పిప్పి పన్ను ఉన్న చోట ఒకే ఒక్క సారి ఇది పెట్టండి క్షణం లో నొప్పి మాయమైపోయి టప టప పురుగులు పడిపోతాయి

పిప్పి పళ్ళు :-

దంతాలు మనిషి అందాన్ని ఎక్కువచేసేవి . ఆహారం బాగా నమిలి తినడానికి ఆయుధం లాంటిది. అయితే ఏది పడితే అది తినడం వల్ల.పిప్పి పళ్ళు అనేవి పంటి నిర్మాణంలో అధికంగా ఖనిజాలు చేరడం వలన పిప్పి పళ్ళు ఏర్పడుతాయి . మీకు దంతక్షయం(పుచ్చు పళ్ళు ) . దెబ్బలు తగలడం వల్లనో పళ్లు దెబ్బతింటాయి . దీంతో ఒక్క పన్ను నొప్పి పుట్టినా ఎక్కువగా బాధ కలుగుతుంది. ఏమీ తినలేని పరిస్థితి ఏర్పడుతుంది. దంతాల ఇన్ఫెక్షన్లు, పుచ్చిపోవడం, కొత్త దంతాలు రావడం, దంతాల్లో పగుళ్లు, చిగుళ్ల వ్యాధి తదితర కారణాల వల్ల ఈ నొప్పి ఏర్పడుతుంది.

కానీ, ఇది ఒక్కసారి మొదలైందంటే.. అంత ఈజీగా తగ్గదు.ఈ సమస్య మన పళ్ళ పై బ్యాక్టీరియా ఏర్పడడం వల్లకూడా వస్తుంది . ఈ భ్యాక్టీరియా అనేది ప్లేక్ అనే ఒక పోరని తయారు చేస్తుంది ఇది మీ పంటి పై ఉన్న ఎనామిల్ నుంచి మినరల్స్ ను తీసేస్తుంది . మన దంతాలకు కావాల్సిన కాల్షియం ఎనామిల్ లోనే ఉంటుంది .ఈ నొప్పి తగ్గాలంటే తప్పకుండా డెంటిస్టును సంప్రదించాల్సిందే. ఒక వేళ మీ వద్ద అంత సమయం లేకున్నా.. తక్షణ ఉపశమనం కావాలన్నా. కొన్ని చిట్కాలు పాటిస్తే నొప్పులు తగ్గుతాయి. అవేంటో ఒకసారి చూద్దాం.

ఉత్తరేణి :-

ఉత్తరేణి చెట్టు ఆకులు తెచ్చుకొని ఆకులను కడిగి మెత్తగా దంచి ఆ ఉత్తరేణి ముద్దను పిప్పి పన్ను నొప్పిగా ఉన్న చోట ఆకు ముద్దను అక్కడ పెడితే పన్ను నొప్పి తగ్గుతుంది .
పంటి నొప్పి ఎక్కువగా ఉంటే ఉత్తరేణి గింజల పొడిని, ఉప్పు, పటిక పొడి, వంట కర్పూరం అన్నింటినీ కలిపి ముద్దగా నూరి ఆ పేస్టును పంటిపై పెట్టుకోవడం వల్ల పంటి నొప్పి తగ్గుతుంది. చిగుళ్ల నుండి రక్తం కారడం ఆగిపోతుంది.

Curing diseases with Achyranthes Aspera (Prickly Flower or Uttareni) -  Ayurveda

పిప్పి పళ్ళు కు గల కారణం :-

*తగినంత విటమిన్ డీ లేకపోవడం
*నోరు ఎండి పోయినట్లుండడం
*షుగర్ క్వాన్టిటి ఎక్కువగా ఉన్న ఐస్ క్రీమ్ ,కూల్ డ్రింక్స్ ఎక్కువగా
తాగడం కూడా ఓ కారణం .
*పళ్ళకు అంటుకు పోయే చాకోలెట్ లాంటి పూడ్స్ తినడం .