తేనెలో నానబెట్టిన ఉల్లిపాయలు ఖాళీ కడుపుతో తీసుకుంటే ఏమవుతుందో తెలుసా..?

ప్రతి ఇంట్లో ఉల్లిపాయలు వంటల్లో తప్పకుండా వాడుతూ ఉంటారు. అలాగే ఉల్లి చేసిన మేలు తల్లి కూడా చేయదు అనే సామెత కూడా ఈ ఉల్లిపాయ మీద ఉంది. ఈ ఉల్లిపాయలు ఎన్నో ఔషధ గుణాలు ఉన్నాయి. అయితే తేనెలో నానబెట్టిన ఉల్లిపాయను ఖాళీ కడుపుతో తీసుకుంటే శరీరంలో ఎన్నో ఆరోగ్య మార్పులు వస్తున్నాయి. అవేంటో ఇప్పుడు మనం చూద్దాం.. రక్తాన్ని శుభ్రం చేయడానికి . రక్తాన్ని శుభ్రం చేయడానికి ఉల్లిపాయలు సహాయపడతాయని మీ అందరికీ తెలుసు తేనెలో నానబెట్టిన ఉల్లిపాయలు ఇంకా మేలు చేస్తాయి.

నిత్యం ఉదయం ఖాళీ కడుపుతో తేనెలో నానబెట్టిన ఉల్లిపాయని తీసుకోవడం వలన రక్తంలో ట్యాగ్గిన్స్ తొలిగిపోయి రక్త ప్రసరణ బాగా జరుగుతుంది. అజీర్తి నీ తగ్గించడానికి : ఉల్లిపాయ మరియు తేనె రెండిట్లో యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఇవి మన శరీరంలోని జీర్ణశక్తిని బాగా మెరుగుపరుస్తాయి. అలాగే జీర్ణ క్రియ ని కూడా పెంచుతాయి.ఇది అజీర్తిని నయం చేస్తుంది. పొట్టని తగ్గిస్తుంది . తేనెలో నానబెట్టిన ఉల్లిపాయను నిత్యం ఉదయాన్నే తీసుకుంటే శరీరంలోని చెడు కొలెస్ట్రాల్ తగ్గిపోతుంది. ముఖ్యంగా పొట్ట, తుంటి చుట్టూ ఉండే కొవ్వు తగ్గిపోతుంది.

తేన ఉల్లిపాయను ఎలా తయారు చేయాలి. శుభ్రమైన పాత్ర లేదా గాజు సీసా తీసుకోవాలి. బాగా ఊరించిన చిన్న ఉల్లిపాయలను వేసి రెండు ముక్కలుగా కట్ చేసి మరియు దానిని కప్పి ఉంచడానికి తేనె పోయాలి రెండు రోజులు దీనిని పక్కన పెట్టుకోవాలి. రెండు రోజుల తర్వాత ఉల్లిపాయలు తేనె బాగా కలిసిపోతుంది. ఇది మీరు ఉంచిన దానికంటే కొంచెం సన్నగా ఉంటుంది. ఎందుకంటే ఉల్లిలోని నీరు తేనెతోపాటు పీల్చుకుపోతుంది. దీనిని రోజు ఉదయాన్నే తింటే ఎన్నో లాభాలు ఉంటాయి. చాతి జలుబులు వదిలించుకోవడానికి . సాధారణంగా చాతిలో స్లేష్మం పెరిగిపోతే చిన్న ఉల్లిపాయను తిని వేడి నీళ్లు తాగాలని చెప్తుంటారు మనం పూర్వికులు.

చిన్న ఉల్లిపాయలు రసాన్ని తీసుకొని సమాన పరిమాణంలో తెలియని కలిపి తీసుకునే వాళ్ళు ఇప్పుడు మనం కూడా దానిని పాటిస్తున్నాము. చాతి జలుబుతో బాధపడేవారు నిద్రపోయే ముందు తేనెలో నానబెట్టిన చిన్న ఉల్లిపాయను తీసుకుంటే రెండు రోజులలో చాతిలో ఉండే కపం నోటి ద్వారా లేదా మలం ద్వారా బయటికి వెళ్లిపోతుంది.. రోగనిరోధక శక్తిని పెంచుతుంది . ఉల్లిపాయ రోగనిరోధక శక్తిని బలపరుస్తుంది. ప్రధానంగా బలహీనమైన రోగనిరోధక వ్యవస్థ వలన కలిగే శ్వాస సమస్యలు జలుబు, ఉబ్బసం అలాగే ఊపిరితిత్తుల సమస్యలకు ఉల్లిపాయ ఒక అద్భుతమైన ఔషధం. ఈ సమస్యలతో ఇబ్బంది పడేవారు నిత్యం ఉదయాన్నే ఖాళీ కడుపుతో తేనెలో నానబెట్టిన ఉల్లిపాయను తీసుకుంటే రోగ నిరోధక శక్తి మెరుగుపడుతుంది.