షుగర్ ని శాశ్వతంగా అరికట్టే గింజలు ఇవే…..

షుగర్ వ్యాధి అదుపుతప్పి కొంతమందికి ఎక్కువగా ఉంటుంది, రక్తంలో చక్కెర స్థాయిలు ఫాస్టింగ్ లో 120 లోపు ఉంటే మంచిది, కానీ అలాంటి వారికి ఫాస్టింగ్ లో 150 200 ఇలా కూడా చాలామందిలో కనిపిస్తూ ఉంటుంది. భోజన అనంతరం చూస్తే 300, 200, 400, కూడా చక్కెర స్థాయిలు కనిపిస్తూ ఉంటాయి, వీళ్ళు ఎన్నో నియమాలు షుగర్ తగ్గడానికి పాటించినప్పటికీ కొంతమంది నోటిని కంట్రోల్ చేసుకోలేరు. వాళ్లకి మానసిక ఒత్తిడి వల్లనో, శారీరక వ్యాయామం చేయని అందువలన ,ఆహార నియమాలు పాటించకపోవడం వలన షుగర్ అదుపు తప్పుతూ ఉంటుంది. ఇలా అదుపుతప్పి రక్తంలో చక్కెర స్థాయి లో ఎక్కువ నెలల పాటు ఉండే సరికి తద్వారా కాస్త హార్ట్ డామేజ్ అయ్యే అవకాశాలుంటాయి, కొలెస్ట్రాల్ లెవెల్స్ తిరిగి పోతూ ఉంటాయి.

అలాగే కిడ్నీలు ముఖ్యంగా డామేజ్ అవుతూ ఉంటాయి, ఇమ్యూనిటీ తగ్గిపోతుంది, ఇంత చక్కెర స్థాయిలు రక్తంలో ఉండే సరికి రక్షణ వ్యవస్థ బాగా వీక్ అయిపోతూ ఉంటుంది.కంటి చూపు మసకబారుతుంది, దెబ్బలు-గాయాలు మానకుండా అయిపోతాయి ,అనేక సైడ్ ఎఫెక్ట్స్ వస్తూ ఉంటాయి, యూరినరీ ఇన్ఫెక్షన్స్ వస్తాయి, తిమ్మిర్లు, మంటలు ,చురుకు పోటు ఉంటాయి, బలహీనంగా ఉంటారు,నీరసం పెరిగి బరువు తగ్గిపోతారు ,ఇవన్నీ కూడా రక్తంలో చక్కెర స్థాయిలు ఎక్కువ మోతాదులో ఉండటం వలన వచ్చే ఇబ్బందులు. మరి అన్నం మానేసి పుల్కాలు తినండి ,ఒక జొన్న రొట్టె ఒక రాగి రొట్టె తినండి, లేదా మల్టీ పిండితో ఒక పుల్కా షుగర్ కంట్రోల్ అవ్వడానికి చేస్తూ ఉంటారు.

వైట్ రైస్ వల్ల ఎక్కువ షుగర్ వస్తుంది కాబట్టి వైట్ రైస్ లో చక్కెర స్థాయిలు పెంచే గుణం ఎక్కువ, కాబట్టి మీరు పుల్కాలు తినండి రైస్ ను తగ్గించండి, మీ ఇంట్లో ఎవరికైనా ఎక్కువగా షుగర్ లెవెల్స్ ఉంటే అండు కొర్రలు తినండి, అండు కొర్రలలో డయాబెటిస్ను కంట్రోల్ చేయడానికి అద్భుతమైనవి కొన్ని పోషకాలు ఉన్నాయని సైంటిఫిక్ గా నిరూపించారు, ఈ అండుకొర్రలలో ఉండే శక్తి 380 క్యాలరీస్, బియ్యంలో సుమారుగా 350 క్యాలరీస్ ఉంటాయి, బలం ఎక్కువ కానీ అండు కొర్రలలో ఉండే కార్బోహైడ్రేట్స్ దీంతో పోలిస్తే తక్కువ, బియ్యంలో 100 గ్రాముల బియ్యాన్ని తీసుకుంటే 77 గ్రాముల కార్బోహైడ్రేట్స్ ఉంటాయి, అదే అండుకొర్రల లో 70 గ్రాముల కార్బోహైడ్రేట్స్ ఉంటాయి, సుమారుగా 7 గ్రాములు తగ్గుతాయి, ఇందులో ఇతర పోషకాలు తీసుకుంటే ప్రోటీన్ బియ్యంలో ఏమీ ఉండవు చాలా తక్కువ ప్రోటీన్స్ ఉంటాయి, అండు కొర్రలు 11.5 గ్రామ్స్ ప్రోటీన్స్ ఉంటాయి, బియ్యం లో వీటిని మిస్ అవుతాం.

ఫైబర్ వైట్ రైస్ లో ఒక గ్రామము ఉంటుంది, అదే కొర్రలలో 11.5 గ్రామ్స్ ఫైబర్ ఉంది కాబట్టి ఇవన్నీ పోషకాల లో ఎక్కువ ప్రోటీన్ ఎక్కువ ఫైబర్ ఇలాంటి వారిని బాగా కలిసి ఉండడం వల్ల అండు కొర్రలు మనం వండుకుని తిన్నప్పుడు ఇందులో ఉండే కాంప్లెక్స్ కార్బోహైడ్రేట్స్ కారణంగా దశలవారీగా డైజేషన్ అవుతాయి, దశలవారీగా చక్కెర విడుదలవుతూ ఉంటుంది, దశలవారీగా రక్తం లోపలికి చక్కెర చేరుతుంది. కాబట్టి చక్కెర స్థాయిలు భోజన అనంతరం 300- 400 ఉన్నవారికి అండు కొర్రలు తిన్నట్లయితే కంట్రోల్ అవుతుంది, మరి డయాబెటిస్కి ఇంత అద్భుతంగా అండు కొర్రలు పనికి వస్తున్నాయ్ అని నిరూపించిన వారు “యూనివర్సిటీ ఆఫ్ అగ్రికల్చరల్ సైన్సెస్ ధార్వాడ్ కర్ణాటక ఇండియా” వీళ్లు కోర్రల మీద పరిశోధన చేసి డయాబెటిస్ను అదుపులోకి తీసుకు వస్తుందని నిరూపించారు.