సంక్రాంతికి ఇంటి ముందు ఏలాంటి ముగ్గులు వేయాలి .?ఇలాంటి ముగ్గులు వేస్తేనే లక్ష్మీ దేవి అనుగ్రహం లభిస్తోంది..

సంక్రాంతి పండుగ మొదలయ్యేది ముగ్గులతోనే. ధనుర్మాసం మొదలైన నాటి నుండి సంక్రాంతి పండుగ ముగిసే వరకు.. సుమారు నెల రోజుల పాటు ఇంటి ముందు కళ్లాపి చల్లి ముగ్గులు వేస్తాం. ఇలా చేస్తే లక్ష్మి దేవి తలుపుతడుతుందని మన పూర్వీకులు చెబుతుంటారు.

ఇంటికి ఎలాంటి నర దిష్టి తగలదని భావిస్తారు. అందుకే పేడతో కళ్లాపి చల్లి, బియ్య పిండితో రంగవల్లులద్ది వాకిళ్లను, గుమ్మాలను అందంగా తీర్చిదిద్దుతారు.ఇలా ముగ్గులు వెయ్యడం వెనుక సైంటిఫిక్ రీజన్ కూడా ఉంది.

చలికాలంలో సూక్ష్మక్రిములు వల్ల అనారోగ్యం బారిన పడే అవకాశం ఉన్నందున పేడతో కళ్లాపి కొట్టి, ముగ్గులు వేస్తారు. ఈ నెల రోజుల పాటు గుమ్మం నుండి వాకిలి వరకు బియ్యం పిండితో ముగ్గులు వేయడం వల్ల చీమలు, చిన్న చిన్న జీవులకు ఆహారం లభించినట్లవుతుంది.

మిగిలిన రోజులతో పోలిస్తే.. ఈ మాసంలో కాస్త భిన్నంగా ముగ్గులు వేస్తుంటారు. సంక్రాంతి మూడు రోజుల సందర్భంగా రంగురంగుల ముగ్గులు వేస్తారు. కానీ ఈ మూడు రోజుల వేటికవే ప్రత్యేకమైనవి అని.. ఆ మూడు రోజులలో.. వేర్వురు రకాల ముగ్గులు వేయాలంటున్నారు రమా రావి గారు.

సుమన్‌ టీవీకిచ్చిన ఇంటర్వ్యూలో ఆమె ఈ మూడు రోజు ప్రశస్త్యం.. ఆ రోజుల్లో వేయాల్సిన ముగ్గుల గురించి వివరించారు. భోగి, సంక్రాంతి, కనుమ నాడు ఎలాంటి ముగ్గులు వేస్తే.. లక్ష్మి దేవి అనుగ్రహం లభిస్తుందో తెలియజేశారు. పూర్తి వివరాల కోసం వీడియో చూడండి.