నెమలి ఈకలు ఇంట్లో ఉంటే ఏమవుతుందో తెలుసా….

ఈరోజు ప్రశ్న ఏమిటంటే నెమలి పించం ఇంట్లో ఉండవచ్చా? ఇది ఇప్పటివరకు కాస్త కొత్త విషయంగా అనిపిస్తుంది, ఇంతకు ముందు రోజుల్లో నెమలిపించాలను పుస్తకాల్లో పెట్టుకుని అది పిల్లల్ని పెడుతుందని వాటికి మేత వేసేవారు, దీనికి మేత అంటే తాటి చెట్టు కమ్మలు ఉంటాయి కదా ఆకుల మధ్య ఒక జెగురు రంగులో ఉండే పొడి ఉంటుంది అది తీసుకువచ్చి దీనికి మేత వేసేవారు. నెమలి పించాన్ని ఏ పుస్తకంలో పెట్టుకుంటే ఆ పాఠం బాగా వస్తుంది అని నమ్మేవారు, చిత్రం ఏమిటంటే నెమలికన్ను పెట్టుకున్న పుస్తకం లో వారికి తరగతిలో అద్భుతమైన విజ్ఞానం వచ్చేది. అందరూ ఏమనుకునేవారు అంటే నెమలికన్ను పెట్టుకోవడం వల్ల ఇంత విజ్ఞానం వస్తుంది అని కానీ దాని వెనకాల ఉన్న అద్భుతమైన రహస్యం ఉంది. అలాగే నెమలికన్నులను ఇంట్లో పెట్టుకోవచ్చు, ఇప్పటికీ కూడా ఇటలీ లాంటి ప్రాంతాలలో చాలామంది అవసరాన్ని మించి ఎక్కువ తిన్న తర్వాత కొంచెం పొట్ట బరువెక్కుతుంది, దానికి వాళ్లు ఏం చేస్తారంటే టాబ్లెట్స్ వేసుకోవడం లేదా వేరే ద్రవ్యాలను వాడడం లాంటివి చేయరు నెమలి ఈకలు ఉన్న కట్ట తీసుకొని పొట్ట మీద పైకి కిందికి రాస్తూ ఉంటారు, ఇది ఇప్పటికీ నడుస్తున్న ఆచారం అక్కడ. అజీర్ణం చేసేటటువంటి రోగాలకి ఏది కారణము అది పోగోడుతుంది, అలాగే కొంతమంది నెమలిఈకలతో దిష్టి తీస్తారు మనకు నెమలి కన్నుల గురించి ఇంతవరకే తెలుసు.

నెమలి కన్నులకు ఉన్న విశేషం ఏమిటంటే ఇది ఆధునిక యుగం వారు ఒప్పుకోకపోయినా ఇది నిజమైనది, నెమలి ఈకను ఎవరు ధరిస్తారు అంటే కృష్ణ పరమాత్మ ధరిస్తాడు, ఎందుకు ధరిస్తాడు, ఆయనకి అష్టభార్యలు ఉన్నారు తర్వాత రాధాదేవి ఉంది 60 వేల మంది గోపికలు ఉన్నారు, అయినా కానీ స్వామి పేరు బ్రహ్మచారి. దీని వెనకాల రహస్యం చెప్పడానికే స్వామి వారు నెమలి పించం ధరించారు, ఎందుకోసం అంటే ఆయన బ్రహ్మచారి కనుకనే పరీక్షతో బతికాడు, ఆయన బ్రహ్మచారి కనుకనే అర్జునుడి శిరస్సు లేచిపోతే తిరిగి వచ్చింది ఎందుకంటే కారణం ఒక్క నెమలి మాత్రమే సంయోగం సంపర్కం లేకుండా తోటి నెమలితో గర్భాన్ని ధరించి గుడ్లు పెట్టి పిల్లల్ని కంటుంది. మగ నెమలి నాట్యం చేస్తుంటే దాని కంటి వెంట కంటి చుక్కలు జారుతాయి, ఈ నీరు కూడా ఒకటి రెండు చుక్కలు మాత్రమే కారుతాయి, అప్పుడు ఆడ నెమలి వెళ్లి వీటిని తాగి గర్భం ధరిస్తుంది. ఇది ఆఫ్రికా వంటి దేశాల్లో కూడా పరిశోధన చేసి నిరూపించబడింది. ఇది బ్రహ్మచర్యానికి సంకేతము అంటే కృష్ణ పరమాత్మ కి ఇంతమంది భార్యలు గోపికలు ఉన్నప్పటికీ కూడా ఆయన బ్రహ్మచర్యంలో ఉన్నాడు. ఇది బ్రహ్మచార్యానికి సంకేతం దీనికి సంకేతంగా నెమలిని కృష్ణ పరమాత్మ ధరిస్తాడు.

అందుచేత కృష్ణ పరమాత్మ ధరించాడు కనుక కృష్ణ పరమాత్మ ఎన్నో రోగాలని తొలగించాడు, ఒక్కసారి కృష్ణ పరమాత్మ చేతిలో మరణించిన రాక్షసుల పేర్లు చూసినట్లయితే ఆ రాక్షసుల పూర్వజన్మ వృద్ధాంతం హరివంశంలో ఉంది భాగవతంలో ఉంది, ఒక్కొక్క రాక్షసుడు ఒక్కొక్క రోగానికి సంకేతం,ఒక్కొక్క రాక్షసుడు ఒక్కొక్క విద్యకు సంకేతం అంటే నెమలికన్ను ఇంట్లో ఉన్నందువల్ల రోగ నివారణ జరుగుతుంది,నెమలి కన్నులు ఇంట్లో ఉండడం వల్ల మన పిల్లలకి చక్కటి ఆలోచన విధానము విద్యాభ్యాసం లభిస్తుంది. అంతేకాకుండా మన బుద్ధి సంసారంలో సుఖాలను అనుభవిస్తూనే ఉంటారు కానీ మన ఆలోచనలు ఎప్పుడూ ఉన్నతంగా ఉంటాయి. బలవంతంగా నెమలిని చంపితే వచ్చే ఈకలు ఉపయోగించవు, నెమలి నాట్యం చేస్తుంటే తనంతట తాను జారిపడాలి అవే నెమలి ఈకలు మనం ఇంట్లో పెట్టుకోవచ్చు. నెమలి ఈకలు అంత ఖరీదు ఎందుకు ఉంటాయి అంటే, నెమలి నాట్యం చేస్తున్నప్పుడు ఈ నెమలి ఈకలను సేకరించడం చాలా కష్టం కాబట్టి వీటిని సేకరించడం చాలా కష్టం కాబట్టి నెమలి కన్నుల కట్ట అది చిన్నదైనా పెద్దదైనా సరే అంతా ఖరీదు ఉంటుంది. వీటిని అటవీ సంబంధమైన కొన్ని శాస్త్రాలు ఉన్నాయి వాటిలో విస్తారంగా చెప్పారు, అందుచేత నెమలి కన్నులు ఇంట్లో ఉండడం శ్రేయస్కరమే దోషము ఏమి ఉండదు, ఇది క్షేమకరము శుభకరము.