బంగారం కంటే విలువైన ఇవి కనిపిస్తే…!

మానవుని ఆరోగ్యం కోసం ఆ భగవంతుడు కొన్ని మొక్కలను సృష్టించాడు. వారి ఆరోగ్యాన్ని వారే బాగుచేసుకునేలా ఆమొక్కల్లో ఔషద తత్వాన్ని నింపి మహర్షుల ద్వారా ఆమొక్కలను మానవాళికి పరిచయం చేసాడు .అలాంటి ఎన్నోమొక్కలు ఈ భూమి మీద ఉన్నాయి అలాంటి వాటిలో ఉత్తరేణి ఒకటి . ఈ మొక్క పల్లెల్లో, రోడ్లపక్కన అధికంగా కనిపించే ఉత్తరేణి మొక్క మరియు విత్తనాలు కార్బోహైడ్రేట్లు, ప్రోటీన్లు మరియు ఫ్లేవనాయిడ్లు, టానిన్లు, సాపోనిన్లు వంటి కొన్ని రసాయనాలు సమృద్ధిగా ఉంటాయి, ఇవి ప్రతివ్యక్తి ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి సహాయపడతాయి.ఆయుర్వేదం ప్రకారం, అచీరంతెస్ ఆస్పెరా(ఉత్తరేణీ ) పౌడర్‌ను తేనెతో తీసుకోవడం వల్ల దాని ఆకలి కలిగించే మరియు జీర్ణంచేసే లక్షణాల వల్ల జీర్ణక్రియ మెరుగుపడుతుంది.

కొన్ని అచైరాంథెస్ ఆస్పెరా విత్తనాలను క్రమం తప్పకుండా తీసుకోవడం వల్ల అధిక కొవ్వు చేరడం తగ్గించి కొవ్వు తయారవకుండా చేయడం ద్వారా బరువును అదుపులో ఉంచడానికి సహాయపడుతుంది.గాయం అయిన ప్రదేశంలో అచైరాంథెస్ ఆస్పెరా ఆకుల రసాన్ని నేరుగా పూయడం వల్ల దాని రక్తస్రావం మరియు బాక్టీరియల్ నిరోధకత కారణంగా గాయం నయం అవుతుంది. యాంటీ అల్సర్ మరియు గ్యాస్ట్రోప్రొటెక్టివ్ యాక్టివిటీ కారణంగా అల్సర్ నుండి ఉపశమనం పొందటానికి కూడా దీనిని ఉపయోగించవచ్చు.అచీరంతెస్ ఆస్పెరా యొక్క ఆకులు లేదా రూట్ పేస్ట్ ను నీరు లేదా పాలతో కలిపి వాడటం వలన సంతానంలేనివారికి సంతానభాగ్యం కలుగుతుంది. కుక్క కాటుకు కూడా ఈ ఆకుల రసం ఉపయోగపడుతుంది. ఈ ఆకుల రసాన్ని తీసుకుని తేనెలో కలిపి తీసుకుంటే కుక్క కాటు విషం విరిగిపోతుంది.

అలాగే గర్బశుద్ధికి, బహిష్టు సమయంలో అధిక రక్తస్రావం తగ్గడానికి, నెలసరి క్రమం తప్పకుండా రావడానికి ఈ ఆకుల రసం ఉపయోగపడుతుంది. కాలేయం, ప్లేహం శుద్దికి రక్తం వృద్ధి చెందడానికి, చర్మం కాంతివంతంగా అవడానికి దోహదపడుతుంది. ఈ ఆకులు మరియు వేర్లను సమానంగా తీసుకుని ఎండబెట్టాలి.ఇవి పొడిలా మారిన తర్వాత ఇందులో పటికబెల్లం కలిపి తీసుకోవడం గర్బసమస్యలు తగ్గుతాయి. ఈ రసాన్ని నేరుగా చర్మంపై పూయకూడదు. ఎందుకంటే చర్మంపై రాసినప్పుడు చర్మం దద్దుర్లు కలిగి చర్మపు చికాకుకు దారితీస్తుంది.రక్తమొలలతో బాధపడేవారు యాభై గ్రాముల ఆకుల రసానికి యాభై గ్రాముల నెయ్యి కలిపి తీసుకోవడంవలన ఎలాంటి రక్తమొలలైనా నయమవుతాయి. మూత్రపిండాల్లో రాళ్ళతో బాధపడేవారు ఈ ఆకులను నీళ్ళతో నూరి రసాన్ని తీసుకుంటే రాళ్ళు మూత్రంద్వారా బయటకు వెళ్ళిపోతాయి.స్త్రీలలో సుఖప్రసవానికి ఈ ఆకులరసాని నేతితో కలిపి పట్టేవారు పూర్వం. దీనిని అనేక పేర్లతో పిలుస్తారు. అవి చిర్చిరా, అధోగంట, అధ్వశల్య, అఘమర్గావ, అపాంగ్, సఫేద్ అఘేడో, అంగడి, అంధేడి, అఘేడా, ఉత్తరాణి, కడలాడి, కటలాటి.