ఈ రెండు పదార్థాలు ఒక్కసారి రాస్తే చాలు.. తలలో పేలన్నీ నిమిషంలో మాయం.

తలలో ఉండే పేలు స్కూలుకెళ్లే పిల్లలకు ఎక్కువగా ఉంటాయి. అక్కడ ఒకరి నుండి ఒకరికి వ్యాపించి చాలా ఇబ్బంది పెడుతూ ఉంటాయి. వారి ద్వారా కుటుంబ సభ్యులకు కూడా ఇవి వ్యాపించి చాలా చిరాకుగా ఉంటుంది. పేలను తగ్గించుకోవడానికి చాలా రకాల షాంపూలు అందుబాటులో ఉంటాయి. కానీ వాటి వలన ఎటువంటి ప్రయోజనం ఉండదు. పేలు తలలో చేరితే దురద, అవి కొరకడం వలన తలలో చిన్న పుండ్లు వంటివి వస్తూ ఉంటాయి. వీటిని అలాగే నిర్లక్ష్యం చేస్తే స్కాల్ఫ్ ఆరోగ్యం దెబ్బతిని పిల్లల్లో శ్రద్ధ, ఏకాగ్రత దెబ్బతింటుంది. అందుకే వీటిని సహజ చిట్కాల ద్వారా తగ్గించుకోవచ్చు.దీని కోసం మనం ఒక ఐదారు కర్పూరం బిళ్ళలు తీసుకోవాలి.

కర్పూరం మనకి మంచిగా ఘాటైన సువాసనతో ఉంటాయి. ఇవి మానసిక ప్రశాంతతను అందిస్తాయి. కానీ పేలకి ఘాటైన వాసన చాలా ఇబ్బందిగా ఊపిరి ఆడకుండా చేస్తుంది. ఆరు కర్పూరం పిల్లలను మెత్తగా పొడిలా చేసి పెట్టుకోవాలి. తర్వాత పదార్థం నిమ్మకాయ. ఒక అర చెక్క నిమ్మరసం తీసుకొని ఈ రసాన్ని కర్పూరం పొడిలో వేసుకోవాలి. నిమ్మరసం పేలు, పేల గుడ్లను నివారించడంలో సహాయపడుతుంది. జుట్టులో దురద, పుండ్లు వంటి సమస్యలను తగ్గిస్తుంది. “తర్వాత ఒక స్పూన్ కొబ్బరి నూనె వేసుకోవాలి. వీటన్నింటినీ బాగా కలిపి జుట్టుకు అప్లై చేసి నెమ్మదిగా మసాజ్ చేయాలి. ఈ నూనెలో ఉండే ఘాటైన వాసనకి పేలన్నీ మత్తుగా చచ్చిపోయి ఉంటాయి. అప్లై చేసుకున్న అరగంట తర్వాత మైల్డ్ షాంపూతో లేదా హెర్బల్ షాంపూతో తలస్నానం చేయాలి.

తర్వాత ఒక చిన్న పళ్ళతో దగ్గరగా ఉన్న దువ్వెనతో దువ్వడం వలన చచ్చిపోయి ఉన్న పేలు, గుడ్లు అన్ని బయటకు వచ్చేస్తాయి. ఇలా పేర్లు సమస్య ఎక్కువగా ఉన్నప్పుడు వారానికొకసారి చేయడం వలన కొద్ది రోజుల్లోనే ఈ సమస్య నుండి శాశ్వతంగా నివారణ లభిస్తుంది. ఈ మిశ్రమాన్ని అప్లై చేసుకున్న 40 నిమిషాల కంటే ఎక్కువసేపు ఉంచకూడదు. దానివలన సైడ్ ఎఫెక్ట్స్ వచ్చే అవకాశం ఉంది ఉంది.