రాగి జావ ఇలా తాగితే డయాబెటిస్ తగ్గుతుంది.‌‌…… రక్తహీనత తగ్గుతుంది…. ఎముకలు దృఢంగా మారతాయి

మన ఆరోగ్యం అనేది మన ఆహార వ్యవహారాలు బట్టి ఆధారపడి ఉంటుంది. మనకు బియ్యం రాకపూర్వం మన తాతలు ముత్తాతలు ఎక్కువగా ఆహారంగా తీసుకునేది రాగి ముద్ద, రాగి జావ, అప్పాలు, రాగి రొట్టెలు. బియ్యం వచ్చేసరికి ఇవన్నీ మరుగున పడిపోయాయి. ఎందుకంటే బియ్యం మెత్తగా మృదువుగా ఉండి త్వరగా జీర్ణమవుతాయి. అంతేకాకుండా కూరల్లోనూ పచ్చళ్లోను ఇవి రుచిగా ఉంటుందని అందరూ వీటికి మారిపోయారు. వీటిని ఎక్కువగా ఉపయోగించడం వలన అనేక నష్టాలు కలుగుతున్నాయని మరల రాగులు వైపే మొగ్గు చూపుతున్నారు. 100 గ్రాముల రాగులు తీసుకుంటే అందులో 320 క్యాలరీల శక్తి లభిస్తుంది. కార్బోహైడ్రేట్స్ 67 గ్రాములు ఉంటాయి. ప్రోటీన్ 12 గ్రామ్స్ ఉంటుంది. ప్యాట్ 7గ్రా. ఫైబర్ 11గ్రా ఉంటుంది. అంటే ఫైబర్ చాలా ఎక్కువగా ఉంటుంది.

అన్నిటికంటే వీటిలో ముఖ్యమైన పోషకాలు క్యాల్షియం, పొటాషియం, పాస్పరస్ కూడా ఉంటాయి. అంతేకాకుండా ఐరన్, క్యాల్షియం, సీలీనియం కూడా ఎక్కువగా ఉంటాయి. ఇవన్నీ రాగుల లో ఉన్న స్థూల, సూక్ష్మ పోషకాలు. ఇలాంటి రాగులను ఎక్కువగా రాగి జావ రూపంలో అందరూ తీసుకుంటున్నారు.రాగి జావ కంటే రాగి రొట్టెలు చాలా మంచివి. ఇది షుగర్ ఉన్న వాళ్ళకి అధిక బరువు ఉన్న వాళ్లకి చాలా మంచిది. రాగులు వేడి చేయవు అందువలన వీటిని బాగా ఉపయోగించుకోవచ్చు. మరియు రాగి పిండిని పుల్లటి పెరుగులో కలిపి దోశలు కింద కూడా వేసుకోవచ్చు. రాగి ముద్ద మాత్రం కష్టపడి పని చేసే వాళ్లకు, చిన్న పిల్లలకు, జిమ్ ఎక్సైజ్ చేసే వాళ్లకు, గర్భిణీలకు, బాలింతలకు చాలా శ్రేష్టం.

మరియు రాగి పిండితో కేక్స్, స్నాక్స్ చేసుకోవచ్చు. ఇందులో ఉన్న ఫైటోకెమికల్స్ కారణంగా కార్బోహైడ్రేట్స్ ఎక్కువగా ఉన్నప్పటికీ ఇవి స్లోగా రక్తంలో కలుస్తాయి.మరియు ఇందులో ఉండే ఫైబర్ చక్కెర రక్తంలో వెళ్లడానికి స్పీడ్ బ్రేకర్ లాగా ఉపయోగపడతాయి. దీనివలన షుగర్ త్వరగా పెరగదు. అందువలన షుగర్ రాకూడదనుకున్నా వాళ్లకి, బరువు పెరగకుడదు అనుకునేవారికి ఇది బాగా ఉపయోగపడుతుంది. ఇందులో క్యాల్షియం ఎక్కువగా ఉండడం వల్ల ఆస్టియోపొరోసిస్ ఉన్నవారికి ఎముకలు గుళ్ల బారిన వారికి వీటిని సవరించుకోవడానికి రాగి జావను తీసుకుంటే క్యాల్షియం టాబ్లెట్ వేసుకునే అవసరం ఉండదు. దీని ద్వారా మలబద్ధకం కూడా తగ్గుతుంది. మరియు ఇవి పవర్ ఫుల్ యాంటీ ఆక్సిడెంట్స్ గా పని చేస్తాయి. రక్తహీనతను తగ్గిస్తుంది