భోజనం తర్వాత ఇది ఒకటి తింటే షుగర్ రమ్మన్నరాదు….

తమలపాకు, దీన్ని సాధారణంగా కొందరు భోజనం తర్వాత తీసుకుంటూ ఉంటారు, అలాగే కొంతమంది తీసుకోరు. అయితే తమలపాకు వల్ల కూడా చాలా రకాల ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయంటున్నారు డాక్టర్ గారు. అయితే తమలపాకును తీసుకోవడం వల్ల ఎలాంటి హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయి? ఎవరు తీసుకోవాలి ఎలా తీసుకోవాలి? షుగర్ పేషెంట్స్ కూడా తీసుకుంటే మంచి బెనిఫిట్స్ ఉంటున్నాయి అని అంటున్నారు డాక్టర్ గారు. అయితే తమలపాకులను ఏ విధంగా తీసుకోవాలి? తమలపాకు తీసుకోవడం వల్ల ఎలాంటి బెనిఫిట్స్ ఉన్నాయో మనం తెలుసుకుందాం. సాధారణంగా చాలామంది వేపాకును నమ్ముతుంటారు అలాగే తమలపాకు వల్ల కూడా షుగర్ పేషెంట్స్ కి ఉపయోగాలు ఉన్నాయా అంటే! తమలపాకును శుభ, అశుభ కార్యక్రమాలలో మనం ఉపయోగిస్తూ ఉంటాం.

వివాహ సందర్భంలో నిశ్చితార్థ సందర్భంలో నిశ్చితార్థం అనకుండా తాంబూలం అంటారు. కనుక విశిష్టమైన ప్రాధాన్యత మన పూర్వీకులు దీనికి కల్పించారు. అంటే తమలపాకులు ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి, ఈ తమలపాకులతో కిల్లిలను తయారుచేస్తారు వీటిని పాన్ అంటారు. మనం దాని లోపల ఏ పదార్థం వేయకుండా సున్నము వద్దు వక్కపొడి వద్దు సోంపు వద్దు ఇలా ఏమీ లేకుండా కేవలం ఆకులు నమిలితే మనం ఎలాగైతే తులసి ఆకులు నములు తాము ఆ విధంగా నమలడం ద్వారా దీనిలో ఉండే ఆరోగ్య ప్రయోజనాలు మనం పొందవచ్చు. ఈ తమలపాకు కాడ ఉంటుంది దాన్ని తొడిమ అంటారు దాన్ని మీరు కిల్లి కట్టే వారి దగ్గరికి వెళితే దాన్ని కత్తిరిస్తారు. ఈ తమలపాకు కాడ అనేది మంచిది కాదు.

ముఖ్యంగా కాడలో కొన్ని అనర్ధాలు ఉన్నాయి. అందుచేత వారు అదేపనిగా ఆకాడను కత్తిరించేస్తారు. బీపీ రక్తపోటు ఉన్నవారు గర్భిణిగా ఉన్నవారు కాడలలో కొన్ని హానికరమైన పదార్థాలు ఉంటాయి. కనుక తప్పనిసరిగా కాడను తొలగించి మాత్రమే తమలపాకును వినియోగించాలి. తమలపాకులో మనం సున్నం వేసుకోవాలి వక్క వేసుకోవాలి ఇవన్నీ అవసరం లేదు, తమలపాకులోనే విశిష్టమైన ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. అందులో మొట్టమొదటిది కీలకమైనదే షుగర్ వ్యాధి డయాబెటిస్ మధుమేహం ఉన్నవారికి ఎంతో మేలు జరుగుతుంది. రక్తంలో షుగర్ ని నియంత్రిస్తుంది.

షుగర్ లేని వారికి ప్రతిరోజు రెండు ఆకులు లేదంటే ఉదయం ఒక ఆకు మధ్యాహ్నం ఒక ఆకు రాత్రిపూట ఒక ఆకు దాన్ని నమలడం ద్వారా దాని నుండి మనం విశిష్టమైన ఆరోగ్య ప్రయోజనాలను పొందవచ్చు,షుగర్ నియంత్రణ షుగర్ నివారణ రెండిటికి కూడా ఇది పనికి వస్తుంది. రెండవది ఇది మన పూర్వీకులు తమలపాకు తాంబూలంలో జీర్ణశక్తి బాగా ఉందని గమనించారు. జీనరసాలు అయినా జటరసము, క్లోమరసము, పైత్య రసముఉత్పత్తి బాగా పెరిగి జీర్ణక్రియ సాఫీగా జరుగుతుంది, అజీర్తిని నివారిస్తుంది, గ్యాస్ ట్రబుల్ ఉన్నవారికి గ్యాస్ నివారణకు మరియు పులుపు పుల్లటి తేనుపులు ఉన్నవారికి కూడా మంచి ఫలితం లభిస్తుంది