బల్లిని రెండు నిమిషాల్లో ఇంట్లో నుంచి తరిమి వేసే చిట్కా..

ఇంట్లో బల్లులను తరిమేయడానికి ఒక చిట్కా తెలుసుకుందాం. కామన్ గా అందరి ఇళ్లల్లో కూడా బల్లులు ఉంటాయి, వాటిని చూసి చిన్నవాళ్ళు కానీ పెద్దవాళ్లు కానీ భయపడుతూ ఉంటారు.వాటి ఆకారం కూడా కొంచెo భయపెట్టే విధంగా ఉంటుంది. అలాగే ఆహార పదార్థాల సంబంధించిన వాటిలో పడితే కూడా ప్రమాదమని ఇంట్లో నుండి బల్లులను పంపించడానికి చాలామంది ట్రై చేస్తూ ఉంటారు. ఇప్పుడు మనం చెప్పుకోబోయే చిట్కాతో వాటికి హాని కలిగించకుండానే బల్లులను మన ఇంట్లో నుంచి తరిమేయవచ్చు, బల్లులను చంపకూడదు అని కూడా అంటారు కాబట్టి వాటిని చంపకుండా మన ఇంట్లో ఉండి తరిమేయవచ్చు.

కొంతమంది కోడుగుడ్డు చిప్పలను, ఇంట్లో అక్కడక్కడ పెట్టడం ద్వారా బల్లులు రావని భావించి వాటిని పెడతారు కానీ, వీటివల్ల కేవలం రెండు రోజులు మాత్రమే ప్రయోజనం ఉంటుంది. ఎందుకంటే ఇందులోనే తేమ రెండు రోజుల వరకు ఉంటుంది ఈ రెండు రోజులు కూడా ఆ వాసనకు బల్లులు అనేవి ఆ ప్రదేశంలోకి రావు, ఆ తర్వాత యధావిధిగా బల్లులు వస్తూనే ఉంటాయి. మనం బల్లులను ఇంట్లో నుంచి శాశ్వతంగా తరిమేయడానికి ఒక నాలుగు ఎల్లిగడ్డలను తీసుకోవాలి, వీటిని పాయలుగా ఉంచుకోవాలి వీటిని పొట్టు తీయాల్సిన అవసరం లేదు. ఇప్పుడు వీటిని ఒక మిక్సీ జార్ లో తీసుకొని కొద్దిగా వాటర్ పోసుకొని చాలా మెత్తగా మిక్సీ పట్టుకోవాలి.

మిక్సీ పట్టిన తర్వాత కొద్దిగా పలుచగా అయ్యేలా ఇంకా కొద్దిగా వాటర్ ని యాడ్ చేసుకుని మొత్తాన్ని బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత మనం నార్మల్ గా ఇంట్లో వాడే మగ్గు ఉంటుంది కదా, దీంట్లోకి మనం మిశ్రమాన్ని వడకట్టుకోవాలి, ఇలా వెల్లుల్లి రసాన్ని వడకట్టిన తర్వాత ఒక వేస్ట్ వాటర్ బాటిల్ లోకి ఈ వెల్లుల్లి రసాన్ని పోసుకోవాలి. తర్వాత దీంట్లోకి ఒక స్ప్రే చేసేది మనకు బయట షాపుల్లో దొరుకుతుంది, దాన్ని ఫిట్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ రసాన్ని ఇల్లంతా కూడా ఎక్కడ ఎక్కడ బల్లులు ఉంటాయో ఆ ప్రదేశంలో బాగా స్ప్రే చేస్తూ ఉండాలి, మనం ఇలా ఒకసారి చేసినట్లయితే దీని ప్రభావం ఒక నెల రోజుల పాటు ఉంటుంది, ఈ సింపుల్ చిట్కాతో మనం ఇంట్లో నుండి బల్లులను తరిమేయవచ్చు.