పరిగడుపున ఈ మొక్క ను తింటే 100 ఏళ్ళు బ్రతుకుతారు…

ప్రకృతిలో ఎన్నో రకాల పూలు, మొక్కలు , పండ్లు,కాయలు ఆఖరికి మొక్కల వేర్లుకూడా మనిషికి ఎంతో ఉపయోగపడతాయి. అటువంటివాటిలో ఔషధాల సిరి నేల ఉసిరి వల్ల ఎన్ని ఉపయోగాలు ఉన్నాయో తెలిస్తే ఈ మొక్కను పెరటిలో పెంచుకోక మానరు. నేల ఉసిరి మొక్క ఒక ఔషధాల నిధి, నేల ఉసిరి వేర్ల నుండి ఆకు వరకు అన్నీ ఉపయోగాలే. అయితే ఇప్పుడు మనం నేల ఉసిరి చెట్టు వల్ల మనకు కలిగే ప్రయోజనాలు ఏమిటో ఇందులో ఎటువంటి ఔషధగుణాలు దాగి ఉన్నాయో అలాగే ఏ ఏ వ్యాధులు తగ్గించుకోవడానికి ఏ వ్యాధులు తగ్గుముఖం పట్టే లాగా ఈ నేల ఉసిరి చెట్టు మనకు ఉపయోగపడుతుందో, తదితర పూర్తి వివరాలు తెలుసుకుందాం!మన పెరట్లో పెరిగే ఎన్నో రకాల మొక్కలు మనకు ఎంతో ఉపయోగకరమైనది. మన చుట్టూ పెరిగే ఎన్నో మొక్కలు మనకి దివ్య ఔషధాలు.

కానీ మనం వాటిని గుర్తించలేము, ఒకవేళ గుర్తించిన నిర్లక్ష్యం చేస్తున్నాం. అటువంటి జాతికి చెందిందే ఈ నేల ఉసిరి మొక్క, దీన్ని కూడా మనం చూసీచూడనట్లు వదిలేస్తున్నాము. ఈ మొక్కతో మనం ఎన్నో రకాల సమస్యలకు చెక్ పెట్టవచ్చు. చిన్న చిన్న ఆకులతో ఉండే ఈ మొక్క ఎన్నో రుగ్మతలకు వ్యాధుల నివారణకు ఉపయోగపడుతుంది. నేల ఉసిరి మొక్క కు ఆయుర్వేదంలో చాలా విశిష్టత ఉంది, నేల ఉసిరి కాండం, వేర్లు, కాయలు ,ఆకులు, ఈ మొక్క నుండి వచ్చే పాలు అన్నీ కూడా ఆయుర్వేద మందుల్లో ఉపయోగిస్తూ ఉంటారు. ఈ మొక్క మొత్తం లో కూడా ఉపయోగపడే ఔషధగుణాలు ఉండడం విశేషం. అనేక రుగ్మతలకు వ్యాధులకు ఇది ఇది విస్తృతంగా వైద్య విధానంలో ఉపయోగపడుతుంది.

మనిషిలో హెపటైటిస్-బి వైరస్ ని అరికట్టడానికి ఇది ఔషధంగా ఉపయోగిస్తారు, ఈ యొక్క ఔషధం కషాయంతో హెపటైటిస్ బి అనే వైరస్ ని అరికట్టవచ్చు. చాలా వరకు కూడా ఈ నేల ఉసిరి ఆకు కషాయం ఇందుకు తోడ్పడుతుందని మన శాస్త్రవేత్తలు తెలియజేస్తున్నారు. నేల ఉసిరి లో యాంటీ బ్యాక్టీరియల్, యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలు వంటి అనేక ఔషధ లక్షణాలు చాలా ఉన్నాయి. నేల ఉసిరిని జ్యూస్ లా తీసుకుంటే పొత్తి కడుపులో మంట తగ్గిపోతుంది. మూత్ర విసర్జనలో మూత్ర ఇన్ఫెక్షన్స్ని ఇది తగ్గిస్తుంది, దీనిని శరీరంలో దురద, గాయాలు, గజ్జి వంటి చికిత్స లో కూడా ఈ నేల ఉసిరి ఉపయోగిస్తున్నారు.

కాలేయం నుంచి పిత్త ఉత్పత్తిని పెంచుతుంది, శరీరంలో ఎసిడిటీ ఆమ్లత్వం నుండి ఉపశమనం పొందడానికి నేల ఉసిరి మంచి ఔషధంగా ఉపయోగపడుతుంది. మలబద్ధకాన్ని నివారిస్తుంది, జీవక్రియను మెరుగుపరుస్తుంది, కాలేయ పనితీరును చురుకుగా చేస్తుంది. నేల ఉసిరి జ్యూస్ కిడ్నీ స్టోన్స్ తో పాటు ఇతర కిడ్నీ వ్యాధులనుండి ఉపశమనాన్ని కలిగిస్తుంది. కామెర్లు కాలేయ ఆరోగ్యానికి నేల ఉసిరి ఒక దివ్య ఔషధం అని చెప్పాలి. కాలేయం సమస్యల వల్ల ఏర్పడే కంటి సమస్యలకు చికిత్స చేయడానికి నేల ఉసిరి రసం ఎంతో మంచిది. ఈ రసాన్ని ఉదయం ఒకసారి ఖాళీ కడుపుతో ఒక గ్లాస్ గోరు వెచ్చని నీటితో సేవిస్తే కంటి ఆరోగ్యం మెరుగుపడుతుంది. షుగర్ వ్యాధి గ్రస్తులకు ఈ జ్యూస్ చాలా మంచిది. కాలేయ ఆరోగ్యాన్ని మెరుగు పరచడంతో పాటు నేల ఉసిరి రక్తంలో గ్లూకోజ్ స్థాయిలను నియంత్రించే సామర్థ్యం కి ప్రసిద్ధి చెందింది. కామెర్లు ఉన్నవారు ఈ మొక్క వేళ్లను తెచ్చుకొని రోట్లో వేసి మెత్తగా వచ్చినటువంటి యొక్క రసాన్ని పెరుగులో కలుపుకొని ఉదయం సాయంత్రం తాగితే కామెర్లు వెంటనే తగ్గిపోతాయని మన ఆయుర్వేద నిపుణులు తెలియజేస్తున్నారు.