వామ్మో, లావణ్య త్రిపాఠి పెళ్లి చీర ధర ఎంతో తెలుసా..?

వరుణ్ తేజ్ పెళ్లిలో చిరంజీవి, రామ్ చరణ్, పవన్ కళ్యాణ్, అల్లు అర్జున్ దంపతులు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తున్నారు. మెగా ఫ్యామిలీకి అత్యంత సన్నిహితుడైన హీరో నితిన్ కూడా పెళ్లి వేడుకల్లో పాల్గొనడం విశేషం. వరుణ్ తేజ్-లావణ్యల డెస్టినేషన్ వెడ్డింగ్ టాక్ ఆఫ్ ది నేషన్ అవుతుంది. అయితే అంతా బాగానే ఉంది.. ఇక సోషల్ మీడియా మాత్రం ఊరుకోదు కదా.. ఈ వేడుకల్లో ఎవరి డ్రస్సులెలా ఉన్నాయి. ప్రత్యేక ఆకర్శణ ఎవరు.. కాస్లీ డ్రస్ లపై ఆరా తీయగా..పెళ్లి కూతురు లావణ్య త్రిపాఠి కట్టుకున్న పట్టుచీర ప్రత్యేకంగా కనిపించింది.

లైట్ గ్రీన్ కలర్ పట్టు చీరను ఆమె ఈవేడుకల కోసం ప్రత్యేకంగా తయారు చేయించినట్టు తెలుస్తోంది. ఇక ఆకంపెనీ కాడా ఈ చీరకు సంబంధించిన వివరాలు వెల్లడించింది. ఒక రకంగా చూస్తే.. సెలబ్రిటీలు ఎక్కువ రేట్లు ఉన్న బ్రాండెడ్ బట్టలు వేసుకుంటారు. ఇక ఏదైనా పార్టీలు, ఫంక్షన్లు ఉన్నాయంటే.. మరింత ప్రత్యేకంగా ఉండాలని.. ఇంకా కాస్ట్ ఎక్కువగా ఉన్న వాటిని వేసుకుంటారు. గతంలో చాలా మంది ఇలా ఫాలో అయినవారు ఉన్నారు. గతంలో చాలా మంది సెలబ్రిటీలు, హీరోయిన్స్ ఎక్కువ ధర ఉన్న బట్టలే వేసి వైరల్ గా మారారు.

కొంతమంది అయితే లక్షల్లో విలువ చేసే చీరలు కట్టారు. ఇప్పుడు లావణ్య కట్టిన చీర ధర కూడా వైరల్ గా మారింది. వరుణ్ తో జరిగిన నిశ్చితార్థంలో లావణ్య కట్టిన చీర ధర ఏకంగా 75 వేల రూపాయలు.ఈ చీరను లావణ్య త్రిపాటికి అందించిన ఓ ఫ్యాషన్ డిజైనర్ తమ సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. లైట్ గ్రీన్ కలర్ లో ఉన్న ఈ పట్టు చీర మెరిసిపోతుండగా లావణ్య ఇందులో మరింత అందంగా కనిపించింది. అయితే చాలా మంది హీరోయిన్స్ పెళ్లి చీరల ధరతో పోలిస్తే ఇది తక్కువే అని పలువురు కామెంట్స్ చేస్తుండగా… పెళ్లికి లక్షల్లో కాస్త్ పెట్టి కొంటుందిలే అని మరికొందరు సమర్థిస్తున్నారు. మొత్తానికి లావణ్య చీర హాట్ టాపిక్ అవుతోంది.