ఈ ఆకుపచ్చ దివ్య మూలికతో మహిళలకు ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు.. తక్షణమే ముఖ సౌందర్యం మీ సొంతం..!

ఒకప్పుడు తిప్పతీగ అనే మొక్క గురించి ఎవరికీ తెలియదు.. అది మన చుట్టూ ఉన్న కానీ ఏదో పిచ్చి మొక్క అని అనుకునేవారు. కరోనా టైంలో అందరూ ఈ ఆకులను టేస్ట్ చేసే ఉంటారు. ఇది మన పల్లెటూర్లో విరివిగా దొరుకుతుంది. తిప్పతీగ తో ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి.. ఇది రోగనిరోధక శక్తిని మెరుగుపరుస్తుంది. తిప్పతీగ కాండం నుంచి నాకు వరకు అనేక ఆరోగ్య ప్రయోజనాలను అందిస్తుంది. తిప్పతీగలో యాంటీ ఆక్సిడెంట్లు అధికంగా ఉంటాయి. అయితే ఈ మొక్క మహిళలకు ఏ విధంగా ఉపయోగపడుతుందో ఇప్పుడు మనం చూద్దాం.. తిప్పతీగ ఆకులను పొడి చేసుకుని బెల్లంతో కలిపి తింటే జీర్ణ వ్యవస్థ మెరుగుపడుతుంది.

అజీర్తి సంబంధిత సమస్యలు తగ్గుముఖం పడతాయి. మధుమేహం తిప్పతీగ చూర్ణం తీసుకోవడం వలన షుగర్ లెవెల్స్ కంట్రోల్ ఉంటాయి. మానసిక సమస్యలతో ఇబ్బంది పడేవారు ఈ ఆకులు వాడితే మంచి ఫలితం ఉంటుంది. గోరువెచ్చని పాలలో తిప్పతీగ చూర్ణం కలుపుకొని తాగడం వల్ల కీళ్ల నొప్పుల నుంచి ఉపశమనం కలుగుతుంది. తిప్పతీగ కాండంతో మహిళల్లో బోలు ఎముకల వ్యాధిని కంట్రోల్ చేయవచ్చు.. ఓ పరిశోధన ద్వారా బోలు ఎముకల వ్యాధి నివారణలో కి సహాయపడుతుందని నిరూపించారు. అలాగే తిప్పతీగ ఉసిరి ఆకులను కలిపి కూడా ఫేస్ మాస్క్ తయారు చేసుకొని వేసుకోవచ్చు.

దీనికోసం ముందుగా ఒక ఉసిరికాయ కొన్ని తిప్ప ఆకులను తీసుకొని మెత్తటి పేస్టులా చేసుకుని ఈ మిశ్రమాన్ని ముఖానికి అప్లై చేసి సుమారు 20 నిమిషాల పాటు ఉంచుకోవాలి. తర్వాత చల్లటి నీటితో శుభ్రం చేసుకోవాలి. దీంతో ముఖంలో సహజమైన మెరుపు కనబడుతుంది. ఆరోగ్యంతో పాటు అందాన్ని కూడా తిప్పతీగ చాలా బాగా ఉపయోగపడుతుంది. ముఖంపై మెరుపు తీసుకురావడానికి తిప్పతీగ ఆకులు సహాయపడతాయి. దీనికోసం కొన్ని ఆకులను తీసుకొని మెత్తగా పేస్ట్ లా చేసుకోవాలి. ఈ పేస్ట్ 15 నుంచి 20 నిమిషాల పాటు ముఖానికి అప్లై చేసి ఉంచుకోవాలి. తర్వాత చల్లటి నీటితో మొహాన్ని కడగాలి. వెంటనే ముఖంపై తక్షణ మెరుపు కనిపిస్తుంది..