తెల్లగా మెరిసిపోతారు…

ముఖంలో కళ పెరగాలన్నా, ముఖం అందంగా ఉండాలి అన్నా, ముఖం నిగనిగలాడాలన్న, కాంతివంతంగా ఉండాలన్నా, మెరిసి పోవాలన్నా, ఏ రకమైన ఆహార పదార్ధాలు ఉపయోగపడతాయి?ఇంకా భారతదేశంలో నలుపు రంగు ఉంటే ఎవరూ ఇష్టపడరు, చర్మము పేర్ కలర్ లో కావాలి, మెరిసి పోవాలి తెల్లగా ఉండాలి, రంగు అంటారు.ఈ నలుపు ,తెలుపు అనేది ఏమిటంటే, ఒకటి వంశపారంపర్యంగా వస్తుంది, తల్లి తండ్రి నల్లగా ఉంటే పిల్లలు కూడా నల్లగా ఉంటారు, వాళ్ళు ఒకవేళ తెల్లగా ఉంటే పిల్లలు కూడా తెల్లగా ఉంటారు.ఈతెలుపు కి నలుపు కి కారణాలు ఏమిటంటే చర్మంలో ఉండే మెలనోసైట్స్ అనే గ్రంథులు, ఈ గ్రంధుల నుండి మెలనిన్ అనే నల్లటి పదార్థం ఉత్పన్నమవుతుంది. ఈ మెలనిన్ ఎవరికైతే తక్కువగా ఉత్పత్తి అవుతుందో వారు ఫెర్ గా ఉంటారు, ఎవరికైతే ఎక్కువగా ఉత్పత్తి అవుతుందో వారు నల్లగా ఉంటారు.

అయితే నల్ల గా ఉన్న వారిలో ఉండే మంచి గుణం ఏమిటంటే, నల్లగా ఉంటే సూర్యరశ్మిలో ఉండే అల్ట్రావైలెట్ కిరణాల ప్రభావం మెలనిన్ కాపాడుతుంది, ఎవరికైతే మెలనిన్ తక్కువగా ఉందో సూర్యరశ్మి నుండి వచ్చే అల్ట్రా వైలెట్ కిరణాలు చర్మం మీద పడి ,అనేక అనర్ధాలు రావడం జరుగుతుంది.ఎవరైనా కోరుకునేది మన భారతదేశంలో, మనకుండే మానసికమైన పరిస్థితి పెళ్లి ముందు కుర్రవాడు వధూవరులు ఇద్దరూ కూడా అందంగా ఉండాలని, తెల్లగా ఉండాలని కోరుకుంటారు. కొన్ని సందర్భాలలో నల్లగా ఉందంటే పెళ్లిచూపులకె రారు, ముందే అడుగుతారు నల్లగా ఉందా, తెల్లగా ఉందా అని, నల్లగా ఉందంటే వదిలేయండి అంటారు.మరి ఆఫ్రికా దేశంలో ఉండేవారిని బ్లాక్ బ్యూటీస్ అంటారు, ఇక్కడ కూడా మన దేశంలో ఉండే వారు కొంతమంది చాలా నల్లగా ఉంటారు, కానీ నీ ముఖం మాత్రం కళకళలాడుతుంది, కొంతమంది తెల్లగా ఉన్నా ముఖం మాత్రం, ఏ మాత్రం ముఖంలో కళ ఉండదు.

ఈ ఆహార పదార్థాలు మన ముఖాన్ని కళకళలాడేలా చేసి, మరియు తెల్లగా చేసే ఆహార పదార్థాలలో మొదటిది కమల బత్తాయి, దీనిలో విటమిన్ సి ఉంటుంది, ఈ విటమిన్ సి ప్రభావంవల్ల ఈ పండ్లను తినాలి. ఈ పండ్ల రసం కంటే కూడా, తింటేనే చాలా మంచిది, ఇలా తింటే దానిలోని పీచు పదార్థం యొక్క మంచి గుణాలు అన్నిటిని కూడా మనం ఆస్వాదించవచ్చు.ఇక రెండవది కివి పండు, ఈ కివీ పండు అంటే, గ్రామీణ ప్రాంతాల్లో ఉండే వారికి తెలియదు, పట్టణాలు, నగరాల్లో ,మహానగరాల్లో, సూపర్ మార్కెట్లో దొరుకుతాయి, ఇది చూడడానికి సపోటా పండు అంత ఉంటుంది. సపోటా రంగే ఉంటుంది, దాన్ని లోపల కట్ చేస్తే ఆకుపచ్చగా ఉంటుంది, చిన్న చిన్న గింజలు ఉంటాయి, ఆ గింజలతో సహా తినేయవచ్చు, గింజలు చాలా వేలల్లో ఉంటాయి, గింజలను వేరు చేయడం అవసరం లేదు. ఇది పుల్లపుల్లగా తియ్యతియ్యగా ఉంటుంది, దీంట్లో కూడా విటమిన్ సి ఉంటుంది, దీన్ని తినడం వల్ల కూడా మొఖం అందంగా తయారవుతుంది.

ఇక మూడవది నిమ్మరసం, గోరువెచ్చని నీళ్ళలోనిమ్మరసంలో తేనె కలుపుకొని తాగితే ముఖం కళకళలాడుతుంది, దీంట్లో కూడా విటమిన్ సి ఉంది, ఈ తేనే నిమ్మరసం మిశ్రమం, ముఖాన్ని అందంగా తయారు చేయడమే కాకుండా కలను పెంచడమే కాకుండా, బరువు కూడా తగ్గుతారు. దానివల్ల రెండు రకాల ప్రయోజనాలు ఉన్నాయి, నిమ్మరసంతో కొంతమందికి అపోహలు ఉన్నాయి, గ్యాస్ ట్రబుల్ వస్తుందని, ఎసిడిటీ వస్తుందని ఇలాంటివి ఏమి రావు, నిమ్మరసాన్ని గోరువెచ్చని నీళ్లలో తేనెతో కలిపి తాగితే గ్యాస్ ట్రబుల్ రాదు, ఎసిడిటికి కూడా రాదు.ఇంకా కొంతమంది అపోహ ఏమిటంటే, దీనివల్ల శ్వాస సమస్యలు వస్తాయని, గొంతు నొప్పి, గొంతు గరగర, సైనస్, ముక్కు కారడం, తుమ్ములు వస్తాయి అంటారు, ఇవేవీ జరగవు. ఇంకా దీనిలో విటమిన్ సి అధికంగా ఉంటుంది, విటమిన్ సి శ్వాసకోస సమస్యలు రాకుండా నివారిస్తుంది.

నాలుగవది డార్క్ చాక్లెట్స్, ఈ చాక్లెట్ లను పిల్లలు ఎక్కువగా ఇష్టపడతారు, ఇది అన్ని చోట్ల గ్రామీణ పట్టణ ప్రాంతాల లోనూ లభిస్తాయి, ఈ డార్క్ చాక్లెట్ తింటే దానిలోపల ఫ్లేవనాయిడ్స్ అనే పదార్థం , ముఖంలో మీద ఉన్న చర్మం యొక్క మెరుపు నీ ,అందాన్ని పెంచే గుణం ఉంటుంది.ఇక అయిదవది క్యారెట్, రోజు ఒక క్యారెట్ తినాలి, లేదంటే ఉదయాన, మధ్యాహ్నం, రాత్రి సాలిడ్ రూపంలో క్యారెట్, కీరా దోస, టమోటా, ఉల్లిపాయ దానిమీద మిరియాల పొడి చల్లుకుని, రసం పిండుకుని తింటే సాలిడ్ మూడుపూటలా ఆరోగ్యం.రోజుకో క్యారెట్ తింటే, క్యారెట్ ఎలా అందంగా ఉంటుందో ముఖం కూడా అంత అందంగా తయారవుతుంది, ఈ క్యారెట్ లో విటమిన్ ఏ ఉంటుంది, దాంతోపాటు పీచుపదార్థం , యాంటీ ఆక్సిడెంట్స్ ఉంటాయి, వీటి ప్రభావం వలన ముఖం కళకళలాడుతుంది.ఆరవది స్ట్రాబెర్రీ, ఇది కూడా గ్రామీణ ప్రాంతాల్లో చిన్న చిన్న పట్టణాలలో దొరకదు, ఇది కూడా పెద్ద పట్టణాల్లో, నగరాలలో, ఫ్రూట్ మార్కెట్లో ఉంటుంది, ఈ స్ట్రాబెరీ చూడడానికి చాలా ఆకర్షణీయంగా ఉంటుంది, ఈ దీన్ని చూడగానే తినాలనిపిస్తుంది. మంచి రంగు ఉండేఈ పదార్ధాలు తింటే ముఖానికి మంచి రంగు వస్తుంది.