పీకిన ఊడనంత స్ట్రాంగ్ ….

ఈ రోజుల్లో అందరినీ ఎక్కువగా బాధ పెడుతున్న సమస్య జుట్టు సమస్య. కొంతమందికి జుట్టు ఊడిపోయిన కూడా తిరిగి రాకుండా ఉండడం అలాగే చాలామందికి జుట్టు విరిగిపోతూ ఉంటుంది కదా. అలా విరిగిపోవడానికి కారణం జుట్టు పల్చబడడానికి కారణం మీరు చేసే ఒక మిస్టేక్ ని మానేయాలి. అందుకని జుట్టు బాగా ఊడిపోతుంది అంటే ఫస్ట్ మీరు చెకప్ చేసుకోవాల్సింది, థైరాయిడ్ టెస్ట్ ఎందుకంటే ఈ మధ్యలో ఎక్కువ మందికి కూడా ఈ థైరాయిడ్ లోపం అనేది వస్తుంది. రెండవ విషయం ఏమిటంటే శాఖాహారులు అయితే విటమిన్ B12 టెస్ట్ చేయించుకోండి, ఈ లోపం ఉంటే జుట్టు ఎక్కువగా ఊడిపోతుంది ఇక అందరూ కామన్ గా విటమిన్ డి టెస్ట్ చేయించుకోండి, ఇక ఈ మూడు అనేది అతి ముఖ్యమైన అవసరం. వీటిలోపం కనుక ఉన్నట్లయితే జుట్టు ఊడిపోవడం జుట్టు తెల్లబడడం మొదలైన వాటికి కారణం విటమిన్ డి మొదలగు వాటికి సంబంధమైనవిగా ఉంటుంది.

అందుకని అందరూ కూడా 15 20 ఏళ్లు దాటిన వారందరూ కూడా ఇలాంటివి చెక్ చేసుకోవడం మంచిది. B12 లోపం కనుక ఉంటే డాక్టర్ సలహా మేరకు మెడిసిన్స్ అప్పుడప్పుడు తీసుకునే వాడవచ్చు, విటమిన్ డి కూడా మీకు లోపం ఉంటే ఎండ తగిలితే మంచిది ఎండ తగలడానికి అసలు చాన్స్ లేదు అన్నప్పుడు విటమిన్ డి టాబ్లెట్స్ నెలకి ఒకటి వేసుకుంటే సరిపోతుంది. అందుకని అన్ని కోణాలు ఈరోజు ఆలోచిస్తున్నాయి కదా నెత్తికి వేడి నీళ్లు పోస్తున్నారు ఇలా వేడివేడి నీళ్లు పోస్తే జుట్టు కుదుర్లు డ్రై అయిపోతాయి, ఇలా డ్రై అవ్వడం వల్ల జుట్టు ఊడిపోతే మళ్ళీ రాదు. అలాగే ఈ డ్రై నెస్ కి జుట్టు కూడా విరిగిపోతూ ఉంటుంది, అందుకని గోరువెచ్చని నీళ్లను తలపై పోసుకోవాలి. నెత్తికి మాత్రం 40 డిగ్రీలు టెంపరేచర్ కంటే మించిన వాటర్ ని అసలు వాడకూడదు, గోరువెచ్చని నీళ్లు తలకి మనిషిది అందరూ హాయిగా ఉంటుందని చలికాలంలో వర్షాకాలంలో షవర్ బాత్ చేస్తూ ఉంటారు, ఇది బాగా జుట్టు డ్యామేజ్ అవ్వడానికి విరిగిపోవడానికి జుట్టు చివర్లు పగిలిపోవడానికి కానీ జుట్టు విరిగి పోవడానికి కారణం ఇదే.

అన్నిటికంటే ఎక్కువగా మీరు రెక్టిఫై చేసుకోవాల్సింది మాంసం కృత్తులు ఉన్న ఆహారాన్ని సరిగ్గా తినకపోవడం, ప్రోటీన్ డెఫిషియన్సీ నూటికి 90 మందికి ఇండియాలో ఉంది. ఖర్చులో ఎక్కువ ప్రోటీన్ ను ఇచ్చే పుచ్చగింజల పప్పు అనేది బాగా గుర్తుపెట్టుకోండి వీటిని రోజు గుప్పెడు నానబెట్టుకుంటే 100 గ్రాముల పప్పులో 34 గ్రాముల ప్రోటీన్ ఉంటుంది, ఇది అంత మంచిది దీనిని బాగా వాడుకోండి ఇక వీటితో పాటుగా కాస్త డబ్బులు ఇబ్బంది లేకపోతే బాదంపప్పులు ఇలాంటివి తీసుకోవడం జుట్టుకి చాలా మంచిది వాటిని కూడా వాడుకోవచ్చు. అలాగే మొలకలను కూడా ఒక పూట ఆహారంలో చేర్చుకోవాలి. ఇక మధ్యాహ్నం పూట ఆహారంలో మీరు సోయాచిక్కుడు గింజలను నానబెట్టి ఉడకబెట్టి కూరలలో వేసుకుంటూ ఉంటే మంచిది, సోయాచిక్కుడు గింజలను 43% ప్రోటీన్ ఉంటుంది, అప్పుడప్పుడు మిల్ మేకర్ వాడండి, ఆకు కూరలో పెసరపప్పు కందిపప్పు వేసి మధ్యాహ్నం పూట వండుకుంటే రక్తహీనత పోతుంది స్త్రీలలో ఎక్కువగా ఈ సమస్య ఉంటుంది .

దాన్ని అధిగమించవచ్చు అలాగే పప్పు ద్వారా ప్రోటీన్ కూడా వచ్చేస్తుంది. మధ్యాహ్నం ఇలాంటి ఆహారం పెట్టుకోండి ఇది చాలా మంచిది, అలాగే దీనితోపాటుగా మీలో ఎవరికైనా కాస్త B 12లోపం కనుక ఉండి మీరు శాఖాహారులు అయితే పుట్టగొడుగులు ఎప్పుడైనా తింటూ ఉంటుంటే, పుట్టగొడుగులు అన్నిటికంటే ఎక్కువ ఉంటుంది. అందుకని వారానికి ఒకసారి రెండుసార్లు అవకాశం ఉన్నప్పుడల్లా పుట్టగొడుగులు తినే ప్రయత్నం కూడా చేస్తే చాలా మంచిది. వెంట్రుక ఊడిపోయినప్పటికీ కూడా ఆ వెంట్రుక కుదుళ్ల నుండి మళ్ళీ కొత్త జుట్టు వచ్చేస్తుంది ఇలా కొత్త జుట్టు పుట్టాలంటే దానికి రా మెటీరియల్ కావాలి వాతావరణం అనుకూలంగా ఉండాలి. అందుకని తిరిగి జుట్టు రావడానికి దానికి కావలసిన ముడి సరుకు అనేది మనం కరెక్ట్ గా ఇవ్వాలి. ఈ మూడు సరుకు అన్నది మనం ఇచ్చే పోషకాలలో ఉన్న ఆహారం అంటే ప్రోటీన్ ఫుడ్ బాగా ఇవ్వాలి విటమిన్స్ మినరల్స్ జుట్టు కుదుళ్ళకి అందివ్వాలి.