బీర్ ఎలా తాగితే మంచిది ? లాభాలు, నష్టాలు సంగతేంటి….

బీరు తాగడం అనేది ఆరోగ్యానికి పెద్ద హాని ఉండదని చాలామంది అంటూ ఉంటారు. అంటే ఇతర వెరైటీస్ ఏమన్నా తాగితే లివర్ ఇలాంటి వాటికి ఎఫెక్ట్ అవుతుంది కానీ, వీరు వల్ల ఎవరికి ఏమీ కాదని చాలామంది అనుకున్న దాంట్లో ఎంత సత్యం ఉన్నది, అనేది సైంటిఫిక్ గా క్యాలిక్యులేషన్ తీస్తే ఒక బీర్ 650 ml తీసుకున్నప్పుడు, అందులో ఆల్కహాల్ పర్సంటేజ్ బీర్ తయారు చేసే కంపెనీని బట్టి, 4-10% మధ్యలో ఆల్కహాల్ పర్సంటేజ్ వేరియేషన్ ఉంటుంది.

ఆల్కహాల్ పర్సంటేజ్ పెరిగే కొద్దీ మనకు కొద్దిగా మత్తు లేదంటే లివర్ హ్యాండిల్ చేసే విధానంలో కాస్త ఇబ్బందులు ఏర్పడడం అనేది ఆధారపడి ఉంటుంది. ఈ 4-10% మధ్యలో ఆల్కహాల్ ఉండే బీర్ ని మనం త్రాగినప్పుడు 355 ఎంఎల్ వరకు మాత్రం లివర్ ఏ రోజుకు ఆ రోజు దాన్ని ఫ్రీగా హ్యాండిల్ చేసి దానివల్ల ఎలాంటి నష్టం కలగకుండా క్లియర్ చేసుకునే అవకాశం ఉంది అని ఇంతవరకు మాత్రం క్లియర్ చేయగలుగుతుందని సైంటిఫిక్ గా నిరూపించారు.

అంటే 355 ఎంఎల్ అంటే మరొక 300 ml మనం బాడీ లోపలికి ఒక బీర్ త్రాగడం ద్వారా లోపలికి వెళ్ళింది అప్పుడు దాన్ని లివర్ కాస్త ఇబ్బంది పడుతుంది, లివర్ ఫ్రీగా దాన్ని హ్యాండిల్ చేసి తొలగించుకోలేదు అని క్లియర్ గా ఉంది. అసలు బీరు త్రాగడం మొదలు పెట్టిన తర్వాత 300 మాత్రమే త్రాగి ఎవరు వదిలిపెట్టరు సీసా సీసా ఎత్తుతారు, మరి అలాంటి ఆల్కహాల్ కి అలవాటు పడ్డటువంటి మనసు కొన్ని రోజుల్లో కంట్రోల్లో ఉండొచ్చు కానీ ఒక్కొక్కసారి మానసిక ఒత్తిడి స్ట్రెస్ అదుపు తప్పే స్థితి వచ్చినప్పుడు ఆలోచనలో కొన్ని బర్డెన్స్ లో ఆటోమేటిక్గా మనం కంట్రోల్ తప్పిపోతాం.

ఆటోమేటిక్గా ఒత్తిడి నుండి బయటపడడానికి అప్పుడు ఇతర వాటికి వెళ్లి పోతాము అందుకని ఇది ఒక వ్యసనం ఇది ఒక చోట నుండి మరొక చోటికి మనల్ని లాక్కెళ్తుంది. కాబట్టి ఈ ఆల్కహాల్ ద్వారా ఒక బీరు తాగితే, మీకు 650 ml బీరు తాగినప్పుడు 200 కిలో క్యాలరీలా ఎనర్జీ లభిస్తుంది, మరి 100 ఎంఎల్ బీరు తీసుకుంటే 4 నుండి 8 గ్రాముల పిండి పదార్థాలు కార్బోహైడ్రేట్స్ వస్తాయి, 4-10% ఆల్కహాల్ 100 ml బీరులో ఉంటుంది, దీని ద్వారా శరీరానికి ఉపయోగపడేది ఏమీ రావు కానీ ఆ డోస్ మించినప్పుడు ఈ ఆల్కహాల్ పర్సంటేజ్ లివర్ 355 ml దాటి మనం త్రాగినప్పుడు, దాన్ని హ్యాండిల్ చేయలేదు.

కాబట్టి దాని యొక్క ప్రభావం ఆల్కహాల్ యొక్క మత్తు మన లివర్ మీద బాడీసెల్స్ మీద కొంత ఉండి, నైట్ జరగాల్సిన డిటాక్సిఫికేషన్ ప్రక్రియకి బాడీ రిలాక్స్ కి ఈ మత్తు అనేది, కాస్త ఆటంకం కలిగిస్తుంది. కొన్ని హార్మోన్స్ నైట్ రిలీజ్ అవ్వాల్సినవి వీటి వల్ల డిస్టర్బ్ అవుతూ ఉంటాయి, కాబట్టి శరీరానికి ఏ విధమైన లాభం కలిగించకుండా, నిదానంగా అనేక రకాల నష్టాలను కలిగించే ఇలాంటి వాటి వైపు వెళ్లకుండా, మనం మానేయడం మంచిదని తెలియజేస్తున్నాము, ఏమి నష్టం లేదు అనుకునే దాంట్లో ఇంత ఎంఎల్ వరకే నష్టం లేదని, మీకు తెలిస్తే దానికి మించి మోతాదు పెరిగినప్పుడు నష్టం ఉందని తెలిస్తే జాగ్రత్త పడతారని విజ్ఞప్తి చేస్తున్నాము.