వీటిని మిస్ చేయకుండా తినడం వల్ల ఎంతటి మోకాళ్ళ నొప్పులైన తగ్గిపోతాయి

మోకాళ్ళ నొప్పులతో బాధ పడేవారు ఎట్టి పరిస్థితుల్లో 5 రకాల తప్పులను అస్సలు చేయకూడదు . మన శరీరంలో కాల్షియం , విటమిన్ డి సరైన మోతాదులో వుందో లేదో తెలుసుకోకపోవడం , కూర్చునే విధానం నడిచే విధానం లో చేసే తప్పు లను సవరించక పోవడం ,పేయిన్ కిల్లర్ ఎక్కువగా వాడటం ,నొప్పి తగ్గించే మందులు అధికంగా వాడడం , అధిక బరువును తగ్గించడంలో శ్రద్ధ పెట్టక పోవడం , ఆహార నియమాలను సరిగా పాటించక పోవడం అనేవి మోకాళ్ళ నొప్పులకు ప్రధాన కారణం .మోకాళ్ళ నొప్పులతో బాధపడే వారు ఈ 5 తప్పులను ఎలా సవరించుకోవాలి చూద్దాం . భవిష్యత్తు లో ఈ నొప్పులు రాకుండా అలాగే నొప్పులు వచ్చిన వాళ్ళు ఆపరేషన్స్ జోలికి పోకుండా ఎలా తగ్గించుకోవచ్చు .

కాల్షియం 450 మిల్లీగ్రాములు పెద్దలకు కాల్షియం వంటికి పట్టాలంటే విటమిన్ D కావాలి అందుకే కాల్షియం లోపం అనేది మోకాళ్ళ నొప్పులకు ప్రధాన కారణం కాబట్టి కాల్షియం అధికంగా ఉండే ఆహార పదార్దాలు తీసుకోవడం వల్ల మంచి ప్రయోజనం కలుగుతుంది . అందుకని నువ్వుల ఉండలు తినడం , ముఖ్యంగా ఆకుకూరలైన తోట కూర , పొనగంటి కూర , మునగాకు , బచ్చలి కూర , మెంతి కూర లాంటివి తీసుకొంటే శరీరానికి కావాల్సిన కాల్షియం పుష్కలంగా లభిస్తుంది . ఎండలో ఉండడం సాధ్యం కానీ వారు డాక్టర్ల సలహా మేరకు విటమిన్ D టాబులెట్లను వాడడం వల్ల మంచి ప్రయోజనం కలుగుతుంది .

మరింత సమాచారం కోసం కింది వీడియో చుడండి

ఎముకల సమస్య నొప్పుల సమస్య పెరగకుండా నివారించడానికి ఎముకల పుష్టి కి గట్టికి ఆరోగ్యానికి ఈ తప్పులు చేయొద్దు .మోకాళ్ళ నొప్పులతో బాధపడే వారు వాకింగ్ చేయకూడదు ,వంగి బరువులు ఎత్తడం కానీ బరువులు మోయటం మంచిది కాదు ,మెట్లు ఎక్కడం ,మోకాళ్ళు మడిచి ఆసనాలు అలాగే మోకాళ్ళు మలిచి కూర్చోవడం వంటివి చేయకూడదు . వ్యాయామాలు చేసే తప్పుడు డాక్టర్స్ సలహాల మేరకు చేయాలి .నొప్పులు ఎక్కువ ఉన్నవారు నడిచే టప్పుడు ని ప్యాడ్స్ పెట్టుకోవాలి . నడిచే టప్పుడు గతుకులు రోడ్డు మీద జాగ్రత్తగా ఉండాలి .

పెయిన్ కిల్లర్స్ ఎక్కువగా వాడటం వలన అసలు నొప్పి వున్న భావన అస్సలు తెలియదు .సాధారణ వ్యక్తుల వలన నడవ గలరు పనులు చేసుకోగలరు ఇందువలన చాలా హాయిగా అనిపిస్తుంది అని చాలా బాగా పనిచేస్తున్నాయి అనుకుంటారు. కానీ పెయిన్ కిల్లర్స్ వాడటం వలన డ్యామేజ్ ఎక్కువ అవుతుంది దీనినే నమ్మించి మోసం చేయడం జరుగుతుంది . జబ్బు తగ్గడానికి పెయిన్ కిల్లర్స్ కి అస్సలు సంబంధం లేదు నొప్పి మాత్రం మీకు తెలియకుండా చేస్తుంది ఆ నొప్పులను నరాల ఎండింగ్ నుండి బ్రెయిన్ కు చేరకుండా ఈ మధు కాపలా కాస్తుంది .ఉదయం ఒకటి సాయంత్రం ఒకటి పెయిన్ కిల్లర్ వేసుకుంటే వాళ్ళు 4,5 ఏళ్ళు గెంటేస్తారు .పెయిన్ కిల్లర్స్ వల్ల కిడ్నీలు పాడవడం ,అల్సర్ ,లివర్ కి సేడ్ ఎఫెక్ట్స్ వంటి చాలా రకాల సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయి .అందుకని ఎప్పుడో ఒక్కసారి తప్పని సరి పరిస్థులలో అయితే వాడుకోవచ్చు