రేణుదేశాయ్ ఆమెకు సంపాదన ఎలా వస్తుంది..?హైదరాబాద్, పూణేలో రేణుదేశాయ్‌కి ఆస్తులు..

ఒకప్పటి యాక్ట్రెస్ రేణూదేశాయ్.. రవితేజ ‘టైగర్ నాగేశ్వరరావు’ సినిమాతో ఆడియన్స్ ముందుకు మళ్ళీ రాబోతుంది. ఇక ఈ మూవీ ప్రమోషన్స్ లో వరుస ఇంటర్వ్యూలు ఇస్తూ వస్తున్న ఈమె.. ఎన్నో ఆసక్తికర విషయాలను ఆడియన్స్ కి తెలియజేస్తుంది. ఈక్రమంలోనే ఇన్నాళ్లు సినిమాలకు దూరంగా ఉన్న రేణూదేశాయ్ కి సంపాదన ఎలా వస్తుంది. ఆమెకు సినిమా వృత్తే కాకుండా ఇంకేమి వ్యాపారం చేస్తుంది అనే విషయాలను తెలియజేసింది.రేణూదేశాయ్ కి రియల్ ఎస్టేట్ వ్యాపారం మెయిన్ ఆదాయమార్గం అంటా. తన ఫ్యామిలీలో నాయనమ్మ, నాన్న అదే వృత్తి చేసేవారట.

ఇక వారి నుంచి రేణూదేశాయ్ కి కూడా అదే వృత్తి పారంపరంగా వచ్చిందట. ప్రస్తుతం హైదరాబాద్, పూణేలో ఈ బిజినెస్ చేస్తుంది. ఈక్రమంలోనే ఈ రెండు చోట్ల ఈమెకు బాగానే ఆస్తిలు ఉన్నాయట. అలా వచ్చిన మనీతోనే అటు పిల్లలని, అప్పుడప్పుడు సినిమా నిర్మాణంలో కూడా ఇన్వెస్ట్ చేస్తూ వస్తుంది.టైగర్ నాగేశ్వరరావు చిత్రం తరువాత దర్శకురాలిగా కెరీర్ స్టార్ట్ చేస్తాను అంటూ చెప్పుకొచ్చింది. గతంలో అసిస్టెంట్ డైరెక్టర్ గా, మరాఠిలో ఒక సినిమాకి దర్శకురాలిగా చేసిన అనుభవం ఉన్న రేణూదేశాయ్.. త్వరలో చిన్నపిల్లలతో ఒక సినిమా చేయబోతుందట.

ఆ తరువాత ఒక లవ్ స్టోరీ డైరెక్ట్ చేయనున్నట్లు వెల్లడించింది. నటిగా, దర్శకురాలిగా టాలీవుడ్ లో మళ్ళీ బిజీ కానుందని ఆమె తెలియజేసింది. కాగా టైగర్ నాగేశ్వరరావు సినిమాలో రేణూదేశాయ్.. సంఘసంస్కర్త అయిన హేమలత లవణం పాత్రని పోషిస్తుంది.టైగర్ నాగేశ్వరరావు రియల్ లైఫ్ స్టోరీతో వస్తున్న సంగతి తెలిసిందే. ఈక్రమంలోనే జాతి వివక్ష, అంటరానితనం వంటి సమస్యలు పై పోరాడిన హేమలత లవణం పాత్రని కూడా ఈ సినిమాలో చూపించబోతున్నారు. ఆమె పాత్రలోనే రేణూదేశాయ్ నటిస్తూ రీ ఎంట్రీ ఇస్తుంది. అక్టోబర్ 20న పాన్ ఇండియా వైడ్ ఈ మూవీ రిలీజ్ కాబోతుంది.