కీళ్లనొప్పులను తగ్గించే ఆయుర్వేద చికిత్స….

ఇటీవల కాలంలో చాలామంది మోకాళ్ళ నొప్పులు జాయింట్ పెయింట్స్ తో ఇబ్బంది పడుతున్నారు, కారణం ఏమిటంటే మనం తినే ఆహారంలో క్యాల్షియం మూలకాలు లేకుండా సరైన పోషకాలు లేకుండా ఈ సమస్యను మనం ఎదుర్కొంటున్నాం.మనo ఉదయం నుండి రాత్రి వరకు ఓన్లీ రైస్ పదార్థాలను మాత్రమే తీసుకుంటున్నాం, దీనివల్ల మనకు బాడీలో కార్బోహైడ్రేట్స్ పెరుగుతాయి కాని, క్యాల్షియం లెవెల్స్ పెరగవు, దీనివల్ల బాడీలో శక్తి అనేది పెరగదు.ఇలాంటి సమస్యలు చాలా మంది ఎదుర్కొంటున్నారు, 20 నుండి 30 సంవత్సరాల నుండి ఈ సమస్యమొదలవుతున్నాయి,మన దేహంలో మూడు రకాల దోషాలు ఉంటాయి, ఒకటి వాత, పిత్త ,కఫం, వాతానికి 80 రకాలరోగాలు వస్తాయి, కఫానికి 20 రకాల రోగాలు, పిత్తానికి 40 రకాల రోగాలు పుడుతూ ఉంటాయి.

ఇలాంటి సమస్యలు ఉండేటప్పుడు మనిషిని ఎక్కువగా పెయిన్స్ అనేది బాధిస్తూ ఉంటాయి, అలాంటి పెయింట్స్ తగ్గాలంటే ఈరోజు ఒక మూలిక గురించి తెలుసుకుందాం! అది ఏమిటి అంటే ఉత్తరేణి, దీనికి నీలం పూలు పూస్తాయి, దీన్ని మనం ఎలా తీసుకోవాలి ఏం చేయాలి అనేది ఇప్పుడు మనం తెలుసుకుందాం, ఉత్తరేణి మనం వేర్లు మాత్రమే తీసుకోవాలి, వేర్లను మాత్రమే తీసుకుని ,దానిపైన ఉన్నా వేరు పై పట్టని తీసుకుని దీనికి పచ్చి అల్లం ఒక 20 గ్రాములు వేసి ,బాగా పేస్టులాగా తీసుకోవాలి.

ఇలా పేస్టులాగా తీసుకుని ఆ పేస్టుని మనకు ఎక్కడ జాయింట్ పెయిన్స్ ఎక్కువగా ఉన్నాయా, మోకాలు కావచ్చు ,మోచేతులు కావచ్చు, నడుం దగ్గర కావచ్చు, ఎక్కడైనా సరే ఈ యొక్క పేస్ట్ అనేది పూర్తిగా తగ్గిస్తుంది. పేస్టు ని మనం రొట్టె లాగా చేసి ఎక్కడ నొప్పి ఉందో ఆ ప్రదేశం లో ఒక బట్ట కట్టేయాలి, కొద్దిగా గాలి ఆడే లాగా కట్టాలి, ఇలా కడితే, ఇలాగ ఒక 4 లేదా ఐదు కట్లు మారుస్తూ ఉన్నట్లయితే ఎముకలు లోపల ఉన్న నొప్పి కూడా తగ్గిస్తుంది.ఉత్తరేణి వేర్ల పైన ఉండే పొట్టును మాత్రమే తీసుకోవాలి, ఇలా 100 గ్రాములు తీసుకుని, వీటిని మంచిగా పేస్టులాగా చేసుకొని మీకు నొప్పి ఉన్న చోట అప్లై చేసి , ఒక కాటన్ క్లాత్ లో చుట్టి కట్టినట్లయితే, నొప్పి అంటే చాలా అద్భుతంగా తగ్గిపోతుంది.