కాంతార మూవీ ‘వరాహ రూపం’ పాటతో పాపులర్ అయిన ఈ అమ్మాయి ఎవరంటే..?

ఈ మధ్యకాలంలో సినిమాలలోని ఒరిజినల్ సాంగ్స్ కి కవర్ సాంగ్స్ చేయడం మామూలే. ఆ విధంగా కాంతార సినిమాలోని ‘వరాహ రూపం’ పాటని కొత్త మ్యూజిక్ ఇన్ స్ట్రుమెంట్ తో రీక్రియేట్ చేసి వార్తల్లో నిలిచింది. దీంతో ఆ పాట విన్న వారంతా ఆ సింగర్ ఎవరా? అని ఆరా తీయడం మొదలుపెట్టారు.  తెలుగు బుల్లితెరపై ఎన్నో సింగింగ్ కాంపిటీషన్స్ లో తన ప్రతిభ చాటిన సింగర్ శ్రీ లలిత గురించి సంగీత ప్రియులకు పరిచయం అక్కర్లేదు. ఎందుకంటే.. ఆల్రెడీ బోల్ బేబీ బోల్, సూపర్ సింగర్, పాడుతా తీయగా, స్వరాభిషేకం, స్వర నీరాజనం, సరిగమప లిటిల్ ఛాంప్స్ లాంటి ప్రోగ్రాంలతో సూపర్ క్రేజ్ సంపాదించుకుంది.

అయితే.. అప్పుడంటే లిటిల్ ఛాంప్ కదా అని అంతా అనుకున్నారు.. కానీ, ఇటీవల కాంతార సినిమాలోని పాపులర్ సాంగ్ ‘వరాహ రూపం’ పాటను కవర్ సాంగ్ చేసి ఒక్కసారిగా స్టార్ అయిపోయింది శ్రీలలిత. అదికూడా కజు అనే డిఫరెంట్ సంగీత వాయిద్యంతో పూర్తి పాటను రీక్రియేట్ చేసి ట్రెండ్ సెట్ చేసింది. కాంతార సినిమా గురించి, వరాహ రూపం సాంగ్ గురించి ప్రేక్షకులకు ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఆ పాటే సినిమాకు సగం బలం. అలాంటి పాటను కేవలం కజు అనే మౌత్ ఇన్ స్ట్రుమెంట్ తో అద్భుతంగా పెర్ఫర్మ్ చేయడం విశేషం.

కాంతారలో ఒరిజినల్ సాంగ్ ని మేల్ సింగర్ పాడారు. కానీ.. రీక్రియేషన్ లో శ్రీలలిత.. అందరికీ కజు ఇన్ స్ట్రుమెంట్ ని పరిచయం చేస్తూనే.. అద్భుతంగా పాడింది. ప్రస్తుతం శ్రీలలిత రీక్రియేట్ చేసిన వరాహ రూపం సాంగ్.. సోషల్ మీడియాలో విశేషాధారణ పొందుతోంది. అలాగే సింగర్ గా శ్రీలలితకు తెలుగుతో పాటు కన్నడ, తమిళ ఇండస్ట్రీ ప్రేక్షకుల నుండి పాజిటివ్ రెస్పాన్స్ రావడం గొప్ప విషయమనే చెప్పాలి. ఇక శ్రీలలిత తాజాగా సుమన్ టీవీ ఇంటర్వ్యూలో పాల్గొని.. వరాహ రూపం పాటను కజుతో [లైవ్ పెర్ఫర్మ్ చేసింది. ప్రస్తుతం వైరల్ అవుతున్న ఈ వీడియో చూసి మీ అభిప్రాయాలను కామెంట్స్ లో తెలియజేయండి.