పారాసిటమాల్ గురించి పూర్తి వివరణ….

పారాసిటమాల్ వినియోగం కోవిడ్ టైం లో ఎక్కువగా పెరిగింది, మరి పారసిటమాల్ ను వాడడం వల్ల ఏమైనా సైడ్ ఎఫెక్ట్స్ ఉన్నాయా? ఏ టైం లో తీసుకోవచ్చు?దీని గురించి పూర్తి వివరాలు తెలుసుకుందాం!పారసిటమాల్ ను ఏ కాస్త దగ్గు, జలుబు, జ్వరం అనిపించినా కూడా దీనిని వాడుతున్నారు, ఎక్కువ దీనిని వాడడం వల్ల ఏమైనా సైడ్ ఎఫెక్ట్స్ ఉన్నాయా?పారాసిటమాల్ అనేది ఎప్పటినుండో వాడకంలో ఉంది, నిజానికి పారాసెటమాల్ తయారీ 1877లో జరిగింది, 1950 నుండి దీనిని వాడుతున్నారు దీనినే జాన్ ఆఫ్ఘన్ యూనివర్సిటీ అని చాలా ప్రశస్తమైన ఆసుపత్రి అమెరికాలో తయారు చేశారు.ఈ పారసిటమాల్ ను పుట్టిన బిడ్డ దగ్గర నుండి వృద్ధాప్య ముసలివారి వరకు అందరూ, అన్ని సమయాల్లోనూ వాడే మందు పారాసెటమాల్. అంటే ఇది ఎంతో ఇష్టమైన మందు అనేది మనం అర్థం చేసుకోవచ్చు, కోవిడ్ సమయంలో దీని వాడకం అనేది చాలా ఎక్కువ అయింది, చిన్న పిల్లలు ,పెద్దలు ,గర్భిణి స్త్రీలు కూడా వాడే ప్రశస్తమైన మందు, ఇంతవరకు బాగానే ఉన్నా కూడా, ఎవరికైనా ఆల్కహాల్ తీసుకునే అలవాటు ఉంటే, వారు డాక్టర్స్ కి అలవాటు ఉంది అని ముందుగానే చెప్పాలి.

డాక్టర్స్ కూడా పేషెంట్స్ ని ఆల్కహాల్ తీసుకునే అలవాటు ఉందా అని అడగాలి, ఒకవేళ ఉన్నట్లయితే దానిలో సగం మాత్రమే వాడాలి , లేదంటే లివర్ కి ప్రాబ్లం వచ్చి హాస్పటల్లో జాయిన్ అవ్వాలి వస్తుంది, ఎవరికైతే మూడుసార్లు రోజుకు మద్యం తీసుకునే అలవాటు ఉంటుందో వారికి రెండు గ్రాముల కంటే ఇవ్వకూడదు. లివర్ మరియు కిడ్నీలో రాళ్లు వంటి సమస్యలతో బాధపడుతున్న వారికి బాడీ డీహైడ్రేట్ అయినటువంటి వారికి బి.పి ఉన్నవారికి, ఈ మందును వేసుకునే ముందు ఆలోచించాలి, అంతేకాకుండా ఈ మందులు పోస్ట్ కూడా చాలా ముఖ్యమైనది, చిన్న పిల్లల్లో అయితే వారిని బరువును బట్టి ఇస్తారు 10-15 కిలోల బరువు ఉన్న వారికి 10-15 మిల్లిగ్రాముల మందు ఇస్తారు, కాబట్టి ఎంత ప్రశస్తమైన మందు అయినప్పటికీ వాటిలో ఎంతో కొంత సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి కాబట్టి వాటిని వేసుకునే ముందు చాలా జాగ్రత్తగా ఆలోచించి వేసుకోవాలి.పారాసెటమాల్ ను సాధారణ వ్యక్తులు 4 గ్రాములు తీసుకోవడం వల్ల ఎటువంటి నష్టం లేదు, 6 గ్రాముల కంటే ఎక్కువ తీసుకుంటే మూత్రపిండాల మీద కానీ లివర్ మీద కానీ ఎఫెక్ట్ పడే అవకాశం ఉంటుంది.

కొంతమందికి ఏకో స్ప్రిన్, మరియు పారసిటమాల్ రెండు ఒకటేనా అని డౌట్ ఉంటుంది, ఇవి రెండు ఒకటి కావు ఏకో స్ప్రిన్ అనే దానిలో ఏసీటైల్ సాలిసిలిక్ యాసిడ్ ఉంటుంది, పారాసిటమాల్ లో ఏసిటమైనో ఫర్ అనే మందు ఉంటుంది, అసలు మందు ప్రజలకు ఇంత బాగా ఎలా ఉపయోగపడుతుందని చాలామంది ప్రశ్న, మెదడు లోపల ఒక రకమైన ఎంజైమ్ ఉంటుంది,దాని మీద పని చేసి జ్వరం తగ్గడం, శరీర నొప్పులు తగ్గడానికి ఉపయోగపడుతుందని చెప్తారు.పారసిటమాల్ పడని వారికి కొందరిలో వాంతులు అవ్వడం, ఆకలి లేకపోవడం, జాండీస్ రావడం ఇవన్నీ కూడా చిత్రంలో అవకాశం ఉంటాయి, ఇంకా లక్షణాల కోసం సైడ్ ఎఫెక్ట్స్ వస్తే చర్మం మీద దద్దుర్లు రావడం, చర్మ ఎలర్జీస్ రావడం, తల తిరగడం ఇలా ప్రతి అవయవం మీద ఎఫెక్ట్ పడుతూ ఉంటుంది, ముఖ్యంగా లివరు, మూత్రపిండాల మీద పడుతుంది. కాబట్టి పారసిటమాల్ వాడకం అనేది రకరకాలుగా ఉంటుంది, సిరప్ ఉంటుంది, టాబ్లెట్స్ ఉంటాయి, చూయింగం టాబ్లెట్స్ ఉంటాయి, ఇంజక్షన్ వంటి రూపాల్లో ఉంటాయి ఏదైనా సరే డోస్ అనేది మితంగా ఉండాలి, ఏవైనా సైడ్ఎఫెక్ట్స్ కనిపించినట్లయితే డాక్టర్ గారిని సంప్రదించాలి.