పొరపాటున కూడా ఇంటి ఆడపిల్లకి ఈ వస్తువులు ఇవ్వవద్దు ఏ వస్తువులు ఇస్తే అదృష్టం కలుగుతుందో తెలుసుకుందాం…

మన ఇంటి ఆడపిల్లకి పెళ్లి అయిన తర్వాత, మనకు శక్తి సామర్థ్యాలు ఎంతగా ఉంటే కొన్ని వస్తువులు కొని పెడుతూ ఉంటాం, అంటే అత్తగారింటికి పంపిస్తున్నప్పుడు ఇచ్చి పంపిస్తూ ఉంటాం, ఎందుకంటే మన ఆడపిల్లలు సుఖంగా సంతోషంగా ఉండాలని. మనం ఈరోజు ఉపాయంలో ఇంటి ఆడపిల్లలకి పెళ్లి అయిన తర్వాత, ఏ వస్తువులు అంటే కొత్తగా కాపురం పెట్టినప్పుడు ఏ వస్తువులు ఇవ్వాలి, ఏ వస్తువులు ఇవ్వకూడదు తెలుసుకుందాం. ఎందుకంటే మనం ఈరోజుల్లో పెద్దగా పట్టించుకోవడం లేదు, అన్ని రకాల వస్తువులు కొనివ్వడం జరుగుతుంది తర్వాత కొన్నిసార్లు ఇబ్బందులు కలుగుతూ ఉంటాయి, ఆ సమస్యల వల్ల చాలా చాలా కుటుంబాలలో కాపురాలు కూడా ఇబ్బందికరంగా ఉండడం జరుగుతుంది, అలాగే కొత్తగా కాపురం పెట్టినప్పుడు, కొన్ని వస్తువులు ఇవ్వడం వల్ల పుట్టింటి వారు, అత్తింటి వారు కూడా ఇబ్బంది పడవలసి వస్తుంది.

ఏ వస్తువులు ఇవ్వాలి ఏ వస్తువులు ఇవ్వకూడదు ఇప్పుడు తెలుసుకుందాం. మనం ఏ వస్తువులు ఇవ్వాలో తెలుసుకుందాం, మీ ఇంటి ఆడపిల్ల అత్తగారింటికి వెళ్తున్నప్పుడు అన్నపూర్ణ దేవి ఫోటో ఫ్రేమ్ కానీ, ఫోటో కానీ ఇవ్వండి కచ్చితంగా మీ ఆడపిల్ల ఆ కుటుంబంలో అడుగుపెట్టిన తర్వాత, మీకు అత్త వారికే కూడా ధనం ధాన్యానికి అలాగే ధనస్సు వృద్ధి కూడా పెరుగుతుంది. అమ్మవారిని తీసుకు వెళ్లడం వల్ల అన్నపూర్ణాదేవిని పూజించడం వల్ల ఆ ఇంట్లో ధనానికి ధాన్యానికి లోటు అనేది రాదు,పుట్టింటి నుండి వెళ్లేటప్పుడు చిన్న కృష్ణుడి బొమ్మ కానీ ఫోటో కానీ తీసుకు వెళ్ళవచ్చు, దానివల్ల సంతానం అభివృద్ధి చెందుతుంది. వారికి మంచి యోగ్యమైన పురుష సంతానం కూడా కలుగుతుంది. రామాయణం బుక్కును కూడా ఇవ్వవచ్చు, ఇలా రామాయణం ఇవ్వడం వల్ల, కూడా భార్యాభర్తల మధ్య ప్రేమానురాగాలు పెరుగుతాయి. కాబట్టి వెళ్తున్నప్పుడు ఇలాంటివి ఏవైనా ఇవ్వవచ్చు.

ఆడపిల్లని పంపించేటప్పుడు వినాయకుడి బొమ్మను కానీ, వినాయకుడి ఫోటోను కానీ ప్రతిమలు కానీ ఇవ్వకూడదు. కొంతమంది పెళ్లిళ్లు గిఫ్ట్ గా వచ్చాయి కదా అని ఇస్తూ ఉంటారు, అలా గిఫ్టు వస్తే పర్వాలేదు కానీ మనం కొనివ్వకూడడు, అలా ఇవ్వడం వల్ల గణపతితో పాటు లక్ష్మీదేవి కూడా ఉంటుంది. లక్ష్మీదేవి గణపతిని ఇచ్చేసినప్పుడు, లక్ష్మీదేవి కూడా వెళ్ళిపోతుంది అని పెద్దలు చెబుతూ ఉంటారు. కాబట్టి వినాయకుడితో పాటు లక్ష్మీ పూజ కూడా చేస్తూ ఉంటాము కాబట్టి, వినాయకుడి ప్రతిమను ఇవ్వకూడదు, చీపురు ఇవ్వకూడదు, కత్తులు, కత్తిపీటలు, కత్తెరలు, సూదులు, షార్ప్ గా ఉండేవి ఏవి కూడా కాపురానికి వెళుతున్నప్పుడు తీసుకువెళ్లకూడదు.

నూనె ప్యాకెట్లు కూడా తీసుకువెళ్లకూడదు, దానివల్ల మీకు కుటుంబంలో ఆర్థిక సమస్యలు రావడానికి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి.కత్తులు సూదులు కత్తెరలు లాంటివి ఇవ్వడం వల్ల ఏం జరుగుతుంది అంటే, భార్యాభర్తల మధ్య ఎప్పుడూ తగాదాలు వస్తూ ఉంటాయి, చీటికిమాటికి గొడవ పడుతూ ఉంటారు, అత్తగారు ఆడపడుచులతో కూడా ఎప్పుడూ గొడవ పడడానికి అవకాశం ఉంటుంది, కాబట్టి కత్తెరలు అలాంటిది ఇవ్వకూడదు,అలాగే మహాభారత గ్రంథాలు కూడా ఇవ్వకూడదు, రామాయణం ఇవ్వవచ్చు కానీ, మహాభారతం ఇవ్వకూడదు, ఎందుకంటే గొడవలు ఎక్కువగా ఉండే వాటిని కూడా ఇవ్వకూడదు అని చెబుతూ ఉంటారు. అలాగే ఒకవేళ తీసుకుంటే ఏమవుతుంది అని అనుమానం ఉంటుంది, అత్తగారికి అలాగే కుటుంబ సభ్యుల మధ్య లేనిపోని చికాకులు వస్తాయని, పెద్దలు చెబుతూ ఉంటారు..