బిచ్చగాడు హిరో “విజయ్ ఆంటోని” పరిస్థితి విషమం

విజయ్ ఆంటోనీ.. ఒక మ్యూజిక్ కంపోజర్, ప్లేబ్యాక్ సింగర్, ఎడిటర్, డైరెక్టర్, లిరిసిస్ట్, ఆడియో ఇంజినీర్ ఇలా ఎన్నో పాత్రలు పోషిస్తూ ఉంటాడు. తెలుగు ప్రేక్షకులకు విజయ్ ఆంటీనీ గురించి ప్రత్యేకంగా పరిచయాలు అక్కర్లేదు. బిచ్చగాడు సినిమాతో తెలుగు సినిమా అభిమానుల్లో ఎంతో మంది ఫ్యాన్స్ ని సొంతం చేసుకున్నాడు. ఇటీవలే విజయ్ ఆంటోనీ మలేషియాలో ప్రమాదనికి గురైన విషయం తెలిసిందే. అయితే ఆయన ఆరోగ్య పరిస్థితిపై సరైన సమాచారం అదండం లేదు. కొందరు ఆయన ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉందని చెబుతుంటే.. కొందరు మాత్రం పెద్ద ప్రమాదం కాదని తోసిపుచ్చుతున్నారు.

విజయ్ ఆంటోనీ ప్రస్తుతం బిచ్చగాడు 2 సినిమా షూటింలో ఉన్నాడు. మలేషియాలో బోట్ సీన్ ఒకటి షూట్ చేస్తున్న సమయంలో ప్రమాదం జరిగింది. విజయ్ ఆంటోనీ ఉన్న బోటు ఎదురుగా ఉన్న మరో బోటుని ఢీకొట్టింది. దాంతో విజయ్ ఎగిరి కింద పడటంతో గాయాలు అయ్యాయి. ఆయన భార్య ఫాతిమా విజయ్ పరిస్థితి విషమంగా ఉందని చెప్పినట్లు వార్తలు వైరల్ అవుతున్నాయి. విజయ్ పళ్లు, దవడ ఎముక విరిగినట్లు చెబుతున్నారు. ముకానికి కూడా గాయాలు అయ్యాయట. బుధవారం సాయంత్రం మలేషియా నుంచి విజయ్ ఆంటోనీని చెన్నైకి తీసుకొచ్చారు. ప్రస్తుతానికి బిచ్చగాడు 2 సినిమా షూటింగ్ వాయిదా పడినట్లే.

అయితే విజయ్ ఆంటోనీ కుటుంబానికి సన్నిహితంగా ఉండేవారు మాత్రం మరోలా చెబుతున్నారు. ఆరోగ్య పరిస్థితి విషమం అని వస్తున్న వార్తలు అవాస్తవమని కొట్టిపారేస్తున్నారు. బుధవారం సాయంత్రం చెన్నై చేరుకున్నారని.. సినిమా పనులు చూసుకుంటున్నారని చెప్పారు. నడుముకు చిన్న గాయం మాత్రమే అయినట్లు చెప్పుకొచ్చారు. “వార్తల్లో వస్తున్నట్లుగా విజయ్ ఆంటోనీకి పెద్ద ప్రమాదం జరగలేదు. స్వల్ప గాయాలు మాత్రమే అయ్యాయి. ఆయన సినిమా పనులు చేసుకుంటున్నారు” అంటూ క్లారిటీ ఇచ్చారు. ఈ వార్తల్లో ఏది నమ్మాలో తెలియక విజయ్ అభిమానులు సందిగ్ధంలో ఉన్నారు. ఏది ఏమైనా విజయ్ ఆంటోని కోలుకోవాలంటూ ఆకాంక్షిస్తున్నారు.

ఇంక సినిమాల విషయానికి వస్తే.. విజయ్ ఆంటోనీ చేతినిండా ప్రాజెక్టులతో ఫుల్ బిజీగా ఉన్నాడు. ఇప్పటికే చాలా ప్రాజెక్టులు డిలే అవుతూ వచ్చాయి. ఇప్పుడు ఈ ప్రమాదంలో మరింత ఆలస్యం అయ్యే అవకాసం లేకపోలేదు. బిచ్చగాడు 2, కొలై, రథం, మజై పిడికత మనితన్, వల్లి మాయల్ అంటూ సినిమాలు షూటింగ్ దశలో ఉన్నాయి. 2021లో విడుదలైన కొడియుల్ ఒరువన్ సినిమాకి కూడా 2024లో పార్ట్ 2 రావాల్సి ఉంది. ప్రస్తుతం విజయ్ ఆంటోనీ ఫ్యాన్స్ మాత్రం తమ అభిమాన హీరో ఆరోగ్యంగా తిరిగి రావాలంటూ కోరుకుంటున్నారు. అతని ఆరోగ్య పరిస్థితి తెలుసుకుని తెలుగు ప్రేక్షకులు సైతం ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.