుతాయి. ఇప్పుడు మనం చెప్పేది ఏమిటంటే నొప్పి ఉన్న దగ్గర సున్నాన్నిపైపూతగా ఎలా వేసుకోవాలో చూద్దాం. దీనికోసం మనకు కావాల్సింది సున్నము మరియు రెండు నిమ్మకాయలు. సున్నము అనంగానే చాలామంది భయపడతారు దీన్ని వస్తే ఎక్కడైనా పొక్కుతుందేమో అని సందేహం ఉంటుంది, దీంట్లో ఆల్కలీన్ గుణాలు ఉంటాయి.

మనకు ఏసిడిక్ గా పని చేయడానికి నిమ్మకాయ ఉంది ఇది రెండు కూడా బ్యాలెన్స్ అవుతాయి. తర్వాత మనం తీసుకునేది తేనె. ముందుగా మనం కల్వంలో (చిన్న రోలు )కి సున్నాన్ని వేసుకోవాలి, ఈ సున్నాన్ని మీరు మీ సమస్యను బట్టి తగు మోతాదులో వేసుకోవాలి, ఇక్కడ ఎంత మోతాదు అనేది అక్కర్లేదు సున్నం ఒక స్పూన్ వేసుకున్నట్లయితే తేనె కూడా ఒక స్పూన్ అంత వేయాలి. సున్నంతో సరి సమానంగా తేనెను వెయ్యాలి, అలాగే నిమ్మరసాన్ని ఒక స్పూను సున్నానికి రెండు నిమ్మకాయలను తీసుకుంటే సరిపోతుంది. ముందుగా మనం చిన్నపాటి రోలు లో వేసుకొని బాగా మర్దన చేయాలి, తర్వాత మనం తేనెను వేసుకొని బాగా కలుపుకోవాలి, తర్వాత ఇప్పుడు నిమ్మకాయలను తీసుకొని రసాన్ని పిండుకోవాలి, ఇప్పుడు వీటన్నిటిని బాగా కలుపుకోవాలి. దీన్ని మనం ముఖ్యంగా నొప్పులు ఉండే చోట ప్యాక్ లాగా అప్లై చేసుకోవాలి, ఇలా మనం రాత్రి పడుకునే ముందు ఉన్నట్లయితే ఉదయం వచ్చేసరికి ఆ నొప్పి అనేది తగ్గుతుంది.