హార్ట్ ఎటాక్ వచ్చినప్పుడు ఇలా చేస్తే తొందరగా కోలుకుంటారు ..తప్పక తెలుసుకోండి ..!

గుండెపోటు లేదా కార్డియాక్ అరెస్టు వల్ల ఒక వ్యక్తి ఉన్నట్టుండి కుప్పకూలిపోతారు. అలాంటి సమయంలో సీపీఆర్ చేస్తే ఆ వ్యక్తి బతికే అవకాశం ఉంటుంది. మరి సీపీఆర్ ఎలా చేయాలో తెలుసుకోండి.గుండెపోటు అనేది ఎప్పుడు ఏ సమయంలో వస్తుందో అంచనా వేయలేము. ఒక మనిషి మన కళ్ళ ముందే గుండెపోటుతో పడిపోతే సీపీఆర్ చేయడం ద్వారా తిరిగి ఆ మనిషిని బతికించుకోవచ్చు. సీపీఆర్ అంటే కార్డియో పల్మొనరీ రెసస్కిటేషన్. సీపీఆర్ చేయడం వల్ల గుండెపోటు వచ్చిన వ్యక్తులను తిరిగి బతికించుకునే అవకాశం ఉంది. అకస్మాతుగా గుండె ఆగిపోవడాన్ని కార్డియాక్ అరెస్ట్ అంటారు. అంటే గుండె పనితీరు పూర్తిగా తగ్గిపోవడం లేదా 200 కంటే ఎక్కువ సార్లు గుండె కొట్టుకుని ఆగిపోవడం వల్ల కార్డియాక్ అరెస్ట్ అనేది వస్తుంది. ఐతే ఇలా అకస్మాత్తుగా పడిపోయిన వ్యక్తులకు సీపీఆర్ చేయడం ద్వారా బతికించుకోవచ్చు. ఇలా సీపీఆర్ చేసి కొంతమందిని కాపాడిన సందర్భాలను మనం చూశాం. అయితే మీరు చూస్తుండగా కార్డియాక్ అరెస్ట్ తో ఒక మనిషి పడిపోతే సీపీఆర్ ఎలా చేయాలో తెలుసుకోండి.

సీపీఆర్ కి ముందు చేయవలసిన పని:

  • సీపీఆర్ చేయడానికి ముందు  చేయవలసిన పని అంబులెన్స్ కి కాల్ చేయమని చెప్పడం.
  • ఆ సమయంలో మీరు తప్ప ఎవరూ లేకపోతే మీరే కాల్ చేసి అంబులెన్స్ ని పిలవాలి.
  • కాల్ లో ఉండగానే పడిపోయిన వ్యక్తి చేతికి పల్స్ ఉందా? లేదా? చెక్ చేయాలి.
  • కంటి చూపు ఎలా ఉంది? చలనం ఉందా? లేదా? చూడాలి.
  • గుండె మీద చేయి పెట్టి కొట్టుకుంటుందా? లేదా? అనేది చూడాలి.
  • ఒకవేళ గుండె కొట్టుకోవడం గానీ, చేతి మీద పల్స్ గానీ లేకపోతే వెంటనే సీపీఆర్ చేయాలి.

సీపీఆర్ చేసేటప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలు:

  • రెండు చేతులను ఒకదానిపై ఒకటి పెట్టుకుని.. ఛాతి మధ్యలో పెట్టి నొక్కాలి.
  • గుండె పై భాగంలో స్టెర్నమ్ అనే ఎముక మీద, ఛాతి మధ్యలో ఉండే మేనుబ్రియం అనే ఎముక మీద చేతులతో నొక్కుతూ ఒత్తిడి చేయాలి. ఎక్కువ ఒత్తిడి చేయకూడదు, అలా అని మరీ తక్కువ ఒత్తిడి ఉండకూడదు. చాలా బ్యాలెన్సింగ్ గా చేయాలి.
  • పక్కటెముకలు మీద అస్సలు నొక్కకూడదు. అవి చాలా సున్నితంగా ఉంటాయి. విరిగిపోయి ప్రమాదం ఉంది.
  • ఛాతి మధ్య భాగంలో మాత్రమే రెండు చేతులు ఒకదానిపై ఒకటి పెట్టి నొక్కాలి.

సీపీఆర్ చేయడం ఎలా..?

  • గుండెపోటు లేదా కార్డియాక్ అరెస్టుకు గురైన వ్యక్తిని బహిరంగ ప్రదేశంలోకి తీసుకెళ్లి పడుకోబెట్టాలి.
  • రెండు చేతులతో ఛాతి మధ్యలో బలంగా నొక్కాలి. ఇలా 30 సార్లు కంటిన్యూగా చేయాలి.
  • మధ్యలో పడిపోయిన వ్యక్తి నోటిలో నోరు పెట్టి గాలి ఊదాలి. ఇలా ఆ వ్యక్తికి స్పృహ వచ్చేవరకూ చేయాలి.
  • నోటితో చేయలేని వారు పేపర్ ని పైప్ లా చుట్టి గాలి ఊదాలి. ఇలా చేయడం వల్ల ఊపిరితిత్తులు స్టిమ్యులేట్ అయ్యి ఊపిరి ఆడడం మొదలవుతుంది.
  • అప్పటికీ ఊపిరి అందకపోతే రోగి రెండు కాళ్ళు నిటారుగా లేపాలి. ఇలా చేయడం వల్ల శరీరం దిగువ భాగంలో ఉన్న రక్తం తిరిగి గుండెకు చేరుకోవడం ద్వారా గుండె పని చేసే అవకాశం ఉంటుంది.
  • గుండె కొట్టుకోవడం మొదలైన తర్వాత పల్స్ చెక్ చేయాలి. పల్స్ వాల్యూమ్ బాగుందా? లేదా? పల్స్ క్రమంగా వస్తుందా? ఇర్రెగ్యులర్ గా వస్తుందా? అనేది చెక్ చేయాలి.
  • ఈలోపు అంబులెన్స్ కి కాల్ చేయమని చెప్పడమో, కాల్ చేయడమో చేస్తే సీపీఆర్ పూర్తయ్యేలోపు అంబులెన్స్ వస్తుంది.
  • సీపీఆర్ చేయడం వల్ల చాలా మంది తిరిగి బతికారు.
  • పిల్లలకు, శిశువులకు కూడా ఇదే పధ్ధతి. కానీ పిల్లలకు ఛాతి మధ్యలో ఒక చేత్తోనే నొక్కాలి. శిశువుకి రెండు వేళ్ళతో మాత్రమే మెల్లగా నొక్కుతూ ఉండాలి.
  • సీపీఆర్ చేయడం వల్ల ఆగిపోయిన శరీర భాగాలకు, మెదడుకు తిరిగి రక్త సరఫరా జరుగుతుంది.

సీపీఆర్ ఎవరు చేయాలి..?

  • సీపీఆర్ అనేది ఎవరైనా చేయవచ్చు. అయితే దీని గురించి అవగాహన ఉండాలి.

సీపీఆర్ చేసేటప్పుడు గుర్తించుకోవాల్సిన అంశాలు:

  • శ్వాస ఆగిపోకుండా చూడడం .
  • గుండె చప్పుడు రికవరీ అయ్యేలా చూడడం .
  • రక్త సరఫరా తిరిగి పునరుద్ధరించబడటం .
  • రోగి యొక్క స్పందన బట్టి ఐదు హార్ట్ బీట్ లకు ఒకసారి నోటి ద్వారా శ్వాసను అందించాలి.

సీపీఆర్ చేస్తే ఆ వ్యక్తి 2 నిమిషాల్లోనే బతికే అవకాశం ఉందని డాక్టర్లు చెబుతున్నారు. సీపీఆర్ ఎలా చేయాలో అనే విషయాన్ని డాక్టర్ చెప్పిన వీడియో కింద ఉంది. వీడియోలో సీపీఆర్ ఎలా చేయాలి? సీపీఆర్ చేసేటప్పుడు పాటించవలసిన ప్రాథమిక సూత్రాలు ఏమిటి? అనే వివరాలు డాక్టర్ ప్రస్తావించారు. వీడియో చూస్తే సీపీఆర్ మీద మీకు మరింత అవగాహన వస్తుంది. మరి వీడియోని చూసి సీపీఆర్ ఎలా చేయాలో తెలుసుకోండి. అలానే ఈ ఆర్టికల్ ని ప్రతీ ఒక్కరికీ షేర్ చేయండి. సీపీఆర్ చేయడం వల్ల ఒక మనిషి ప్రాణాలను కాపాడినవారు అవుతారు. అలానే సీపీఆర్ గురించి మీకు తెలిసిన విషయాలను కామెంట్ల ద్వారా తెలియజేయండి.