వేసవిలో నీరు ఎక్కువ తాగేవారికి షాకింగ్ సీక్రెట్….

మనందరికీ తెలిసో తెలియకో చిన్నప్పటినుండి తల్లిదండ్రులు పెద్దలు నేర్పిన ఒక అలవాటు, ఎక్కువ మందిలో ఉన్నది తినేటప్పుడు నీళ్లు త్రాగడం. ఇది కరెక్టో కాదో మనకు తెలియదు కానీ అలవాటుగా తాగిస్తూ, తాగేస్తు తాగిస్తూ ఉంటాం. ఆరోగ్య పరంగా చూస్తే ఇది చాలా బ్యాడ్ హ్యాబిట్, ఇతర కాలాల్లో అంత నష్టం ఏమైనా కలుగుతుందో లేదో తెలియదు కానీ వేసవి కాలం మాత్రం ఈ అలవాటు ఉన్నవారు అందరికీ చాలా ఇబ్బందులు ఎదురవుతూ ఉంటాయి. తింటూ నీళ్లు త్రాగడం, అంటే టిఫిన్ తినేటప్పుడు కానీ భోజనం చేసేటప్పుడు కానీ రెండు మూడు ముద్దలు తిన్న తర్వాత నీళ్ళు తాగుతూ ఉంటారు, కొంతమంది తినేటప్పుడు త్రాగకూడదు అనుకుని తిని కడిగిన తర్వాత ఒక్కసారిగా తాగేస్తారు.

కొంతమంది పావుగంట పది నిమిషాల తర్వాత తాగుతారు. ఇలా భోజనంతోపాటు టిఫిన్ తో పాటు నీళ్లు త్రాగారు అంటే వేసవి కాలం నీకు చాలా ఇబ్బందులు ఎక్కువగా ఉంటాయి. వేడి తీవ్రత తగ్గించుకోవడానికి మీరందరూ నీళ్లు తాగితే మంచిదని నాలుగు నుండి ఐదు లీటర్ల నీళ్లు తాగుతారు. మేము నీళ్ళు తాగుతున్నాం కదా అనుకుంటారు, కానీ తాగే పద్ధతి తప్పు అయినప్పుడు ఆ నీరు మీకు కూలింగ్ ఇవ్వదు,వేసవి నుండి రక్షించదు. నీళ్లు తాగితే మంచిదని మీరు బ్రేక్ ఫాస్ట్ లో రెండు గ్లాసుల వాటర్ తాగి రెండు గ్లాసులు తాగుతూ, మధ్య మధ్యలో స్నాక్స్ తిన్నప్పుడు కూడా తాగుతూ ఉంటారు. ఇలా నీటిని ఎప్పుడు కూడా తింటూనే తాగుతూ ఉంటారు, మీరు తినేటప్పుడు ఎన్ని నీళ్లు తాగిన సరే నీకు దాహం తీరదు, వేసవి నుండి రక్షించడానికి ఆ నీరు ఉపయోగపడదు.

ఎందుకంటే మీరు తిన్న ఆహారం పొట్టలోకి వెళ్ళిపోయింది, ఆహారంతోపాటు నీళ్లు కూడా పోసారు కాబట్టి ఈ నీళ్లు, ఆహారం పొట్టలో కలిసిపోతాయి. పొట్ట అటు ఇటు కదుపుతూ ఉంటుంది ఆహారాన్ని అరిగించుకోవడానికి, అప్పుడు మనం తిన్న ఆహార పదార్థాలు నీటితో పూర్తిగా కలిసి పోతాయి. మీరు తినే ఆహార పదార్థాలు, నీళ్లతో కలవడం ద్వారా ఈ నీళ్లు రక్తం లోకి వెళ్లి అక్కడ నుండి కణజాలానికి వెళ్లి తిరిగి చర్మానికి వెళ్లి శరీర వేడిని తట్టుకోవడానికి వెంటనే ఉపయోగపడవు. కానీ మీరు నీళ్ళు కావాలి అని ఎక్కువ తాగితే మంచిదని తాగితే మీ పొట్ట లో ఆహారం రెండు గంటలపాటు ఉంటుంది, నీళ్లు కూడా పొట్టలోనే ఎక్కువసేపు ఉంటాయి. ఈ క్రమంలో మీ శరీరం చల్లబడడానికి రెండు మూడు గంటలు పడుతుంది, ఈ సమయంలో మీకు మీరు ఎండలో వుంటే మీకు వడదెబ్బ తగిలే అవకాశం ఉంటుంది. అందువల్ల మీరు ఆహారం తినేటప్పుడు నీళ్లు తాగకుండా, తిన్న రెండు గంటల తర్వాత నీళ్ళను త్రాగండి.