పాత కాలం నాటి చిట్కా ఇప్పటి వరకు ఎవరికీ తెలియదు ఈ ఆకుతో ఇలా చేస్తే తలనొప్పి మటుమాయం

ఆముదం లేదా కాస్టర్ ఆయిల్ ఈ మధ్యకాలంలో మన అందరికి ఎక్కువగా వినిపిస్తున్న పేరు .ఆముదం యొక్క ఆరోగ్య ప్రయోజనాల గురించి మన అందరికి తెలిసిందే . శరీరంలో మలబద్దకం ,గ్యాస్ ,ఉబ్బరం వంటి ఎన్నో సమస్యలను ఆముదం తగ్గిస్తుంది . అలాగే జుట్టు సమస్యలైన జుట్టు రాలడం ,జుట్టు పలుచబడటం ,చుండ్రు ,జుట్టు చిట్లడం ,వంటి సమస్యలను చాలా బాగా నివారణ చేస్తుంది . చిన్న పిల్లల్లో ,ముసలి వారిలో విరోచనాలు అవ్వక ఇబ్బంది పడేవారికి ఆయుర్వేదం ప్రకారం ఆముదం కొద్ది మొత్తంలో ఇస్తూ వుంటారు ఇలా ఇవ్వడం వలన సుఖ విరోచనం అవుతుంది .ఇన్ని ఆరోగ్య ప్రయోజనాలు ఉన్న ఆముదం నూనె మాత్రమే కాకుండా ఆకులు కూడా చాలా ప్రయోజనాలను అందిస్తుంది ఆముదం చెట్టు నుండి వచ్చే గింజలతో ఆముదం నూనె తాయారు చేస్తారు .ఆముదంలో కూడా రెండు రకాలు ఉంటాయి . ఒకటి వంటకు ఉపయోగించేది మరొకటి ఇంధనంగా ఉపయోగించేది .

ఆముదం చెట్టు ఆకులను తలనొప్పి ,తలలో వేడి ని తగ్గించడానికి ఉపయోగిస్తారు . దానికోసం ఆముదం ఆకులను సేకరించి వాటిని శుభ్రంగా కడిగి వాటిని తలపై పెట్టుకొని రాత్రంతా అలానే ఉంచడం వలన తలలో వేడిని తగ్గిస్తుంది . అలాగే తలనొప్పి ఎక్కువగా వున్నప్పుడు ఈ ఆకులకు ఆముదం నూనె లేదా నువ్వుల నూనె రాసి నిప్పులపై ఆ ఆకును వేడిచేసి తలపై వేసి దారంతో కట్టుకోవడం వలన అటు ఇటు కదలకుండా ఉంటుంది . తర్వాత ప్రశాంతంగా పడుకుంటే తలనొప్పి సమస్య చాలా త్వరగా తగ్గుతుంది . ఇది చిన్నతనంలో చాలా మందికి అనుభవంలో ఉండే ఉంటుంది . అప్పట్లో అంతగా మందులు అందుబాట్లో లేనప్పుడు ఈ పద్దతిని అనుసరించేవారు .

ఆముదం ఆకుల ఆరోగ్య ఉపయోగాలు /Castor Leaves Benefits And Uses/ Castor Oil  Plant Leaf Benefits And Uses - YouTube

ఇప్పుడు రకరకాల మందులు అందుబాటులోకి వచ్చే సరికి నొప్పి రాగానే మందులవెంట పడుతున్నాం . మందులు వాడటం వలన అనేక అనేక సేడ్ ఏవేక్ట్స్ కు గురవుతున్నాం అందుకే విలైంతవరకు సహజ సిద్దమైన చిట్కాలతో చిన్న చిన్న వ్యాధులను తగ్గించుకోవచ్చు .మనకు అనేక మంది ఋషులు ,మహర్షులు అందించిన ఇటువంటి ఆయుర్వేద చిట్కాలు తక్షణ ఉపశమనం ఇవ్వడానికి చాలా బాగా పని చేస్తాయి.