రాత్రి ఒక్కసారి రాస్తే చాలు . పొద్దుటకల్లా నొప్పులన్ని మటుమాయం

శరీరంలో ఎక్కడైనా నొప్పులు వస్తుంటే రక రకాల పెయిన్ కిల్లర్స్ వాడుతూ ఉంటాం . వీటివలన భవిష్యత్తు లో అనేక రకాల అనారోగ్య సమస్యలను ఎదుర్కోవలసి ఉంటుంది . సహజ చిట్కాలతో ఈ నొప్పులను తగ్గించుకోవడానికి ఇలా చేయండి . ఇలా చేయడం వలన పైసాఖర్చు లేకుండా ఎటువంటి ఆరోగ్య సమస్యలు లేకుండా నొప్పులను తగ్గించుకోవచ్చు . దానికోసం మనం చేయవలసిన రెండు పద్దతుల గురించి తెలుసుకుందాం . మొదట పుదీనా ఆకులను గుప్పెడు తీసుకొని శుభ్రoగా కడిగి ఒక గ్లాసులో వేసుకోవాలి . వీటిలో బాగా మరిగిన ఒక గ్లాసుడు నీటిని వేసుకొని దానికి మూతపెట్టి ఒక పావు గంటపాటు వదిలేయాలి .

ఇలా చేయడం వలన పుదీనా ఆకులు వేడి నీటిలో ఉడికించి వాటిలోని గుణాలు నీటిలోకి చేరతాయి . ఇలా రంగు మరీనా నీటిని తీసుకొని పుదీనా ఆకులను వాడకట్టుకోవాలి . తరువాత రాత్రి పడుకునే ముందు ఈ పుదీనా కషాయాన్ని తాగడం వలన ఉదయానికి శరీరంలోని నొప్పులను తగ్గిస్తుంది . పుదీనాలో మెంథాల్ ఉంటుంది . ఇది కండరాలను సడలించడానికి మరియు నొప్పిని తగ్గించడానికి సహాయపడుతుంది . మీ నుదురుపై పుదీనా రసాన్ని పూయడం వలన తలనొప్పి నుండి ఉపశమనం పొందవచ్చు . అలాగే పుదీనా పేస్ట్ లేదా పుదీనా నూనె యొక్క బామ్ లు తలనొప్పిని నయం చేయడం లో ప్రభావ వంతంగా పని చేస్తు ఉంటాయి .

Care of Peppermint - How To Grow Peppermint Plants

ఇలా నొప్పులు తగ్గే వరకు కొన్ని రోజులపాటు ఈ నీటిని తాగి చూడoడి .తక్కువ సమయంలో మంచి ఫలితం ఉంటుంది . అలాగే ఉడికిన పుదీనా ఆకులను మెత్తగా పేస్ట్ లా చేసుకోవాలి . దింట్లో ఒక్క స్పూన్ శొంఠి పొడి ,ఒక్క స్పూన్ పంచదార పొడి ,ఒక స్పూన్ ఆలివ్ ఆయిల్ వేసుకోవాలి . ఈ మిశ్రమాన్ని బాగా కలిపి ఎక్కడ బాడీ పెయిన్స్ ,జాయింట్ పెయిన్స్ ఉన్నాయో అక్కడ రాసి దానిపై ఏదైనా క్లాత్ తో కట్టు కట్టాలి ఇలా రాత్రిపూట పెట్టి ఉదయం వరకు ఉంచుకోవాలి ఇలా రెండు రోజులు చేయడం వలన నొప్పులు సమస్య తగ్గిపోతుంది ఈ చిట్కాలు ఎన్ని రోజులు వాడాలి అంటే మీకు నొప్పి తగ్గిన తరువాత ఆపేయవచ్చు .