ఆగష్టు 31 వినాయకచవితి నుండి కుంభరాశి వారికి …

ఆగస్టు 31 వినాయక చవితి నుండి కుంభ రాశి వారికి ఎలా ఉండబోతుంది. మీరు ఎలాంటి పరిహారాలు చేయాలి అనేటువంటి విషయాలని ఇప్పుడు మనం తెలుసుకుందాం. హిందూ క్యాలెండర్ ప్రకారం ప్రతి సంవత్సరం బాద్ర పదమాసంలోనే శుక్లపక్ష చతుర్థి తిథినాడు పవిత్రమైన గణేష్ చతుర్థి లేదా వినాయక చవితి పండుగను జరుపుకుంటారు. ఈరోజు నుండి గణేష్ ఉత్సవాలు ప్రారంభం అవుతాయి, ఈ పండుగను 10 రోజులపాటు జరుపుకుంటారు. ఈ పండుగ రోజున ప్రతి ఒక్కరూ తమ ఇంటిలో గణపతి విగ్రహాన్ని ప్రతిష్టించి పూజలు చేస్తారు. అనంత చతుర్థి రోజున గణపతి నిమర్జనం చేశారు.

ఈరోజు న దేవుని పూజించడం వలన భక్తుల కోరికలన్నీ నెరవేరుతాయి. అయితే జ్యోతిష్య శాస్త్రం ప్రకారం వినాయక చవితి రోజున కీలక మార్పు జరగబోతుంది. శుక్ర గ్రహం సింహ రాశిలోకి ప్రవేశించనుంది, అందువల్ల కొన్ని రా శుల వారికి గణేష్ చతుర్థి నుంచి మంచి రోజులు ప్రారంభం కానున్నాయి. జ్యోతిష్య శాస్త్ర ప్రకారం గ్రహాలు ఎప్పటికప్పుడు ఒక రాశి నుండి మరొక రాశికి మారుతూ ఉంటాయి. కొన్ని రాశులకు నెల రోజుల సమయం పడితే ఇంకొన్నిటికీ ఏడాది పైన పడుతుంది. అయితే ఈ గ్రహాల సంచారం మనుషులపై ప్రత్యక్ష ప్రభావం చూపిస్తుంది. భౌతిక ఆనందంతో ఆశ్చర్యాన్ని ఇచ్చే శుక్రుడు ఆగస్టు 31న సింహరాశిలోకి ప్రవేశించనున్నాడు. అయితే అదే రోజున వినాయక చవితి అందువల్ల ఈసారి శుక్రుడి పరావర్తనం ప్రత్యేకత సంతరించుకుంది. శుక్రుడి రాశి మార్పు వల్ల కుంభరాశి వారికి ఎంతో శుభప్రదంగా ఉంటుంది.

గతంలో ఉండే భయం తొలగిపోతుంది, ఉద్యోగ రీత్యా ఇప్పటివరకు ఏదైతే ఇబ్బందులను ఎదుర్కొన్నారో ఆ ఇబ్బందులన్నీ కూడా తొలగిపోతాయి అని చెప్పడంలో ఏమాత్రం సందేహం లేదు. ఇంకా గతంతో పోలిస్తే వృత్తిపరంగా ఆర్థిక పరంగా ఆరోగ్యపరంగా చాలా అనుకూలంగా ఉంటుంది. కాలంతో పాటుగా పడిన కష్టానికి ఫలితం లభిస్తుంది. ఆర్థిక పరిస్థితి మరింత మెరుగుపడే అవకాశం ఉంది. అలాగే తిరిగి మీ కుటుంబంతో కలిసి ఉండే అవకాశం లభిస్తుంది. అలాగే విదేశాల్లో ఉద్యోగం దొరుకుతుంది, అలాగే ఇప్పటివరకు వివాహం కోసం ఎవరైతే ఎదురు చూస్తూ ఇబ్బంది పడుతూ మానసిక ఆందోళనకు గురైన వారు ఎవరైతే ఉన్నా రో, వారికి వివాహ సమయం దూసుకు వచ్చిందానే చెప్పుకోవచ్చు. అదేవిధంగా సంతానం కలగని వారు వారికి సంతానం కలగడం కానీ, సంతానం రెత్య మంచి గుర్తింపు కానీ లభించే అవకాశం మరింత దృఢంగా కనిపిస్తుంది.