బరువు తగ్గాలనుకునే వారికీ జెస్ట్ 5డేస్ ఇది తీసుకోండి

అధిక బరువు సమస్య అనారోగ్య పరంగానే కాకుండా మానసికంగా కూడా మనల్ని దెబ్బతీస్తుంది . అధిక బరువు వల్ల బయట అందరిలో చులకనగా చూడటం జరుగుతుంది . పెళ్లి కానీ వారికి అధిక బరువు పెద్ద సమస్యగా మారుతుంది . ఇక పెళ్ళైన వారిలో సంతాన సమస్యలు ,ఏ పని చేసుకోలేక పోవడం లేదా అనేక ఆరోగ్య సమస్యలు చుట్టముట్టడం వంటివి అధిక బరువు ఉన్నవారిలో ఎక్కువగా తలేత్తే సమస్యలు .ఈ అధిక బరువు తగ్గించుకోవడానికి మనం ఒక ఆరు నెలల పాటు వ్రతంలా ఆహారంలో మార్పులు దైనందిన అలవాట్లతో మార్పులు చేసుకోవడం వల్ల అధిక బరువు సమస్యను అధిగమించవచ్చు.

Organic Pumpkin White* – GreenDNA® India

దీనికోసం తినే ఆహారంలో కొన్ని మార్పులు తప్పకుండా చేయాల్సి ఉంటుంది .అధిక బరువు తగ్గడం కోసం ఉదయాన్నే దోశలు ,అనేక రకాల అల్పాహార పదార్దాలు తినేవారు వాటికీ బదులు ఒక గ్లాస్ బూడిదగుమ్మడి జ్యుస్ తాగడం చాలా మంచిది .ఇది అనేక రకాల విటమిన్లు శరీరానికి అందించడంతో పాటు బరువు తగ్గడంతో చాలా బాగా సహాయపడుతుంది .కావాలి అనుకుంటే ఒక క్యారెట్ ,బీట్రూట్ గుమ్మడికాయతో కలిపి జ్యుసి చేసుకొని తాగావచ్ఛు .తేనెతో కలిపి తీసుకున్నా పర్వాలేదు .ఇక ప్రోటీన్ల లోపం లేకుండా శరీరానికి మొలకలను అందించాలి .

ఏవైనా రెండు, మూడు రకాల గింజలను అంటే సెనగలు ,పెసలు ,బొబ్బర్లు వంటివి నానబెట్టి వాటిని తీసుకోవాలి . ఏదైనా ఒక రకం పండుని కూడా తీసుకోవడం వల్ల కడుపు నిండిన భావన వస్తుంది .అలాగే మధ్యాహ్నం ఆహారంగా కూరలను తక్కువ నూనెతో తాయారు చేసుకొని తీసుకోవాలి .ఎక్కువ మోతాదులో కూరలు తీసుకోవడం వల్ల ఆరోగ్యానికి చాలా మంచి జరుగుతుంది .ఇందులో నూనె శాతం తక్కువగా ఉండటం వలన కొవ్వు పేరుకోవడం కూడా తగ్గుతుంది .అన్నాన్ని విడిచి పెట్టి పుల్కాలు తీసుకోవచ్చు .ఆలా తినలేని వారు కేవలం కూరగాయలతో చేసిన సలాడ్స్ తీసుకున్న మంచిదే .

How to make Sprouts | Sprouts | after | VRK Diet | Molakettina ginjalu |  Molakalu ela tayaru cheyali - YouTube

ఇక సాయంత్రం నాలుగైదు సమయంలో ఒక 200ml చెరుకు రసం లేదా బత్తాయి రసం తీసుకోవచ్చు .ఇవి శరీరంలో కావలసిన శక్తిని అందించడానికి ,పోషకాలు అందించడానికి ఉపయోగపడుతాయి .సాయంత్రం ఆహారంగా సీజనల్ ఫ్రూట్స్ తీసుకోవాలి .వీటిని కడుపు నిండా తినడం వలన వేరే ఆహారం తీసుకునే అవకాశం ఉండదు అలాగే 6లోపు వీటిని తినడం ముగించాలి .మళ్లీ మరుసటి రోజు ఉదయం వరకు ఎటువంటి ఆహారాన్ని తీసుకోకుండా ఉండాలి నీటిని శరీరానికి సరిపడా తాగాలి అలాగే రోజుకి కనీసం రెండు గంటలపాటు వ్యాయామం చేస్తూ ఈ ఆహార నియమాలు పాటించడం వలన 15,20కేజీల బరువు తగ్గుతారు .