ఇలా జరిగితే వెంటనే ఇల్లు ఖాళీ చేయండి లేకపోతే చాలా నష్టం…

జియోపతిక్ స్ట్రెస్ అంటే ఏమిటో, ఇది ఉన్నప్పుడు ఇంట్లో ఎలాంటి సమస్యలు వస్తాయో, జియోపతిక్ స్ట్రెస్ నుండి బయటపడాలంటే ఇంట్లో ఎలాంటి ప్రత్యేకమైన విధి విధానాలు పాటించాలి అనే విషయాల గురించి ఈ రోజు మనం తెలుసుకుందాం! సహజంగా మనం ఒకసారి ఆకాశం నుండి కొన్ని హానికరమైన విద్యుదయస్కాంత కిరణాలు భూమి మీదకు వస్తాయి. అలాగే కొన్నిసార్లు భూమి కింద భాగంలో నీటి ప్రవాహం వల్ల లవణాలన్ని కూడా ఒకే చోట చేరి కొన్ని హానికరమైన అటువంటి శక్తి తరంగాలు భూమిలో ఆ ప్రదేశంలో ఉండిపోతాయి. ఇలా ఆకాశం నుండి వచ్చిన విద్యుదయస్కాంత కిరణాలు వల్లగాని లేదా భూమి కింద లవణాలన్ని ఒకే చోట ఏర్పడడం వల్ల వచ్చేటటువంటి హానికరమైన ప్రభావం వల్ల కానీ ఆ ప్రదేశంలో ఆ ప్రాంతంలో జియోపతిక్ స్ట్రెస్ అనేది ఏర్పడుతుంది.

దీనినే భూ సంబంధ అనారోగ్య ఒత్తిడి అనే పేరుతో కూడా పిలుస్తారు. ఆ ప్రదేశంలో ఇల్లు కట్టుకున్న, ఆ ప్రదేశంలో ఉన్న ఇంట్లో ఉన్న అనేక రకాల సమస్యలు వస్తూ ఉంటాయి. ఆ సమస్యలు ఏమిటంటే ఎప్పుడైనా సరే ఇంట్లో జియోపతిక్ స్ట్రెస్ అనేది ఉంటే అసలు సరిగ్గా నిద్ర పట్టదు. మాటిమాటికి మెలుకవ వస్తూ ఉంటుంది, ఏ ఇంట్లో అయితే జియోపతిక్ స్ట్రెస్ ఉంటుందో ఆ ఇంట్లో ఆ కారణంగా గొడవలు అవుతూ ఉంటాయి. మానసికంగా అశాంతి ఉంటుంది, మానసికంగా ప్రశాంతత ఉండదు ఎప్పుడూ ఎవరో ఒకరికి అనారోగ్యాలు వస్తూ ఉంటాయి. ఇంట్లో ఎప్పుడూ ఏదో ఒక అనారోగ్య సమస్యలు ఉన్నా నా ఎప్పుడూ ఇంట్లో గొడవలు ఉన్నా నా అసలు ఇంట్లో నిద్రపోదామంటే నిద్ర సరిగ్గా పట్టదు ఎప్పుడు మెలుకువ వస్తున్నా ఆ ఇంట్లో జియోపతిక్ స్ట్రెస్ ఉందని అర్థం చేసుకోవాలి.

అంతేకాకుండా జియోపతిక్ స్ట్రెస్ ఒక ఇంట్లో ఉందో లేదో కొన్ని ప్రత్యేకమైన సంకేతాల ద్వారా తెలుసుకోవచ్చు. ఏ ఇంట్లో అయితే చీమలు విపరీతంగా తిరుగుతూ ఉంటాయో ఆ ఇంట్లో జియోపతిక్ స్ట్రెస్ ఎక్కువగా ఉంటుంది. ఏ ఇంట్లో అయితే మాటిమాటికీ చెదలు ఎక్కువగా పడుతూ ఉంటాయో అక్కడ కూడా జియోపతిక్ స్ట్రెస్ ఎక్కువగా ఉన్నట్లు తెలుసుకోవాలి. తేనెతుట్టె పెట్టాలని తేనెటీగలు ఎక్కడైతే ప్రయత్నం చేస్తూ ఉంటాయో అక్కడ కూడా ఈ సమస్య ఉంటుంది,కాబట్టి ఈ సంకేతాలను బట్టి అర్థం చేసుకోవాలి. అలాగే మీరు ఎప్పుడైనా సరే ఏ ఇల్లు అయినా కొనుక్కోవాలని వెళ్ళినప్పుడు ఆ ఇంట్లోకి వెళ్ళగానే కారణం లేకుండా మీ నాడీ వేగంగా కొట్టుకుంటుంది అనుకోండి అక్కడ జియోపతిక్ స్ట్రెస్ ఉందని తెలుసుకోవాలి,అంటే అలాంటి ఇల్లు కొనుక్కోకూడదు.

జియోపతిక్ స్ట్రెస్ ఉన్నచోట మీరు ఇళ్లలోకి వెళ్లగానే ఏ కారణం లేకుండా ఆ ఇంటిలో ఒక ప్రదేశం మొత్తం కూడా తడిగా ఉంటుంది. మీరు చెయ్యి పెట్టిన ,కాలు పెట్టిన నా చల్లగా తాకినట్లు అనిపిస్తుంది. అలాగే అసలు ఏ విధమైన తడి కూడా లేనప్పటికీ తడిగా ఉన్నప్పుడు ఎలాంటి వాసన వస్తూ ఉంటుందో అలాంటి వాసన వస్తూ ఉంటుంది. వీటన్నిటిని బట్టి అక్కడ జియోపతిక్ స్ట్రెస్ ఉంది అక్కడ ఉంటే హెల్త్ ప్రాబ్లమ్స్ వస్తాయి, అక్కడ ఉంటే ఇంట్లో గొడవలు అవుతాయి, అక్కడ ఉంటే అనవసరమైన ప్రమాదాలు వస్తాయి అని మీరు తెలుసుకోవాలి.