ఇలాచేస్తే ఒక్క దోమ కూడా కనిపించదు….

మనం హెల్తీగా ఉండాలంటే మన బాడీని నీట్ గా చూసుకోవడంతో పాటు మన ఇంటిని ఇంకా మన సరౌండింగ్ కూడా నీట్ గా ఉంచుకోవాలి. అయితే మనం ఇలా నీట్ గా ఉంచిన కూడా మనకి ఒక్కొక్కసారి హైజిన్ ప్రాబ్లం ఉండడం వల్ల దోమలు ఎక్కువగా ఉంటాయి. అయితే ఈ సరౌండింగ్ ద్వారా మనకు దోమలు ఎక్కువగా ఇంట్లోకి రావడం లేదా బయట అన్ హైజిన్ ఎక్కువగా ఉండడం చెట్లు ఎక్కువగా ఉండడం ద్వారా మనకి ఇంట్లోకి కూడా దోమలు వచ్చేస్తాయి. అయితే దోమల వల్ల మనకు మలేరియా డెంగ్యూ అంటే డిసీజెస్ వస్తూ ఉంటాయి.

కాబట్టి మనం సరౌండింగ్ నీట్ గా ఉంచుకొని దోమలు రాకుండా చూసుకోవాలి. మనం చాలా సార్లు చూస్తూనే ఉంటాo, ఈ మస్కిటో కాయిల్స్ వల్ల మస్కిటో రిమూవర్స వల్ల చిన్న పిల్లలకి పెద్దలకి ఎక్కువగా బ్రీతింగ్ ప్రాబ్లమ్స్ స్టార్ట్ అవ్వడం లేదంటే స్టమక్ ఇన్ఫెక్షన్ రావడం ఇంకా వేరే డిసీజెస్ రావడం లాంటివి జరుగుతూ ఉంటాయి, ఈ విధంగా మన బాడికి చాలా హాని కలిగిస్తాయి. అలాంటి ప్రాబ్లమ్స్ ఏమీ లేకుండా సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా నాచురల్ పద్ధతిలోనే మనం కొన్ని రెమెడీస్ ని పాటించినట్లయితే మిమ్మల్ని మనం రాకుండా చూసుకోవచ్చు మరియు మన హెల్త్ కూడా బాగుంటుంది. ఆ రెమెడీస్ ఏమిటో వాటిని ఎలా పాటించాలో తెలుసుకుందాం.

దోమలు ఇంట్లోకి రాకుండా ఉండడానికి దీనికోసం మనకు కావాల్సిన ఇంగ్రిడియంట్స్ ఏమిటంటే కోకోనట్ ఆయిల్, తర్వాత వెల్లుల్లిపాయలు తీసుకోవాలి, ఇప్పుడు ఒక బౌల్ తీసుకుని ఒక రెండు వెల్లుల్లిపాయలను యాడ్ చేసుకోవాలి వీటిని కాస్త కచ్చాపచ్చాగా దంచుకోవాలి, ఇప్పుడు కొద్దిగా కోకోనట్ ఆయిల్ ను యాడ్ చేసుకోవాలి. తర్వాత ఈ ఆయిల్ మరియు వెల్లుల్లి పాయలను కాసేపు అలా ఉంచాలి. ఇప్పుడు దీనిని ఒక బాటిల్ లో స్టోర్ చేసుకుని పెట్టుకుంటే చాలా మంచిది, వెల్లుల్లిపాయల్లో ఉండే ఘాటు దోమల నుండి మనల్ని చాలా బాగా రక్షిస్తుంది, ఇలా తయారు చేసుకున్న ఈ మిశ్రమాన్ని బాడి మొత్తం అప్లై చేసుకోవాలి. దీనివల్ల దోమలు కుట్టకుండా ఉండడమే కాకుండా కొబ్బరి నూనె అనేది మన బాడీకి చాలా మంచి మాయిశ్చర్ అందిస్తుంది, అలాగే స్కిన్ కి ఎలాంటి ప్రాబ్లమ్స్ కానీ మచ్చలు కానీ పిగ్మెంటేషన్ కానీ ఇలాంటివి ఏమైనా ఉన్నా కూడా వాటిని తగ్గిస్తుంది.

ఇలా ఈ ఆయిల్ ని తయారు చేసుకుని పెట్టుకుని పడుకునే ముందు కాళ్లకు చేతులకు అప్లై చేసుకుని పడుకుంటే దోమలు అస్సలు దగ్గరికి రావు. అలాగే ఇలా తయారు చేసుకున్న మిశ్రమాన్ని ఒక స్ప్రే బాటిల్ లో కొంచెం వాటర్ యాడ్ చేసుకుని మీ ఇంటి కార్నర్స్ లో ఎక్కడైతే దోమలు ఎక్కువగా ఉంటాయో అక్కడ స్ప్రే చేసుకోవడం ద్వారా కూడా దోమలు కార్నర్స్ లో ఉండిపోయి కుట్టకుండా ఉండడం జరుగుతుంది. దీన్ని చిన్నపిల్లలకు కూడా అప్లై చేయవచ్చు, ఎందుకంటే మనం దోమల కోసం వాడే లిక్విడ్స్ కానీ కాయిన్స్ కానీ ఇవన్నీ కూడా చాలా హాంఫుల్ గా ఉంటాయి, ఇలాంటి ప్రాబ్లమ్స్ ఏమీ లేకుండా ఇది నేచురల్ ఇంగ్రిడియంట్స్ కాబట్టి దీనితో ప్రయోజనాలే తప్ప ఎలాంటి హానికర సమస్యలు ఉండవు.