WhatsApp Channels: క్రికెట్, సినిమా అప్డేట్స్.. ఇకపై వాట్సాప్ నుంచి!

ప్రముఖ మెసేజింగ్ యాప్ వాట్సాప్ కొత్త ఫీచర్ ను అందుబాటులోకి తీసుకొచ్చింది. ఇప్పటికే ఇన్ స్టాగ్రామ్, ట్విట్టర్, టెలిగ్రామ్స్ లో ఉన్న ‘ఛానెల్స్ ఫీచర్’ను ఇప్పుడు వాట్సాప్ లో తీసుకొచ్చింది. భారత్ సహా మొత్తం 150 దేశాల్లో ఈ ఫీచర్ ను ప్రారంభించింది. ప్రస్తుతం కొంత మంది వినియోగదారులకు అందుబాటులో ఉన్న ఈ ఫీచర్.. త్వరలో అందరికీ అందుబాటులోకి రానుంది. అయితే అసలు ఈ వాట్సాప్ ఛానల్స్ అంటే ఏంటి? వాట్సాప్ లో స్టేటస్ ప్లేస్ లో అప్ డేట్స్ అని కనిపిస్తుంది? ఈ అప్ డేట్ ఏంటి? దీన్ని ఎలా వాడాలని చాలా మందిలో ఓ ప్రశ్న మెదులుతోంది. ఈ ఛానెల్స్ ఫీచన్ ఎలా వాడాలంటే..? వాట్సాప్ ను ఇన్నాళ్లు ఒకరినొకరు కమ్మూనికేట్ చేసుకోవడానికే వాడారు.

ఆ తర్వాత గ్రూప్స్ వచ్చాయి. ఇప్పుడు ఈ ఛానెల్స్ ఫీచర్. ఇన్ స్టాగ్రామ్, ట్విట్టర్ లో ఒక వ్యక్తిని, సంస్థను ఎలా ఫాలో అయి ఎలా అయితే ఎప్పటికప్పుడు అప్ డేట్స్ తెలుసుకుంటామో.. ఇప్పుడీ వాట్సాప్ ఛానెల్స్ ద్వారా కూడా అప్ డేట్స్ తెలుసుకోవచ్చు. వాళ్లను ఫాలో అవ్వొచ్చు. వాళ్ల పెట్టిన పోస్ట్ ను ఇతరులకు షేర్ చేయొచ్చు. అయితే మీరు వాట్సాప్ ఛానెల్స్ లో వాళ్లను ఫాలో అయినంత మాత్రాన వాళ్ల ఫోన్ నెంబర్ మీకు కనిపించడం గానీ, మీ నెంబర్ వాళ్లకు కనిపించడం గానీ జరగదు. అంతేకాకుండా ఫాలో అయినవాళ్లకు రిప్లూ ఇవ్వడం కూడా కుదరదు. ఉదాహరణకు మీరు.. మైక్ టీవీని వాట్సాప్ ఛానెల్స్ లో ఫాలో అవుతున్నట్లయితే.. మైక్ టీవీ పెట్టే ప్రతీ అప్ డేట్ మీ వాట్సాప్ కనిపిస్తుంది.

ఎలా ఫాలో కావాలి?

వాట్సాప్ స్టేటస్ స్థానంలో అప్ డేట్స్ ఆప్షన్ కనిపిస్తుంది. అది క్లిక్ చేస్తే స్టేటస్ ల తర్వాత దిగువన ఛానెల్స్ కనిపిస్తాయి. అక్కడ కనిపించే ప్లస్ సింబల్ ను క్లిక్ చేసి మీకు నచ్చిన వాళ్లను ఫాలో అయిపోవచ్చు. అంతేకాకుండా ఫాలో అయిన తర్వాత బెల్ ఐకాన్ క్లిక్ చేసి నోటిఫికేషన్ మ్యూట్, అన్ మ్యూట్ కూడా చేయొచ్చు. మీరు కూడా సొంత ఛానెల్ ను క్రియేట్ చేయొచ్చు. దానికోసం ఛానెల్స్ పక్కనే ఉన్న ప్లస్ సింబల్ క్లిక్ చేసి క్రియేట్ ఛానెల్ ఆప్షన్ సెలక్ట్ చేసుకోవాలి. తర్వాత డీపీ, ఛానెల్ పేరు, ఛానెల్ డిస్క్రిప్షన్ ఇచ్చి సింపుల్ గా ఛానెల్ క్రియేట్ చేసుకోవచ్చు.