వాయనంగా ఏమి ఇవ్వాలి,ఎలా ఇవ్వాలి…

ఆగస్టు 5వ తేదీన వరలక్ష్మి వ్రతం రాబోతుంది అయితే ఈ రోజున ముత్తయిదువులకు వాయనం ఎలా ఇవ్వాలో తెలుసుకుందాo, వారిని అమ్మవారి స్వరూపంగా భావించి వాయనం ఇవ్వాలి.ముందుగా వారికి బొట్టు పెట్టాలి ,ఆ తర్వాత గంధం పెట్టాలి ,తర్వాత పుస్తెలకు పసుపునివ్వాలి. అయితే కొంతమంది ఈమధ్య పొడుపసుపు ఇస్తున్నారు అలా ఇవ్వకూడదు పసుపును ఎప్పుడైనా సరే తడిపి ఇవ్వాలి ఇలా వారికి ఇస్తే వాళ్ళు పుస్తెలకు పెట్టుకుంటారు. ఆ తర్వాత వారి కాళ్ళకి పసుపు రాయాలి, ఎక్కడ కూడా గ్యాప్ లేకుండా చక్కగా పసుపు రాయాలి, వారు మనకన్నా చిన్నవారు అయినా సరే మనమే పసుపు రాయాలి. ఆ తర్వాత తాంబూలంకి ఒక ప్లేటు తీసుకొని ఇది స్టీల్ ప్లేట్ కాకుండా చూసుకోండి దీనిలో మీ శక్తి కొలది జాకెట్ ముక్కలను పెట్టుకోవాలి ఒకటి లేదా రెండు జాకెట్ ముక్కలను పెట్టుకోవాలి. వాళ్లు వాడుకునే విధంగా పెడితే మంచిది, మేము జాకెట్ ముక్కలను పెట్టలేము అనుకునేవారు అయితే ఒక్కరికి అయినా సరే జాకెట్ ముక్క పెట్టి మిగతా వారికి పండ్లతో తాంబూలం ఇవ్వవచ్చు. అలాగే ఈ మధ్యలో కొంతమంది చిన్న గిఫ్ట్స్ కూడా ఇస్తున్నారు అలా గిఫ్ట్ ఇవ్వాలి అనుకునేవారు వాయనంతో పాటు గిఫ్ట్ ఇవ్వవచ్చు.

తర్వాత మనం తీసుకున్న జాకెట్ ముక్కల మీద రెండు తమలపాకులను పెట్టుకోవాలి తమలపాకులు కాడలు ఎప్పుడూ మన వైపు ఉండేటట్లు చూసుకోవాలి అంటే ఇచ్చే వారి వైపు ఉండాలి అలాగే కాడలు తీసివేసి మన వైపు ఉండేలాగా పెట్టుకోవాలి, ఎప్పుడు వాయనం ఇవ్వాలి అనుకున్నా సరే తమలపాకులు కాడలు మన వైపు ఉండేటట్లుగా చూసుకొని ఇవ్వాలి, అలాగే పసుపు కుంకుమ చిన్న ప్యాకెట్లను పెట్టుకోవాలి. అలాగే ఒక వక్క ఒక ఎండు ఖర్జూరం పెట్టుకోవాలి అలాగే వాయనంలో పువ్వులను పెట్టాలి ఈ పువ్వులు జాజిపూలు కానీ మల్లె పువ్వులు కానీ అయితే మంచిది ఎందుకంటే అమ్మవారికి ఇష్టం కాబట్టి అలాగే మనం ఇచ్చిన పూలు వాళ్ళు పెట్టుకునే విధానంగా కొంచెం మాల లాగా ఇస్తే వారికి పెట్టుకోడానికి వీలుగా ఉంటుంది ఒకవేళ మాల లేకపోతే ఒక పువ్వు నైనా సరే ఇవ్వాలి. అలాగే రెండు అరటి పండ్లను ఇవ్వాలి అవి కూడా కాడలు మన వైపు ఉండేలా ఉండాలి,మిగిలిన పండ్లు అయితే ఒక పండు పెట్టవచ్చు కాకపోతే అరటిపండు అయితే జంటగా పెట్టాలి. తర్వాత తాంబూలంలో గాజులను పెట్టాలి ఈ గాజులు ఎరుపు లేదా ఆకుపచ్చ రంగు అయితే చాలా మంచిది గాజులను రెండు లేదా 6 పెట్టాలి, అలాగే నానబెట్టిన శనగలను ఇవ్వాలి ఈ శనగలు వాయనంలో మొలకలు వచ్చినవి పెడితే ఇంకా మంచిది అలాగే ఒక తూరం ఇవ్వాలి ఈ తోరం మనమే వాళ్ళ చేతికి కట్టాలి.

ఈ తోరం అనేది అందరి ముత్తైదువులకు ఇస్తే మంచిది ఒకవేళ ఈ వీలు అవ్వకపోతే ఒక్కరికైనా ఇవ్వాలి, వీటన్నిటితోపాటు గోరింటాకును కూడా ఇస్తే చాలా మంచిది అలాగే కొంతమంది వన్ రూపీ కాయిన్ కూడా పెడతారు. వరలక్ష్మీ వ్రతంలో వ్రత కథ చదివిన తర్వాత ఇలా ఒక ముత్తైదువుకి వాయనం ఇస్తేనే మన వ్రతం ముగిసినట్లు. వీటన్నిటిని మనం వాళ్ళ కొంగు చాపమని వాళ్ళ కొంగులో పెట్టాలి అలాగే ఇచ్చేటప్పుడు ఇస్తినమ్మ వాయనం అనాలి అలాగే తీసుకునేవారు పుచ్చుకుంటినమ్మ వాయనం అనాలి ఇలా వారికి వాయనం ఇచ్చిన తర్వాత దూరం కట్టి ఆశీర్వాదం తీసుకోవాలి ఒకవేళ మన కంటే పెద్దవారు అయితే కాళ్ళకి దండం పెట్టి ఆశీర్వాదం తీసుకోవాలి.లేదా మనకంటే చిన్న వారు అయితే వారి చేతిలో అక్షింతలు పెట్టి వాళ్ళ గాజులకు నమస్కరించుకొని ఆ అక్షింతలను మనమే తీసుకుని తన మీద వేసుకోవాలి అలాగే ముత్తైదువులకు వాయనం ఇచ్చిన తర్వాత వారి నోరు తీపి చేయాలి అలాగే వారితో పాటు వారి పిల్లలు వచ్చినా సరే ఖాళీ చేతులతో పంపించకూడదు పండ్లు వాయినంగా ఇచ్చి పంపించాలి, అలాగే వితంతువులు వచ్చినా కూడా తప్పుగా భావించకూడదు ఖాళీ చేతులతో పంపించకూడదు వారు కూడా అమ్మవారి స్వరూపమే వారికి పండ్లు కానీ స్వీట్ కానీ ఇవ్వాలి, ఇది వరలక్ష్మీ వ్రతంలో వాయనం ఇచ్చే పద్ధతి తెలుసుకున్నారు కదా మీరు కూడా ఇలా చేయండి.