నడుము నొప్పి, మెడ నొప్పి వేధిస్తున్నాయా? ఇలా తగ్గించుకోండి ..!

ఈరోజుల్లో మెడ నొప్పి,నడుము నొప్పి, లాంటివి సర్వ సాధారణం అయిపోయాయి. వయసుతో సంబంధం లేకుండా అందరూ ఈ సమస్యలతో ఇబ్బంది పడుతున్నారు. లైఫ్ స్టైల్ లో వచ్చిన మార్పులు,శారీరక శ్రమ లేకపోవడం,ఒకే చోట ఎక్కువసేపు కూర్చుని పని చేయడం,సరైన వ్యాయాయం లేకపోవడం లాంటి కారణాల వల్ల ఈ సమస్యలు వస్తుంటాయి. అయితే.., చాలా మందిలో ఇవేవీ పెద్ద సమస్యలేం కాదు. మనం రెగ్యులర్ గా వాకింగ్,వ్యాయామం లాంటివి చేయడం వల్ల ఈ సమస్యల్ని వదిలించుకోవచ్చు. కానీ, ఇవి లాంగ్ టెర్మ్ ఉంటే మాత్రం ఖచ్చితంగా డాక్టర్ ని కన్సల్ట్ చేయాల్సిందే.ఇక ఎలాంటి నొప్పులకు ఎలాంటి చికిత్స తీసుకోవాలో చూద్దాం. ముందుగా చాలా మందికి మెడ నొప్పి అనేది దీర్ఘ కాలిక సమస్యగా ఉంటోంది.

అయితే.. మెడ నొప్పి అనేది హార్ట్ ఎటాక్ లక్షణాల్లో ఒకటి. కాబట్టి,ఇది ఎక్కువకాలం పాటు ఇబ్బంది పెడుతుంటే అత్యవసరంగా మెడికల్ కేర్ తీసుకోవాలి. స్ట్రెచెస్ చేయడం, ఐస్ థెరపీ,హీట్ థెరపీ లాంటివి చేయడం ద్వారా మెడ నొప్పి తగ్గించుకోవచ్చు. అలాగే వీటిని తగ్గించుకోవడానికి చాలా రకాల చికిత్సా పధ్ధతులున్నాయి. మెడ నొప్పి తరువాత చెప్పుకోవాల్సింది నడుము నొప్పి గురించి. ఈ రోజుల్లో వృద్ధులే కాదు, యువకులకు కూడా నడుము నొప్పి సమస్యలు వచ్చి పడుతున్నాయి.

ఈ నొప్పిని తగ్గించుకోవడానికి కొన్ని చిట్కాలు అందుబాటులో ఉన్నాయి. ముందుగా ఒక గ్లాస్ పాలలో మూడు చెంచాల తేనె కలిపి తీసుకోవడం వల్ల నడుము నొప్పి నుంచి కాస్త ఉపశమనం ఉంటుంది. ఇక నొప్పి ఎక్కువగా ఉన్నచోట అల్లం పేస్ట్ ను కాసేపు ఉంచి తీసేస్తే కొంచెం ప్రయోజనం ఉంటుంది. ఇవే కాక.. చిన్న అల్లం ముక్కల్ని మంచినీళ్లలో వేసి వేడి చేయాలి. ఆ మిశ్రమంలో తేనె కలుపుకుని తాగితే ఉపశమనం లభిస్తుంది. ఇక ఒక గ్లాసు పాలలో కొంచెం గసగసాల పొడి ప్రతిరోజూ తీసుకుంటే నడుము నొప్పి నుంచి ఉపశమనం పొందవచ్చు. కొన్ని యోగాసనాల ద్వారా కూడా నడుము నొప్పిని తగ్గించుకోవచ్చు. ఈ ఆసనాల ద్వారా నరాలకు,వెన్నెముకకు రక్త ప్రసరరణ మెరుగుపడుతుంది . ఇక నిద్రపోయే సమయంలో నడుము భాగం మీద ఎక్కువ ఒత్తిడి పడుతుంది.

కాబట్టి నడుం నొప్పి ఉన్నవారు కాళ్ల కింద దిండు పెట్టుకుని నిద్రపోవడం మంచిది. కాళ్లు ఎత్తుగా పెట్టుకోవడం వల్ల నడుం మీద ఒత్తిడి తగ్గుతుంది. ముఖ్యంగా యోగాసనాలు నడుం నొప్పిని తగ్గించడంలో చాలా కీలక పాత్ర వహిస్తాయి. అయితే.. ఈ యోగాసనాలు చేసేటపుడు కొన్ని జాగ్రత్తలు పాటించాలి. లేదంటే కొన్ని రకాల శారీరక సమస్యలు తలెత్తే అవకాశం ఉంది. ఐతే, ఆ సమస్యలు,వాటికి పరిష్కారాలు తెలుసుకోవడం కోసం ఈ వీడియో చూడండి. ఇక కంప్యూటర్ వర్క్ చేసేవాళ్లు మధ్యలో అప్పుడప్పుడు లేచి అటూ ఇటూ తిరుగుతూ ఉండాలి. ఎందుకంటే ఎక్కువ సమయం సిస్టమ్ ముందు  కూర్చుని ఉండడం వల్ల నడుముపై ఒత్తిడి అధికం అయ్యి నొప్పి వచ్చే ప్రమాదం ఉంటుంది. చూశారు కదా.. ఇలాంటి జాగ్రత్తలు పాటిస్తూ.. తగిన మెడికల్ కేర్ తీసుకుంటే మెడ నొప్పి, నడుము నొప్పి వంటి సమస్యల నుండి సులభంగా బయటపడొచ్చు.