మోకాళ్ళ నొప్పులు వెంటనే తగ్గాలంటే

మనం ఈ వీడియోలో మోకాళ్ళ నొప్పులకు గృహ వైద్యం అనే అంశాన్ని గురించి తెలుసుకోబోతున్నాం. మోకాళ్ళలో ద్రవపదార్థం లేదా గుజ్జు తగ్గిపోయినప్పుడు ఎముకల మధ్యలో ఆ పదార్థం తగ్గిపోవడం వల్ల ఎముకలు రాసుకుంటాయి. అప్పుడు నొప్పి అనేటటువంటి సమస్య వస్తుంది ఇదే మోకాళ్ల నొప్పులు. ఈ మోకాళ్ళ మధ్యలో గుజ్జు తగ్గిపోవడం అనే సమస్య సర్వసాధారణంగా వయసు వచ్చిన వారిలోనే ఎక్కువగా కనిపిస్తూ ఉంటుంది. అంటే 40 సంవత్సరాలు 50 సంవత్సరాలు 60 సంవత్సరాలు ఇలా పైబడిన వారిలో ఎక్కువగానే ఈ సమస్య వస్తూ ఉంటుంది. కానీ కొన్ని అనివార్య కారణాలవల్ల చిన్న వయసులోనే ఈ మోకాళ్ళ నొప్పుల సమస్య వస్తూ ఉండడం మనమందరం గమనిస్తూనే ఉంటాం. ఈ మోకాళ్ళ నొప్పులను తగ్గించుకునేందుకు మనకై మనం తయారు చేసుకునే విధంగా గృహ వైద్యం గురించి అందరం తెలుసుకుంటే ఈ సమస్య వచ్చిన వారు ఈ యొక్క ఔషధాన్ని వాడుకునే ఆ సమస్య నుండి బయటపడవచ్చు.

మరి ఈ ఔషధాన్ని ఎలా తయారు చేసుకోవాలి అంటే వీటికి కావలసిన పదార్థాలు, నాలుగే నాలుగు. అందులో మొట్టమొదటి పదార్థం అశ్వగంధ, రత్నపురి గుగ్గిలం, మూడవది వాము, నాల్గవది శొంటి. మరి ఈ ఔషధాన్ని ఎలా తయారు చేసుకోవాలి అంటే అశ్వగంధ చూర్ణాన్ని ఒక 50 గ్రాముల వరకు తీసుకోవాలి, అలాగే రత్నపురి గుగ్గిలం యొక్క చూర్ణాన్ని 50 గ్రాముల వరకు తీసుకోవాలి, అలాగే వామును వేయించి చూర్ణం చేసి ఆ యొక్క చూర్ణాన్ని కూడా ఒక 50 గ్రాముల వరకు తీసుకోండి, చివరిగా శొంటి చూర్ణాన్ని కూడా ఒక 50 గ్రాముల వరకు తీసుకోండి. ఈ నాలుగింటిని కూడా బాగా కలిపేసి ఒక గాజు సీసాలో భద్రపరుచుకోవాలి, దీనిని రోజు ఉదయం ఆహారం ఒక గంట ముందు అలాగే రాత్రి ఆహారానికి ఒక గంట ముందు 100 మిల్లీలీటర్ల గోరువెచ్చని నీళ్లలో అర టీ స్పూన్ ఈ చూర్ణాన్ని కలుపుకొని సేవించాలి.

ఈ విధంగా క్రమం తప్పకుండా రోజు ఉదయం ఒకసారి రాత్రి ఒకసారి ఈ ఒక్క ఔషధాన్ని ఈ పద్ధతిలో వాడుకోవడం వల్ల ఈ పదార్థ మిశ్రితం ఏదైతే ఉందో, దీంట్లో ఉన్నటువంటి ఔషధ గుణాలు ఏవైతే ఉన్నాయో ఈ ఔషధ గుణాలు మోకాళ్లలో గుజ్జు ఉత్పత్తి అయ్యేందుకు సహకరించడంతోపాటు, ఈ యొక్క ఔషధ గుణాల ప్రభావం చేత ఆ నొప్పి కూడా తగ్గిపోయి. మరీ స్పీడుగా వెంట వెంటనే ఈ మోకాళ్ళ ఎముకల అరుగుదల కాకుండా కూడా చాలావరకు నిరోధించే అటువంటి శక్తి ఈ యొక్క ఔషధ గుణాలలో ఉంది. అలాగే పై పూత మందు కూడా ఒకటి మనం తయారు చేసుకుని ఈ కడుపులోకి వేసుకునే మందుతో పాటుగా ఈ పైపూత మందును కూడా వాడుకోవడం వల్ల ఫలితాలు మరింత శ్రీఘ్రంగా కలుగుతాయి. మరిపై పూత మందుగా ఎలాంటి ఆయిల్ ని తయారు చేసుకుని ఆ మోకాళ్ళ నొప్పుల నుండి బయటపడవచ్చు అంటే వీటి కోసం కావలసిన పదార్థాలు మొట్టమొదటిది తులసి ఆకులు, రెండవది ఆవనూనె, కర్పూరం. ముందుగా తులసి ఆకు రసాన్ని 50 మిల్లి 50 మిల్లీ లీటర్ల వరకు తీసుకోండి.

అలాగే 100 మిల్లీలీటర్ల ఆవనూనెను తీసుకోండి, ఇప్పుడు ఈ రెండిటిని కూడా ఒక పాత్రలో కలిపి స్టవ్ మీద సన్నని మంటపై పెట్టుకోవాలి. దీన్ని బాగా మరిగించి స్టవ్ ఆఫ్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి ఇది కాస్త వేడిగా ఉన్నప్పుడు 10 గ్రాముల కర్పూరం పొడి అందులో కలిపి వేసి మూత పెట్టాలి. ఒక గంట లేదా రెండు గంటల తర్వాత ఆ పదార్థం అంతా చల్లారిన తర్వాత ఆ యొక్క తైలాన్ని వడకట్టుకుని ఒక గాజు సీసాలో నిల్వ ఉంచుకొని రోజు ఒకసారి కానీ లేదా సమస్య తీవ్రంగా ఉంటే రోజు రెండు సార్లు కానీ తగినంత తైలాన్ని ఆ యొక్క మోకాళ్ళ భాగంలో లేపనం చేసి మర్ధన చేస్తూ ఉండాలి. ఈ విధంగా క్రమం తప్పకుండా సమస్య మోతాదును బట్టి రోజుకు ఒకసారి కానీ రెండుసార్లు గాని తగినంత తైలాన్ని ఆ నొప్పి ఉన్న భాగంలో లేపనం చేసి సున్నితంగా మర్ధన చేస్తూ ఉండాలి. ఇలా చేయడం వల్ల సత్వరమే మోకాళ్ళ నొప్పుల నుండి బయట పడే అవకాశం ఉంటుంది.