సెగ గడ్డలు చీము గడ్డలతో బాధపడుతున్నారా? అయితే ఈ ఇంటి చిట్కా మీకోసమే..

చాలామంది ఈ రోజుల్లో సెగ గడ్డలతో బాధపడుతున్నారు. సెగ గడ్డలు ఉండడం వల్ల కూర్చోడానికి ఇబ్బంది, అలాగే చాలా చికాకుగా ఉంటుంది. ప్రతి పనిలో కూడా అసౌకర్యంగా ఉంటుంది. ఏ పని కూడా చేయలేము. సెగ గడ్డలు తక్కువ పరిమాణంలో ఉన్న నొప్పి వల్ల నరకం కనిపిస్తుంది. సెగగడ్డలు ఎక్కువగా తొడలమీద, జుట్టు కుదుళ్ల దగ్గర వస్తాయి. సెగ గడ్డలు ఉన్న దగ్గర దురదగా ఉండటం, చీము రావడం వల్ల చాలా బాధగా ఉంటుంది.

కారణాలు:

జీవనశైలిలో మార్పులు వల్ల, పోషకాహార లోపాలు వల్ల, షేవింగ్ చేసేటప్పుడు వచ్చే గాయాలు వల్ల, ఇన్ఫెక్షన్ల వల్ల సెగ్గడ్డలు వస్తాయి. ఇప్పుడు సెగగడ్డలు పోగొట్టడానికి మంచి చిట్కా చూద్దాము.ఈ చిట్కాలు పాటిస్తే పూర్తిగా సెగ గడ్డలను పోగొట్టుకోవచ్చు.

ఇంటి చిట్కా:

ముందుగా మీరు ఒక చిన్న గిన్నె తీసుకోండి. తర్వాత వెల్లుల్లి రెబ్బలను 5 నుండి 10 వరకు తీసుకుని వెల్లుల్లి పైన ఉన్న పొట్టును తీసివేసి మెత్తటి పేస్టులాగా చేసుకోవాలి. వెల్లుల్లిలో యాంటీబ్యాక్టీరియల్ గుణాలు ఉండడం వల్ల సెగ గడ్డలు పోగొట్టడానికి చాలా బాగా ఉపయోగపడుతుంది. అలాగే ఇన్ఫెక్షన్ అవ్వకుండా కాపాడుతుంది. తర్వాత మీరు ఇంట్లో ఉండే వైట్ టూత్ పేస్ట్ ని ఒక అరటీస్పూన్ వరకు కలుపుకోండి. టూత్ పేస్ట్ కూడా సెగ గడ్డలను పోగొట్టడానికి చాలా అద్భుతంగా పనిచేస్తుంది. తరువాత 10 వరకు పసుపు వేసుకొని బాగా కలుపుకోవాలి పసుపులో ఉండే యాంటీ సెప్టిక్ గుణాలు, యాంటీబ్యాక్టీరియల్ గుణాలు చికిత్స చేయడానికి బాగా ఉపయోగపడతాయి అలాగే ఇన్ఫెక్షన్ అవ్వకుండా దురద రాకుండా బాగా ఉపయోగపడుతుంది. ఇప్పుడు వేసుకున్న అన్నీ కూడా బాగా కలుపుకోవాలి. ఇప్పుడు మన ఇంటి చిట్కా రెడీ అయ్యింది.

వాడటం :

ముందుగా మీరు సెగగడ్డలు ఉన్న ప్రాంతంలో గోరువెచ్చని నీళ్లతో క్లీన్ చేసుకోవాలి . తరువాత శుభ్రమైన మెత్తటి క్లాత్ తో తడి మొత్తాన్ని తుడిచేసి పొడిగా మారిన తర్వాత మనం తయారు చేసుకున్న పేస్ట్ని అప్లై చేసుకోవాలి. ఒక మూడు నాలుగు గంటలు ఉంచుకోవాలి. మూడు నాలుగు గంటల తరువాత గోరు వెచ్చటి నీళ్లతో కడిగేసుకోవాలి. ఇలా చేయడం వల్ల సెగ గడ్డలు త్వరగా పోతాయి.