పైసా ఖర్చు లేకుండా నడుము నొప్పిని తగ్గించే అద్భుత ఔషధం .

గడ్డి చామంతి అని పిలిచే ఈ మొక్క మనకు ఎక్కడ పడితే అక్కడ ఎక్కువ సంఖ్యలో పసుపు పచ్చని పూలతో కలుపుమొక్కగా కనిపిస్తూ ఉంటుంది .దీని ఔషధ విలువల గురించి అవగాహన లేక కలుపు మొక్కగా బావించి పీకేస్తుంటారు .ఈ మొక్క అనేక రకాల ఔషధ గుణాలను తనలో దాచుకుంది .ఈ మొక్కకు సాంప్రదాయ ఆయుర్వేద ఔషధంలో ప్రత్యేక స్థానం ఉంది . సాంప్రదాయకంగా గడ్డి చామంతిని గాయాలు నయం చేయడానికి అనేక రకాల ఉపశమనానికి చికిత్సలో ఉపయోగిస్తూ ఉంటారు .దీని శాస్త్రీయ నామం ట్రిడాక్స్ ప్రొక్యూoబెన్స్ .భారతదేశంలో గాయం నయం చేసేందుకు చాలా బాగా ఉపయోగపడుతుంది .దీని యాంటీ కొగ్యులెంట్ ,యాన్తి ఫంగల్ లక్షణాలు అనేక ఇన్ఫెక్షన్ల నుండి మనల్ని రక్షిస్తాయి

వర్షాకాలంలో అనేక రకాల వ్యాధులు దోమల వలన వస్తూ ఉంటాయి .ఈ మొక్క క్రిమి వికర్షకంగా పనిచేస్తుంది .దీనిని ఇంటి మధ్యలో ఉంచి లైట్లు అపి తలుపులు మూసేస్తే దీని వాసన వలన దోమలు చనిపోతాయి .మిగిలినవి బయటకు వెళ్లిపోతాయి .ఈ మొక్క ఆకులను పలకలకు ,బోర్డులు నల్లగా రావడం కోసం ఉపయోగిచబడుతోంది . దీని ఆకు సారం జానపద ఔషధాలలో అంటు చర్మ వ్యాధుల నివారణగా ఉపయోగించబడింది .ఇది కాలేయ రుగ్మతులు ,హెపాటోప్రొటెక్షన్ ,పొట్టలో పుండ్లు మరియు గుండెల్లో మంట కోసం ఆయుర్వేద వైద్యంలో ఉపయోగించబడుతుంది . భారతదేశంలోని కొన్ని ప్రాంతాలలో స్థానిక వైద్యులచే దిమ్మలు ,తామర ,గజ్జి ,బొబ్బలు మరియు కోతలకు ఈ గడ్డి చామంతి చికిత్సగా కూడా ఉపయోగించబడుతుంది .

ఈ మొక్క కనిపిస్తే వేర్లను కూడా వదలకండి ఎందుకంటే || Gaddi chamanthi mokka  upayogalu - YouTube

ఈ మొక్క యొక్క యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాల వలన నడుము నొప్పి ,వెన్ను నొప్పి సమస్యలను తగ్గించుకోవచ్చు .గాయం తగిలిన చోట ఈ ఆకు రసాన్ని పిండి కట్టుకడితే నొప్పులు తగ్గిపోతాయి .ఈ ఎండిన ఆకులను పొగ వేస్తే క్రిమి కీటకాలు ,దోమలు ,ఈగలు వంటివి ఇంట్లోకి రావు .వీటి ఆకులను ఆకుకూరగా కూడా తింటుంటారు .వీటిని పలక ఆకులు ,గడ్డి చామంతి ,గాజు తీగ ,నల్ల అల్లం వంటి రకరకాల పేర్లతో పిలుస్తారు .ఎక్కువగా పల్లెటూర్లలో చిన్న చిన్న గాయాల రక్తాన్ని గడ్డకట్టించేందుకు ఈ ఆకు పసరును పోస్తుంటారు . ట్రిడాక్స్ ప్రొక్యూoబెన్స్ అనేది జుట్టు పెరుగుదలకు సాంప్రదాయకంగా ఉపయోగించే ఆయుర్వేద ఔషధం మరియు సాధారణంగా బృంగరాజ్ స్థానంలో ఉపయోగించబడుతుంది . రాలిన జుట్టు పెరుగుదలను తిరిగి ప్రారంభించడానికి అలాగే జుట్టు పెరుగుదల చక్రం పూర్తి చేయడానికి నూనెలో వేసి మరిగిస్తారు . నూనెలోని మిథనాలిక్ సారం ఉత్తమ ఫలితాలను చూపించింది .