ఎన్ని చేసిన జుట్టు పెరగడంలేదు అనేవారు ఆఖరిగా ఇదొక్కటి ట్రై చేయండి 3సార్లు రాసేసరికి జుట్టు విపరీతంగా

జుట్టు పెరగడానికి, జుట్టులో చుండ్రు లాంటిది ఏదైనా ఉంటే పోవడానికి మనం ఈరోజు ఒక రెమిడిని చూద్దాం! దీని కోసం ఏం చేయాలి అంటే కలబందను తీసుకుని దానిపై ఉండే పై ఉండే ముండ్ల వంటి భాగాన్నితీసివేయాలి, తర్వాత తొక్క తో అలాగే చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఇప్పుడు దీనిని మిక్సీలో వేసి గ్రైండ్ చేసుకోవాలి. ఈ కలబంద ముక్కలతో పాటు కాఫీ పొడిని కూడా ఒక స్పూన్ యాడ్ చేసుకోవాలి, కాఫీ పొడి ఎందుకు వేస్తాము అంటే జుట్టు కాస్త సిల్కీగా అవ్వడానికి కాఫీ పొడిని యాడ్ చేస్తారు.

తర్వాత ఒక స్పూన్ టీ పొడిని కలపాలి, టీ పొడి వేయడం వల్ల మనకు ఎక్కడైతే జుట్టు తక్కువగా ఉందో అక్కడ తిరిగి కొత్త జుట్టు రావడం జరుగుతుంది. ఈ మూడింటిని ఇప్పుడు బాగా కలుపుకోవాలి. దీనిలో కొద్దిగా వాటర్ ని ఆడ్ చేసుకుని ఇప్పుడు దీన్ని మొత్తం మిక్సీ పట్టుకోవాలి.దీన్ని ఇప్పుడు కొంచెం లూస్ గా అయ్యేలా గా తయారు చేసుకోవాలి. ఇప్పుడు దీన్ని మనం తలకు ఎలా రాసుకోవాలి చూద్దాం! ఇప్పుడు ఒక కాటన్ తీసుకొని ఈ మిశ్రమాన్ని జుట్టు మొత్తానికి బాగా పట్టించాలి. ఫస్ట్ దీనిని హెయిర్ స్కాల్ప్ దగ్గర బాగా అప్లై చేయాలి.

ఈ స్కాల్ప్ దగ్గరే మనకు ఎక్కువగా జుట్టు ఉండడం జరుగుతుంది, కాబట్టి అక్కడ ఎక్కువగా అప్లై చేస్తే ఆ ప్రదేశంలో తిరిగి జుట్టు రావడం జరుగుతుంది.ఇలా దీనిని జుట్టు మొత్తం కుదుళ్ల వరకు కూడా బాగా పట్టించాలి, దీనిని వారంలో మూడుసార్లు పెట్టుకోవాలి. ఇలా రాసుకోవడం వల్ల జుట్టు చాలా సిల్కీగా పట్టుకుంటే జారిపోయేలా తయారవుతుంది. జుట్టు కూడా చాలా బాగా పెరుగుతుంది అలాగే చుండ్రు లాంటివి ఏమైనా ఉన్నా కూడా సులభంగా తగ్గించుకోవచ్చు. ఇలా పెట్టుకున్న తర్వాత ఒక అరగంట తర్వాత మీరు రెగ్యులర్గా వాడే షాంపూతో తలస్నానం చేసుకోవచ్చు.