Jr. NTR : ఎన్టీఆర్ కు దక్కిన అత్యుత్తమ గౌరవం…

Jr. NTR : తెలుగు సినీ ఇండస్ట్రీలో స్టార్ హీరోగా కొనసాగుతున్న యంగ్ టైగర్ ఎన్టీఆర్ గురించి ఎంత చెప్పినా తక్కువే..ఒక తెలుగు సినీ ఇండస్ట్రీలోనే కాకుండా ప్రపంచంలోని పలుదేశాలలో కూడా ఎన్టీఆర్ కి ఫ్యాన్ ఫాలో ఉంది .ఆయన సినిమాలకు భారీ క్రేజ్ ఉంది. ఇక నటనపరంగా ఎన్టీఆర్ ని ఎంత పొగిడినా తక్కువే. అలాగే తారక్ డాన్స్ ,డైలాగ్ డెలివరీ ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకునేలా చేస్తుంది. ఇక ఇటీవల రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన ఆర్ఆర్ఆర్ Jr. NTR : తెలుగు సినీ ఇండస్ట్రీలో స్టార్ హీరోగా కొనసాగుతున్న యంగ్ టైగర్ ఎన్టీఆర్ గురించి ఎంత చెప్పినా తక్కువే..ఒక తెలుగు సినీ ఇండస్ట్రీలోనే కాకుండా ప్రపంచంలోని పలుదేశాలలో కూడా ఎన్టీఆర్ కి ఫ్యాన్ ఫాలో ఉంది .

ఆయన సినిమాలకు భారీ క్రేజ్ ఉంది. ఇక నటనపరంగా ఎన్టీఆర్ ని ఎంత పొగిడినా తక్కువే. అలాగే తారక్ డాన్స్ ,డైలాగ్ డెలివరీ ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకునేలా చేస్తుంది. ఇక ఇటీవల రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన ఆర్ఆర్ఆర్ సినిమాతో రామ్ చరణ్ మరియు తారక్ ఇద్దరు పాన్ ఇండియా స్టార్స్ అయిపోయారు. ఈ సినిమా ఆస్కార్ అవార్డును కూడా అందుకున్న విషయం తెలిసిందే. ఇక ఈ సినిమాలో కొమరం భీం పాత్రలో నటించిన ఎన్టీఆర్ తన నటనతో ప్రేక్షకులను మంత్రముగ్ధులను చేశాడు. అయితే నటనపరంగా జూనియర్ ఎన్టీఆర్ ఎన్నో అవార్డులను అందుకున్నారు. ఈ నేపథ్యంలోనే తాజాగా ఇప్పటివరకు తెలుగు సినీ ఇండస్ట్రీలో ఎవరి అందుకోలేని ఒక అరుదైన గౌరవాన్ని జూనియర్ ఎన్టీఆర్ దక్కించుకున్నాడు.

అయితే ఆస్కార్ నివేదిక ప్రకారం బోర్డ్ ఆఫ్ గవర్నర్స్ ఆహ్వానం మేరకు యాక్టర్స్ బ్రాంచ్ సభ్యత్వం పొందేందుకు అర్హతత సాధిస్తారు. మోషన్ పిక్చర్ ఆర్ట్స్ అండ్ సైన్స్ లో యాక్టివ్ ఉన్నవాళ్ళకు వెండి తెర పై వారి ప్రతిభను కనబరిచిన వారి లో చాలా కొద్ది మందికి మాత్రమే సభ్యత్వ ఆహ్వానాలు పంపడం జరుగుతుంది. ఇక ఈ సభ్యత్వం పొందాలంటే మోషన్ పిక్చర్స్ ఆర్ట్స్ అండ్ సైన్స్ లో డిస్టిక్షన్ సాధించి ఉండాలి. అంతేకాక దీనిలో స్థానం పొందాలంటే నటుడు కనీసం మూడు థ్రియేటికల్ సినిమాలను నటించి ఉండాలి.ఆ సినిమాలు కూడా ఐదేళ్ల లోపే నటించి ఉండాలి…అలాగే యాక్టింగ్ కేటగిరీలో అకాడమీ అవార్డుకు నామినేట్ అయి ఉండాలి. ఈ నిబంధనలన్నిటిని పరిగణలోకి తీసుకుని ఎంపిక చేయడం జరుగుతుంది. ఈ నేపథ్యంలోనే ఎన్టీఆర్ కు ఈ ఆరుదైన గౌరవం దక్కింది.ఎన్టీఆర్ తో పాటు దీనిలో నలుగురు హాలీవుడ్ యాక్టర్స్ కూడా ఉన్నారు. అయితే ఇటీవల నటీనటుల బ్రాంచ్ లో చేరిన కొత్త సభ్యుల జాబితాను సోషల్ మీడియా వేదికగా గురువారం అధికారికంగా ప్రకటించడం జరిగింది. ఇక దీనిలో జూనియర్ ఎన్టీఆర్ తో పాటు ఆస్కార్ విజేతలు కే హుయ్ క్వాన్, మార్షా స్టెఫానీ బ్లేక్, కెర్రీ కాండన్, రోసా సలాజర్ ఉన్నారు. అయితే ఆస్కార్ సభ్యత్వం దక్కడమంటే తేలికైనైన విషయం కాదు. అలాంటి అత్యుత్తమ ప్రతిష్టాత్మకమైన గౌరవం ఎన్టీఆర్ లు దక్కడంతో అభిమానులు ఖుషి అవుతున్నారు. తెలుగు సినీ ఇండస్ట్రీకి నువ్వు గర్వకారణం అంటూ కొని ఆడుతున్నారు. అయితే ప్రస్తుతం తారక్ దేవర సినిమా షూటింగ్లో బిజీగా ఉన్నాడు. ఇక ఈ సినిమాకు కొరటాల శివ దర్శకత్వం వహిస్తుండగా ఈ సినిమాను రెండు భాగాలుగా ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు.