ఈ ఆకు ఎక్కడైనా కనిపిస్తే జాగ్రత్తగా ఇంటికి తెచ్చుకోండి బంగారం కంటే విలువైనది…

బొప్పాయి :- మన దేశంలోకి బొప్పాయి (Papaya) 400 ఏళ్ల క్రితమే ప్రవేశించింది. మెక్సికో ప్రాంతానికి చెందిన బొప్పాయి అనేక ఇతర ఉష్ణమండలాల్లో ప్రాచుర్యం పొందింది. మనదేశంలో బొప్పాయిని ప్రధానంగా ఆంధ్ర ప్రదేశ్‌, తమిళనాడు, అస్సాం, బీహార్, పంజాబ్ తదితర రాష్ట్రాల్లో విరివిగా పండిస్తున్నారు. 2007 నాటికి ఆంధ్రప్రదేశ్ లో 3 వేల హెక్టార్ల విస్తీర్ణంలో సాగవుతున్నట్లు అంచనా. ముఖ్యంగా కడప, ఆదిలాబాద్, మెదక్ జిల్లాల్లో ఎక్కువగా సాగుచేస్తున్నారు.

మరింత సమాచారం కోసం ఈ వీడియో చూడండి :

బొప్పాయి ఆరోగ్య ప్రయోజనాలు :-

బొప్పాయి పండులోవున్నన్ని విటమిన్లు మరెందులోను లేవంటారు వైద్యులు. ఈ పండును ఆహారంగా తీసుకుంటే ఆరోగ్యం చాలా బాగుంటుందంటున్నారు ఆరోగ్య నిపుణులు. ఇందులో విటమిన్ “ఏ”, విటమిన్ “బీ”, విటమిన్ “సీ”, విటమిన్ “డీ”లు తగుమోతాదులోనున్నాయి. తరచూ బొప్పాయిపండును ఆహారంగా తీసుకుంటుంటే శరీరానికి కావలసిన విటమిన్లు పుష్కలంగా లభిస్తాయి. ఇందులో పెప్సిన్ అనే పదార్థం ఉండటం వలన జీర్ణక్రియ సాఫీగా జరుగుతుంది.

ఉదర సంబంధమైన జబ్బులను మటుమాయం చేసేందుకు బొప్పాయి పండు చాలా ఉపయోగకరంగా ఉంటుందంటున్నారు ఆరోగ్య నిపుణులు. శరీరంలోని పలు జబ్బులకు ప్రధాన కారణం ఉదరమే. ఆ జబ్బులను మటుమాయం చేసేందుకు తరచూ బొప్పాయి పండును ఆహారంగా సేవించాలంటున్నారు వైద్యులు. ఉదరంలోని పేగులు శుభ్రమైతే శరీరం పూర్తిగా శుభ్రంగానున్నట్లే లెక్క. దీంతో శరీరం ఉల్లాసంగా తయారై తనపని తాను చేసుకుంటూ పోతుంటుంది.

ఔషధ గుణాలు :-

1 .కాల్షియం, ఇనుము, భాస్వరం వంటి ఖనిజ లవణాలు బొప్పాయిలో సమృద్ధిగా లభిస్తాయి.
2 .కంటికి సంబంధించిన రోగాలు రాకుండా ఈ పండులోని బిటాకెరోటిన్‌ (2020 ఐ.యూ.) తోడ్పడుతుంది.
3 .బొప్పాయిలో సమృద్ధిగా లభించే విటమిన్ సి (40 మి.గ్రా.) దంతాల, చిగుళ్ళ ఆరోగ్యానికి, రక్తవృద్ధికి, రోగనిరోధక శక్తికి తోడ్పడుతుంది.
4 .విటమిన్‌ బి (రైబోఫ్లెవిన్‌ 250 మైక్రోగాములు) నోటి పూత, తెల్లమచ్చలు, పెదాల పగుళ్లు రాకుండా కాపాడుతుంది.
5 .బొప్పాయి ‘కాయ’ జీర్ణానికి తోడ్పడితే, ‘పండు’ పోషకాలనిస్తుంది.
6 .బొప్పాయి పండును చిన్న పిల్లలకు గుజ్జుగా చేసి నాలుగో నెలనుంచి తినిపించవచ్చు. యుక్తవయస్సులో ఉన్నవారు దోరగా పండిన పండును తినవచ్చు.