ఈ 3 వ్యాధులు ఉన్నవారు వేరుశనగ తింటే ప్రాణాలకే ప్రమాదం…

వేరుశనగలను, పల్లీలు లేదా పీనట్స్ అని కూడా అంటారు, ఇవి అంటే చాలామందికి ఇష్టం, వీటిని తీసుకోవడం వలన మన శరీరానికి ఎక్కువగా లాభాలు ఉన్నాయి, కొంతమంది మాత్రం తినకూడదు. వీటిని తింటే కొంతమందికి హాని కలుగుతుందని మీకు తెలుసా?ఎలాంటి సమస్యలు ఉన్నవారు వేరుశనగలను తినకూడదోఇప్పుడు మనం తెలుసుకుందాం! కరకరలాడే అటువంటి వేరుశెనగలు చలికాలంలో ఎక్కువగా మార్కెట్లోకి దొరుకుతాయి, వేరు శనగలు తినడం వలన మన ఆరోగ్యానికి ఎంతో మంచిది.ఎందుకంటే వీటిలో ఎన్నో రకాల పోషకాలు లభిస్తాయి, వాటిలో ముఖ్యమైనవి పొటాషియం, అలాగే జింక్,ఐరన్, విటమిన్-ఇ సమృద్ధిగా ఉంటాయి. ముఖ్యంగా ఈ చలి కాలంలో మన శరీరాన్ని లోపలనుండి వెచ్చగా ఉండేలా చేస్తాయి, ముఖ్యంగా వాన కాలంలో, చలికాలంలో వేరుశనగ లను తప్పకుండా తినాలి అని కూడా పెద్దలు అంటూ ఉంటారు.

ఫలితంగా మన శరీరంలో ఎన్నో రకాల ప్రయోజనాలు కలుగుతాయి, అయితే వేరుశెనగలు తినేటప్పుడు కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి, ముఖ్యంగా వీటిని ఎలా తినాలి ఎవరెవరు తినవచ్చు అనేది తెలుసుకోవాలి. అటువంటి ముఖ్యమైన వివరాలు గురించి ఈరోజు తెలుసుకుందాం! పల్లీలతో పాటుగా ముఖ్యంగా మొలకలు, బఠానీలు, సెనగలు ఇటువంటివి చలికాలంలో వానకాలంలో ఎక్కువగా తింటూ ఉండాలి.ముఖ్యంగా ఈ సీజన్లో లభించే మొక్కజొన్న కూడా తినవచ్చు, స్వీట్ కార్న్ బదులుగా దేశవాళీ మొక్కజొన్న లో తినడం వలన ఆరోగ్యానికి మరింత మంచిది, ఇక వేరుశనగలు మన అందరికీ ఇష్టమే. ఎందుకంటే బ్రేక్ఫాస్ట్లో, ఈవినింగ్ స్నాక్స్ లో పల్లిలు ఉండడం సహజమే, అయితే ఇవి ఎంతో రుచికరంగా ఉంటాయి, ఆరోగ్యానికి కూడా చాలా మంచిది కాబట్టి, దీనిలో మంచి కొలెస్ట్రాల్ మనకు మేలు చేస్తుంది, మన గుండెకు ఎంతో ఆరోగ్యాన్ని చేకూరుస్తుంది.

అయితే మనం కాలానికి అనుగుణంగా మన ఆహారపు అలవాట్లను మార్చుకోవాలి, అయితే ఎండాకాలంలో ఎక్కువగా చల్లగా ఉండేవి, పండ్లు ,జ్యూస్ లాంటివి తీసుకోవాలి. ఇక వర్షాకాలం లో రకరకాల వ్యాధులు రాకుండా ఉండడానికి, ఇమ్యూనిటీని పెంచుకోవడానికి కొద్దిగా డ్రైఫ్రూట్స్ తీసుకోవాలి, అయితే డ్రైఫ్రూట్స్ అనగానే కొంతమంది ఖర్చు గురించి ఆలోచిస్తారు.ఎందుకంటే అంత ఖర్చు పెట్టి అందరూ డ్రై ఫ్రూట్స్ తినలేరూ కదా, అలాంటి వారికి డ్రైఫ్రూట్స్ అంటే ,పేద వారి బాదం లాంటిది ఈ పల్లీలు అని చెప్పవచ్చు, ఎందుకంటే పల్లీలు తక్కువ ధరకే లభిస్తాయి, మనకు వాటిలో ఉండే ఎటువంటి పోషకాలు కూడా కలిగి ఉంటాయి.కాబట్టి వానాకాలం ,చలికాలంలో ఈ పల్లీలను ఎక్కువగా తీసుకుంటూ ఉండాలి, అయితే వేరు శనగలు ఉడకబెట్టి తింటే చాలా మంచిది, దీంతో వీటిలో ఉండే పోషకాలు మన శరీరంలోకి చేరతాయి, ఇక మీరు వేపుకుని కూడా తినవచ్చు, ఇలాగే పోయినప్పుడు వీటిలో ఉండేటటువంటి క్యాలరీలు కూడా పెరుగుతాయి, అందువలన పల్లీలు తింటే బరువు పెరిగే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని చెప్పవచ్చు.

అయితే వేరుశనగ లలో ఎక్కువగా ఉండే విటమిన్ ఏ, విటమిన్ సి, ఫైబర్, జింక్ మన శరీరానికి, చర్మ సౌందర్యానికి కావలసినటువంటి హార్మోన్లను ఉత్పత్తి చేయడానికి ఉపయోగపడుతున్నాయి, అలాగే రక్తప్రసరణ మెరుగుపరిచి మంచి ఆరోగ్యంతో పాటు, చర్మ సౌందర్యాన్ని కూడా పెంచడానికి సహాయపడతాయి.అయితే ఫ్రెండ్స్ మీరు ఎంత మోతాదులో వేరుశనగను తినాలి అన్నట్లయితే గనుక, రోజూ ఒక గుప్పెడు పల్లీలు తినండి, అంతకంటే ఎక్కువ మాత్రం అస్సలు తీసుకోవద్దు, ఎందుకంటే వాళ్ళు ఎక్కువగా తీసుకుంటే బరువు పెరిగే ఈ ప్రమాదం ఎక్కువగా ఉంటుంది.అలాగే కొంతమంది చలి నుండి ఉపశమనం కోసం ఈ పల్లీలను చిక్కి లాగా చేసుకొని తింటుంటారు, బెల్లంతో తయారుచేసిన చిక్కి తినవచ్చు, బెల్లం కూడా మన శరీరంలో ఉన్న వేడిని పెంచుతుంది, అలాగే పల్లీలు కొవ్వూను మన శరీరంలో చలి తగలకుండా చర్మాన్ని కాపాడుతాయి.

అయితే వీటిని మరీ ఎక్కువగా తినకూడదు, ఎక్కువగా తిన్నట్లయితే బాడీలో వేడి పెరిగి మనకి అనారోగ్యానికి దారితీసే ప్రమాదం ఉంది, అలాగే వేరుశనగలను కొన్ని సమస్యలు ఉన్నవారు అసలు తీసుకోకూడదు, లేదా పరిమితంగా కొద్దిగా తీసుకోవచ్చు, అటువంటి సమస్యలు ఉన్న వారు ఎవరు ఇప్పుడు తెలుసుకుందాం!మీరు వేరుశెనగలు ఎక్కువగా తిన్నట్లయితే , ఇది మీ స్కిన్ ఎలర్జీ కి కారణం కావచ్చు, దీని కారణంగా మీ చేతులు ,కాళ్ల మీద, మీకు నోటిపై వాపు, చర్మంపై దద్దుర్లు కూడా వచ్చే అవకాశాలు ఉన్నాయి, అలాగే వేరుశెనగలను ఎక్కువగా తీసుకుంటూ ఉండడం వలన, జీవక్రియ సరిగ్గా నడవదు. మీరు మితంగా వేరుశనగను తీసుకోవచ్చు కానీ ఎక్కువగా తీసుకున్నట్లయితే, మీకు ఎసిడిటీ సమస్యలు కలిగే అవకాశం కూడా ఉంది, దీంతో మలబద్దకం, గ్యాస్ ఇలాంటి ఎన్నో రకాల సమస్యలు జీర్ణసంబంధ సమస్యలకు దారితీసే అవకాశాలు ఉన్నాయి.

కాబట్టి ఎసిడిటీ సమస్య ఉన్నవారు, వేరుశనగ ఎక్కువగా తీసుకోకూడదు, ఇక కీళ్ళ నొప్పులు కూడా ఉన్నవారు వేరుశనగలు తీసుకోవడం మంచిది కాదు, ఎందుకంటే కీళ్ల నొప్పులు లేదా కీళ్ళ వాపులు ఉన్నవారు వేరుశనగలను తినకుండా ఉంటే మంచిది, తీసుకోవడం వల్ల మన శరీరంలో నొప్పి, మంటని కలిగిస్తాయి.కాలేయ సమస్యలు ఉన్నవారు కూడా వీరు ఎక్కువగా తీసుకోకూడదు, ఎందుకంటే వేరుశెనగలు ఎక్కువగా తీసుకుంటూ ఉంటే శరీరంలో ఆర్ పి ఆర్పిన్ ఆక్సిన్ పరిణామం పెరుగుతుంది, ఇది కాలేయానికి గణనీయమైన అనారోగ్యాన్ని కలుగజేస్తుంది, అలాగే మన కాలేయం ఆరోగ్యానికి కూడా హాని కరమైన పదార్థం ఇది, కాబట్టి మీరు వేరుశనగ లను మితంగా మాత్రమే తీసుకోవాలి.