నిద్రలో కూడా ఉహించి ఉండారు అంత సన్నగా చేసే ఔషధం…

ఇప్పుడు మనం శరీరంలో ఉన్నటువంటి పొట్టలో ఉన్నటువంటి పేరుకుపోయిన కొవ్వు పదార్థాలను ఎలా నిర్మూలించాలో అన్న విషయాన్ని తెలుసుకుందాం. ముఖ్యంగా మన దైనందిన జీవితంలో ఎక్కువగా విహారము అంటే బాడీకి ఎక్ససైజ్ అనేది చాలా ముఖ్యము, ప్రతి మనిషికి వ్యర్థ పదార్థాలు ప్రతిరోజు తయారవుతూ ఉంటాయి. ఆ వ్యర్ధ పదార్థాలను నిర్మూలించడానికి మార్నింగ్ వాకింగ్ అని, జిమ్ అని, యోగాని చేస్తూ ఉంటాం. 25 సంవత్సరాలు దాటిన వారు మాత్రమే ప్రతిరోజు 32 -50 మినిట్స్ తప్పనిసరిగా వాకింగ్ అనేది చేయాలి. ఇలా వాకింగ్ లాంటివి చేయకుండా కొంతమంది అలాగే కదలకుండా కూర్చోవడం మూలంగా కూడా పొట్ట అనేది లావు అవ్వడమే కాకుండా వారికి బ్లడ్ సర్క్యులేషన్ క్వాలిటీ తగ్గి రకరకాల సమస్యలకు ఒక మూలంగా తయారవుతూ ఉంటుంది. వీరు కదలకుండా అలాగే కూర్చుని పని చేయడం వల్ల రక్తప్రసరణ సరిగా ఉండకుండా అలాగే జంక్ ఫుడ్ లను ఎక్కువగా ఎక్కువగా తీసుకోవడం మూలంగా పొట్ట అనేది పెరుగుతూ ఉంటుంది.

ఇది చాలా సమస్యలకు కారణమవుతుంది, ఎప్పుడైనా సరే తప్పనిసరిగా మనం తిన్నటువంటి ఆహారము అరగాలి అన్నా దానికి కావలసినటువంటి ఎక్ససైజ్ అనేది కచ్చితంగా అవసరం. అది చేయకపోవడం మూలంగానే పొట్ట చుట్టూ విపరీతంగా కొవ్వు పదార్థాలు పేరుకుపోయి చాలా సమస్యలకు దారితీస్తుంది. మనకు మన పరిసరాల ప్రాంతాలలో మన వంటింట్లో దొరికే ఔషధాలతో గానే చిట్కా వైద్యాలతో కానీ మన పొట్ట పెరిగిన కూడా ఆయుర్వేద పరంగా ఏ రకంగా తగ్గించుకోవచ్చు అనే విషయాలను తెలుసుకుందాం. ముఖ్యంగా సోంప్ అనేది అందరి ఇళ్లల్లో సాధారణంగ ఉంటుంది, ఈ సోంపును 10 గ్రాముల వరకు తీసుకుని 50-100ml వాటర్ లో రాత్రిపూట నానబెట్టి మనం ఉదయం కనుక నీరు మరియు సోంపు తో సహా తీసుకున్నట్లయితే రెండు మూడు నెలలలోనే మార్పు అనేది వస్తుంది. పేరుకుపోయిన కొవ్వును కరిగించడానికి సోంపు అద్భుతంగా పనిచేస్తుందని ఆయుర్వేదంలో చెప్పబడింది, సోంపును నమిలి తిన్న కూడా కొంతవరకు ఉపయోగముంటుంది. కొంతమంది భోజనం తర్వాత సోంపు వేసుకుంటూ ఉంటారు, అది కూడా ఒక మంచి పద్ధతి.

దానికంటే కూడా ఎక్కువ ఫలితాన్ని ఇచ్చేది ఏమిటంటే ఒక సోంపు తీసుకుని రాత్రి నీళ్లలో నానబెట్టుకుని ఉదయం అలాగే త్రాగినట్లయితే ఎంతో శ్రేయస్కరంగా ఉంటుంది. అలాగే ఒక నిమ్మకాయ తీసుకొని దాని నుండి రసాన్ని తీసుకుని దీంట్లో 10 నుండి 15 గ్రాముల వరకు తేనె చల్లటి నీటిలో కలుపుకోవాలి ఇలా డైలీ చేసుకుని త్రాగుతూ ఉంటే పొట్ట తగ్గడానికి అవకాశం ఉంటుంది, ఇది ఇమ్యూనిటీ బూస్టర్ గానే కాకుండా ఇందులో ఉండేటటువంటి విటమిన్ సి ,మినరల్స్,తేనెలో ఉండేటటువంటి మినరల్స్, విటమిన్స్ తోటి మన బాడీకి ఇమ్యూనిటీ బూస్టర్ గానే కాకుండా పొట్టను తగ్గించడానికి వెయిట్ లాస్ కి చాలా బాగా ఉపయోగపడుతుంది. అలాగే మందార ఆకులు జుట్టును పెంచడానికి చాలా బాగా ఉపయోగపడతాయి, దీని పేస్ట్ ని ఎవరికైతే జుట్టు రాల సమస్య ఉందో వారికి పెట్టిన కూడా ఆటోమేటిగ్గా జుట్టు అనేది పెరగడం జరుగుతుంది. అదేవిధంగా జుట్టు పెరగడానికి కూడా అనేక రకాల తైలాలు మందారం తైలం లాంటివి మార్కెట్లో మనకు లభిస్తూ ఉన్నాయి, ఇవి వాడిన కూడా మనకు చాలా ఉపయోగాన్ని ఇస్తాయి. ముఖ్యంగా ఈ మందారాకులను 7 నుండి 8 వరకు తీసుకుని ఒక గ్లాసు నీళ్లలో బాగా మరిగించి రెగ్యులర్గా సేవించినట్లయితే వారికి జుట్టు రావడమే కాకుండా పొట్టలో పేరుకుపోయినటువంటి కొవ్వు పదార్థాలను బ్రహ్మాండంగా కరిగిస్తుంది.