రోజుకీ ఒక స్పూన్ 21 రోజులు తీసుకుంటే చాలు ఒక్క వెంట్రుక ఊడిన చోటా 10 వెంట్రుకలు వస్తాయి…

జుట్టు బాగా పెరగడానికి , దృఢంగా,మెత్తగా అవడానికి ఏం చేయాలో ఈ రోజు ఒక చిట్కా ద్వారా తెలుసుకుందాం!దీనికి మనకు కావలసినవి చియా సీడ్స్, ఆయుర్వేద షాప్ లో, సూపర్ మార్కెట్ లలోనూ లభిస్తాయి, రెండవది సన్ ఫ్లవర్ సీడ్స్, వీటినే పామాయిల్ గింజలు, పొద్దుతిరుగుడు గింజలు అని కూడా అంటారు,తర్వాత మూడవది అవిస గింజలు, నాలుగవ గింజలు ఏంటంటే గుమ్మడి గింజలు, మీ ఆరోగ్యానికి చాలా మేలు చేస్తాయి, ఇవి కూడా ఆయుర్వేద షాప్ లలో దొరుకుతాయి. తర్వాతది నల్ల నువ్వులు, తెల్ల నువ్వుల కంటే నల్ల నువ్వులు జుట్టుకి బాగా పనిచేస్తాయి,ఈ ఐదింటిలో కూడా జుట్టు ఆరోగ్యానికి సంబంధించిన పవర్స్ ఉంటాయి, దీంట్లో ఒక్క దాన్ని కూడా మిస్ చేయకుండా అన్ని ఐటమ్స్ తెచ్చుకోవాలి. మొదటగా ఒక గిన్నెను తీసుకోవాలి.

దాంట్లో రెండు స్పూన్ల గుమ్మడి గింజలను వేయాలి, తర్వాత నల్ల నువ్వులనురెండు స్పూన్లు వేయాలి, ఆ తర్వాత అవిసెగింజలు రెండు స్పూన్లు వేసుకోవాలి.ఇలా మిగిలిన వాటిని కూడా రెండు స్పూన్లు వేసుకుని, మొత్తం బాగా కలపాలి. ఇలా మొత్తం కలిపి , తర్వాత ఒక కడాయి తీసుకుని ఈ గింజల్ని దాంట్లో వేసేయండి, ఆ తరువాత స్టవ్ వెలిగించి ,స్టవ్ మీద పెట్టుకోండి , వీటిని రెండు నిమిషాల పాటు దగ్గర ఉండి దోరగా వేయించండి.వీటిని కొంచెం వేడెక్కే వరకే వేయించండి, సిమ్ లో పెట్టి వేయించుకోండి, ఇలా చేస్తున్నప్పుడు మంచి సువాసన వస్తుంది, ఇలా మంచి సువాసన వచ్చేటప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకోండి. ఇప్పుడే కొద్దిగా చల్లారిన తర్వాత, మూత ఉన్నగాజు పాత్ర తీసుకోండి, ఇలా వేయించిన గింజలని ఆ పాత్రలో వేసుకోండి, తరువాత ఆ పాత్రకి లేదా సీసా కి మూత పెట్టండి. వీటిని మీకు కావాల్సినప్పుడు తీసుకోండి.

ఇప్పుడు దీన్ని ఎలా వాడాలో చూద్దాం,మీరు తలకి ఏ నూనె పెట్టుకున్నా సరే, ఆ నూనె రాసుకుని తర్వాత ఈ గింజలు తింటే ఎంత ఫలితం వస్తుందో మీకు అనుభవం వస్తుంది, ఇలా వాడటం వలన మీకు కచ్చితంగా మంచి ఫలితం అనేది లభిస్తుంది.ఇప్పుడు వీటిని ఒక స్పూన్ తీసుకుని, రోజుకు ఒక స్పూను, ప్రతిరోజు ఉదయం ముఖం కడిగిన తర్వాత, పరగడుపున ఒక రోజు స్పూను తినాలి, ఇలా పరగడుపున తినడం కుదరకపోతే, మీకు కుదిరిన టైంలో అది మీ ఇష్టం ఎప్పుడైనా తీసుకోవచ్చు.కాకపోతే పరగడుపున తింటే చాలా ఎక్కువ ఫలితం అనేది వస్తుంది, ఇలా 21 రోజులు క్రమం తప్పకుండా రోజుకు ఒక స్పూన్ వీటిని తినాలి, ఇవి తింటే మీకు ఫలితం అనేది మీకే తెలుస్తుంది.