ముక్కు దిబ్బడ, ముక్కు కారటం, తుమ్ములు, కళ్ళు నీరు కారడం.. ఒకటే ట్రిక్, దెబ్బకు సెట్.

చలికాలంలో ఉదయం నిద్ర లేచే సమయానికి ముక్కు పట్టేయడం, శరీరమంతా నొప్పులు, బిగుసుకు పోయినట్టు ఉండడం సహజం ఈ కాలంలో శ్లేష్మం కూడా చిక్కబడి శ్వాస తీసుకోవడం ఇబ్బందిగా ఉంటుంది. దీనిని తగ్గించుకోవడానికి మనం ఉదయాన్నే టీలు, కాఫీలు ఎక్కువగా తాగడం చేస్తుంటాము. కానీ ఇది ఇతర అనారోగ్య సమస్యలకు కారణమవుతుంది. దానికి బదులు ఇప్పుడు చెప్పబోయే చిట్కాలు పాటించడం వలన సహజంగా ముక్కు దిబ్బడ, శ్వాస సంబంధ సమస్యలు తగ్గించుకోవచ్చు.దాని కోసం ఉదయం లేచిన వెంటనే ఆవిరి పట్టడం మంచి పద్ధతి.

ఆవిరి పట్టడం వలన శ్లేష్మం పలచబడి ముక్కు దిబ్బడ తగ్గుతుంది. ఈ ఆవిరి పట్టడానికి ఇప్పుడు స్టీమింగ్ మిషన్లు అందుబాటులో ఉంటున్నాయి. వీటిలో కొద్దిగా యూకలిప్టస్ ఆయిల్ లేదా పిప్పర మెంట్ ఆయిల్ కొద్దిగా వేసి కొద్దిగా పసుపు కూడా వేసి ఆవిరి పట్టడం వలన ముక్కుదిబ్బడతో పాటు ఊపిరితిత్తులు కూడా శుభ్రపడతాయి.తర్వాత వ్యాయామం చేయాలి. కనీసం ఒక పదిహేను సూర్యనమస్కారాలను ఒక అరగంట పాటు చేయడం వలన శరీరంలో రక్తప్రసరణ వేగవంతమై శరీరం వేడెక్కుతుంది. శరీరంలో ఉండే చిన్నపాటి నొప్పులు ముక్కు దిబ్బడ వంటి సమస్యలు సహజంగా తగ్గుతాయి. వ్యాయామం చేసేటప్పుడు కేవలం ముక్కుతో మాత్రమే గాలిని పీల్చుకోవాలి. గాలి ఎక్కువగా ఫోర్స్ గా వెళ్లడం వలన ముక్కు దిబ్బడ తగ్గిపోతుంది. గాలి నాళాలు శుభ్రపడతాయి.

తరువాత కొంతసేపు ప్రాణాయామం చేయాలి. ప్రాణాయామం చేయడం వలన గాలిని ఎక్కువగా తీసుకుంటాం.ఇది ముక్కు, శ్వాసనాళాల్లో చేరిన శ్లేష్మాన్ని వెనక్కి మళ్లిస్తుంది. ముక్కు నాళాలను శుభ్రపరుస్తుంది ఇలా రోజూ ఉదయం ఒక గంట పాటు ఆవిరి పట్టడం, వ్యాయామం, ప్రాణాయామం చేయడం వలన తరువాత రోజంతా ఆరోగ్యంగా, ఫ్రీగా ఉండవచ్చు. లేదంటే రోజంతా ముక్కు పట్టేసినట్టు ఉండటం, ముక్కు కారడం ఇవి చికాకుని కలిగించి ఇతర పనులపై శ్రద్ధ లేకుండా చేస్తాయి. ఎటువంటి మందులు లేకుండా చలికాలంలో ఈ పనులు చేయటం వలన ముక్కు దిబ్బడ వంటి సమస్యలు ఈజీగా తగ్గించుకోవచ్చు.